కింగ్ డమ్.. అతను కనిపిస్తే అరుపులు కేకలు..!
విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమాలో మలయాళ నటుడు వెంకటేష్ నటించాడు. సినిమాలో మురుగన్ రోల్ లో అతను అదరగొట్టాడు.;
విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమాలో మలయాళ నటుడు వెంకటేష్ నటించాడు. సినిమాలో మురుగన్ రోల్ లో అతను అదరగొట్టాడు. మలయాళంలో సైడ్ యాక్టర్ నుంచి చిన్న చిన్న రోల్స్ చేస్తూ వచ్చి తమిళ్ లో విలన్ గా ప్రమోట్ అయ్యాడు వెంకటేష్. ఇక తెలుగులో విజయ్ దేవరకొండ కింగ్ డంలో ఛాన్స్ అందుకున్నాడు. గౌతం తిన్ననూరి వెంకటేష్ లోని టాలెంట్ ని గుర్తించి తను రాసుకున్న మురుగన్ రోల్ కి తీసుకున్నాడు. గౌతమ్ ఎంపిక చేసినట్టే వెంకటేష్ ఇంప్రెస్ చేశాడు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే తన మాటలతో..
ముఖ్యంగా కింగ్ డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే తన మాటలతో ఆడియన్స్ లో ఒక డిస్కషన్ పాయింట్ అయ్యాడు వెంకటేష్. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 9 ఏళ్లుగా ఒక నటుడు గా తన ప్రయాణం చెప్పిన వెంకటేష్ మాట్లాడిన 5 నిమిషాల్లో ఆడియన్స్ తనని గుర్తుంచుకునేలా చేశాడు. అంతేకాదు తనకు కార్ వ్యాన్ ఇచ్చిన సినిమా ఇదని అన్నాడు వెంకటేష్.
ఐతే ఇతనెవరు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు అనుకున్నారు ఆడియన్స్. ఇక తన స్పీచ్ నచ్చితే సినిమాలో తను కనిపించగానే అరవాలని అన్నాడు వెంకటేష్. తను చెప్పినట్టుగానే మురుగన్ పాత్ర తెర మీద కనిపించగానే ఆడియన్స్ అల్లరి చేస్తున్నారు. సో వెంకటేష్ ఆడియన్స్ పల్స్ బాగా పట్టేశాడని అర్థమైంది. అంతేకాదు ఇచ్చిన పాత్రకు అతను మెప్పించాడు.
విలన్ పాత్రలు డల్ అవుతున్నాయి..
ఈమధ్య స్టార్ సినిమాల్లో సరైన విలన్లు లేక విలన్ పాత్రలు డల్ అవుతున్నాయి. అందుకే విలన్ రోల్ కి స్ట్రాంగ్ నెస్ తెచ్చేందుకు వేరే హీరోలని తీసుకుంటున్నారు. కానీ వెంకటేష్ మాత్రం విలన్ గా ఇంప్రెస్ చేశాడు. చూస్తుంటే తెలుగులోనే ఇతనికి మంచి ఛాన్స్ లు వచ్చేలా ఉన్నాయి.
టాలెంట్ ఉన్న వాళ్లకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వెంకటేష్ ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా తన మాటలతో మాయ చేస్తున్నాడు. ఇంత టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ కి కచ్చితంగా మంచి అవకాశాలే వస్తాయి. కింగ్ డం విషయంలో మాత్రం వెంకటేష్ న్యాయం చేశాడు. సో ఇక మీదట వెంకటేష్ విలన్ గా ఎలాంటి వేరియేషన్స్ చూపిస్తాడో చూడాలి. కుర్రాడి టాలెంట్ ఆడియన్స్ గుర్తించారు కాబట్టి ఇక అతనికి తిరుగు ఉండదు. కింగ్ డం తర్వాత అతను నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో చూడాలి.