సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వరుణ్ ధావన్ ‘చున్రీ చున్రీ’ రీమిక్స్ సాంగ్!
ఇన్నేళ్ల తర్వాత దర్శకుడు డేవిడ్ ధావన్ తన కొడుకు వరుణ్ ధావన్ సినిమా కోసం ఈ పాటను మళ్లీ రీక్రియేట్ చేశారు.
బాలీవుడ్ లో 90ల కాలంలో సల్మాన్ ఖాన్, సుస్మితా సేన్ స్టెప్పులేసిన ‘చున్రీ చున్రీ’ సూపర్ హిట్ సాంగ్ గుర్తుందా? ఇప్పుడు అదే ఐకానిక్ పాటను సరికొత్త మోడరన్ ట్విస్ట్‌తో రీమిక్స్ చేశారు. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ సినిమాలోని ఈ క్రేజీ సాంగ్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కలర్‌ఫుల్ ఎనర్జీ, అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో ఈ పాట యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఆ వివరాలు చూద్దాం..
మళ్లీ గుర్తొచ్చిన 90ల నాటి జ్ఞాపకాలు:
1999లో వచ్చిన ‘బీవీ నెంబర్ 1’ సినిమాలో సల్మాన్ ఖాన్, సుస్మితా సేన్ ల ‘చున్రీ చున్రీ’ పాట ఒక ఊపు ఊపింది. ఇన్నేళ్ల తర్వాత దర్శకుడు డేవిడ్ ధావన్ తన కొడుకు వరుణ్ ధావన్ సినిమా కోసం ఈ పాటను మళ్లీ రీక్రియేట్ చేశారు. ఇక పాత పాటలోని అదే స్పీడ్, అదే వైబ్‌ను కంటిన్యూ చేస్తూనే, ఈ తరం ఆడియన్స్‌కు నచ్చేలా పార్టీ ఎనర్జీతో ఈ కొత్త సాంగ్‌ను రెడీ చేశారు.
ముగ్గురు స్టార్ల క్రేజీ డ్యాన్స్:
ఈ పాటలో వరుణ్ ధావన్‌తో పాటు టాలీవుడ్ ముద్దుగుమ్మలు పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ కలిసి స్టెప్పులేశారు. ట్రైలర్‌లో ఈ పాట గ్లింప్స్ చూసినప్పటి నుంచే ఫ్యాన్స్ ఫుల్ సాంగ్ కోసం ఆత్రుతగా ఎదురుచూశారు. ఇప్పుడు సాంగ్ రావడంతో వరుణ్ ఎనర్జీ, పూజా, మృణాల్‌ల గ్లామర్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇక రీల్స్‌లో ఈ సాంగ్ ఇప్పుడే వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది.
కొత్త గొంతులతో కొత్త ట్యూన్:
అను మాలిక్ కంపోజ్ చేసిన ఒరిజినల్ ట్యూన్‌కు అక్షయ్, ఐపీ సింగ్ కలిసి కాస్త మోడరన్ టచ్ ఇచ్చారు. ఐపీ సింగ్, జోనితా గాంధీ, అసీస్ కౌర్, సుధీర్ యదువంశీలతో పాటు ఒరిజినల్ సాంగ్ పాడిన అనురాధ శ్రీరామ్ కూడా ఈ కొత్త వెర్షన్‌లో పాడటం విశేషం. ఇక ప్రముఖ ఆడియో కంపెనీ 'టిప్స్ మ్యూజిక్' ద్వారా ఈ పాట మార్కెట్లోకి వచ్చింది.
జూన్ 5న థియేటర్లలో సందడి:
పక్కా బాలీవుడ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ సినిమా రిలీజ్‌కు రెడీ అయిపోయింది. ఇక వచ్చే నెల జూన్ 5,న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. సినిమా రిలీజ్ కంటే ముందే ఈ పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచి మూవీపై అంచనాలను పెంచేసింది.
మొత్తానికి పాత సూపర్ హిట్ పాటలను రీమిక్స్ చేయడం బాలీవుడ్‌లో కామన్ అయినప్పటికీ.. ఈ ‘చున్రీ చున్రీ’ రీక్రియేషన్ మాత్రం పక్కాగా వర్కవుట్ అయినట్లే కనిపిస్తోంది.