హీరో ఫోన్ ఎత్త‌ లేదని నిర్మాత ఆవేద‌న‌!

బాలీవుడ్ సీనియర్ నిర్మాత వాషూ భగ్నానీ ఇటీవల దుబాయ్ లో నిర్వహించిన ఓ వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2026-05-23 09:30 GMT

బాలీవుడ్ సీనియర్ నిర్మాత వాషూ భగ్నానీ ఇటీవల దుబాయ్ లో నిర్వహించిన ఓ వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు డేవిడ్ ధావన్-ఆయ‌న‌ కుమారు,డు నటుడు వరుణ్ ధావన్‌లతో తనకున్న‌ విభేదాలను బహిర్గతం చేశారు. 2020లో విడుదలైన `కూలీ నెం 1` రీమేక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న తర్వాత పరిశ్రమలో నమ్మకాలు ఆర్థిక ప్రయోజనాలు నైతిక విలువలు ఎలా దెబ్బతిన్నాయో? ఈ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. తాను పేరుకే నిర్మాతగా ఉన్నానని, ఖర్చుల వ్యవహారమంతా డేవిడ్ ధావన్ చేతుల్లోనే నడిచిందని పేర్కొన్నారు.

కోవిడ్ సమయంలో సినిమా ప్లాప్ అయినా? దర్శకుడికి ఆయన మార్కెట్ విలువ కంటే ఎక్కువగా 70 కోట్లు చెల్లించానని చెప్పారు. అయితే సినిమా పరాజయం పాలవడంతో తనకు 27 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని అంతటి నష్టాన్ని భరించాల్సి రావడం నిర్మాతగా తనను కోలుకోలేని దెబ్బ తీసిందని వివరించారు. సినిమా ఫ్లాప్ అయిన తర్వాత హీరో వరుణ్ ధావన్ ప్రవర్తించిన తీరు తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని భగ్నానీ ఆరోపించారు. వరుణ్ ధావన్ తనకు ఒక బిడ్డ లాంటివాడని, పిల్లలు తప్పులు చేయడం సహజమేనని అన్నారు.

అయితే అంతటి నష్టం వచ్చినప్పుడు కనీసం ఫోన్ చేసి `అంకుల్‌కు నష్టం వచ్చింది కదా, దాన్ని ఎలా పూడ్చాలి?` అని అడగడానికి కూడా వరుణ్ ప్రయత్నించలేదని గత రెండేళ్లుగా కనీసం పలక రించకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేయడం తనను ఎంతగానో బాధించిందని వాపోయారు. కోవిడ్ సమయంలో సంభవించిన ఈ నష్టాన్ని భవిష్యత్తులో భర్తీ చేస్తానని డేవిడ్ ధావన్ తనకు అప్పట్లో హామీ ఇచ్చారని వాషూ తెలిపారు. అందులో భాగంగా తమ పాత సూపర్ హిట్ చిత్రం `బీవీ నెం. 1` సీక్వెల్ చేద్దామని ప్రతిపాదించడంతో తాము ఆరు నెలల పాటు ఆ స్క్రిప్ట్‌పై పనిచేశామన్నారు.

అయితే అకస్మాత్తుగా ఒకరోజు స్క్రిప్ట్ సిద్ధంగా లేదని చెప్పి ఆ తర్వాత డేవిడ్ ధావన్ ,రమేష్ తౌరానీ రహస్యంగా చేతులు కలిపి మరో సినిమా ప్రయాణం ప్రారంభించారని తెలిసి తాను ఎంతో కలత చెందినట్లు వివరించారు. తాను పరిశ్రమలో ఎవరికీ అన్యాయం చేయలేదని కానీ తనను ఒక మూర్ఖుడిగా, తప్పు చేసినవాడిగా చిత్రీకరించడానికి వరుణ్ ధావన్, డేవిడ్ ధావన్ రమేష్ తౌరానీ ప్రయత్నిస్తుండటం హృదయాన్ని ముక్కలు చేసిందని వాషూ ఆవేదన చెందారు.

Tags:    

Similar News