'ఆదర్శ కుటుంబం' మామూలు కుటుంబం కాదు.. ఇది వేరే లెవెల్: విక్ట‌రీ వెంక‌టేష్

ఈ గీతావిష్కరణ వేడుక ఘనంగా జరగగా..చిత్ర బృందమంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.

Update: 2026-09-28 03:44 GMT

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం `ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 - AK47`. ఈ సినిమా నుంచి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొదటి గీతం `నారాయణమ్మ` తాజాగా విడుదలైంది. ఎస్.ఎస్. తమన్ స్వరాలు సమకూర్చిన ఈ హుషారైన పాటను ప్రభ - రామ్ మిరియాల ఆలపించగా, ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు.

ఈ `నారాయణమ్మ` పాటలో డింపుల్ హయాతి తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, వైబ్రెంట్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డింపుల్‌తో పాటు ప్రధాన తారాగణమైన విక్టరీ వెంకటేష్, శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ తదితరులు సందడి చేసి ఈ గీతాన్ని ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్‌గా మార్చేశారు. ఈ సినిమా పూర్తిస్థాయి కుటుంబ వినోదాన్ని అందించేలా ఉంటుందని ఈ పాట ద్వారా స్పష్టమవుతోంది.

ఈ గీతావిష్కరణ వేడుక ఘనంగా జరగగా..చిత్ర బృందమంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. దాదాపు 20 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. `నువ్వు నాకు నచ్చావ్`, `మల్లేశ్వరి` వంటి క్లాసిక్ లవ్ స్టోరీల తర్వాత ఈ సినిమా కోసం త్రివిక్రమ్ మరో అద్భుతమైన కథను, ఫ్రెష్ ట్రీట్‌మెంట్‌ను తీసుకువచ్చారని కొనియాడారు.

ఈ సినిమా ఆడియో లాంచ్ వేదికపై వెంకటేష్ మాట్లాడుతూ మూవీ విశేషాలను షేర్ చేసారు. ఈ చిత్రంలో విపరీతమైన ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్, సెంటిమెంట్‌తో పాటు ఊహించని ఎన్నో ట్విస్టులు, టర్న్స్ ఉంటాయని.. ప్రేక్షకులు సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆదర్శ కుటుంబం అనేది మామూలు కుటుంబం కాదని.. ఇది వేరే లెవెల్ అని పేర్కొన్నారు.

చివరగా జీవితంలో ఎప్పుడూ అందరికీ మంచి జరగాలని కోరుకోవాలని.. ఎన్ని ప్రణాళికలు ఉన్నా దేవుడిని నమ్ముకుంటే ఆయనే అన్నీ చూసుకుంటాడని తన వ్యక్తిగత అనుభవంతో చెప్పుకొచ్చారు. ఈ ఈవెంట్లో గీత రచయిత రామజోగయ్య శాస్త్రి కోరిక మేరకు వెంకటేష్ స్టేజిపై `నారాయణమ్మ` పాటకు సంబంధించిన కొన్ని లైన్లను సరదాగా పాడి అభిమానులను ఎంతగానో అలరించారు.

Tags:    

Similar News