'కుంభ' పాత్ర‌తో పృథ్వీరాజ్ ఇండియా బెస్ట్ పెర్ఫామ‌ర్‌గా నిరూపిస్తాడా?

మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి తన బహుముఖ ప్రజ్ఞతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు .. దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Update: 2026-10-16 16:30 GMT

మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి తన బహుముఖ ప్రజ్ఞతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు .. దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు , దర్శకుడు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళిల కాంబినేషన్లో వస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం `వారణాసి` టీమ్ నుంచి వచ్చిన ప్రత్యేక శుభాకాంక్షలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ `కుంభ` అనే శక్తివంతమైన ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నారు. పృథ్వీరాజ్ పుట్టినరోజును పురస్కరించుకుని మహేష్ బాబు తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా స్పందిస్తూ... ``హ్యాపీ బర్త్‌డే కుంభ.. ఈ సంవత్సరం మీకు ఎంతో అద్భుతంగా ఉండాలని, ఎల్లప్పుడూ ఆనందం కలగాలని కోరుకుంటున్నాను`` అంటూ రాసుకొచ్చారు. మహేష్ బాబు చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు ఇద్దరి అభిమానుల్లోనూ భారీ ఉత్సాహాన్ని నింపింది.

పుట్టినరోజు వేడుకల్లో భాగంగా `వారణాసి` చిత్రబృందం షూటింగ్ సెట్స్‌కి సంబంధించిన కొన్ని ప్రత్యేక వర్కింగ్ స్టిల్స్‌ను విడుదల చేసింది. సెట్‌లో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళితో పృథ్వీరాజ్ సుకుమారన్ కాస్త సీరియ‌స్ గా చర్చల్లో ఉన్న ఈ ఫోటోలు సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేశాయి. గతంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జోనాస్ పుట్టినరోజుల సందర్భంగా కూడా ప్రొడక్షన్ టీమ్ ఇదే తరహాలో సెట్స్ నుంచి ప్రత్యేక ఫోటోలను పంచుకుని అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే.

సుమారు 1200 కోట్ల అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ అంతర్జాతీయ స్థాయి గ్లోబ్‌ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్ - షోయింగ్ బిజినెస్ పతాకాలపై నిర్మిస్తున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల విజయం తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

మలయాళంలో నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా విజయం సాధించిన పృథ్వీరాజ్ సుకుమారన్.. ఈ చిత్రంలో మహేష్ బాబుకు పోటీగా `కుంభ` పాత్రలో కనిపించబోతుండటం సినిమాకు అతిపెద్ద ఆకర్షణగా మారింది. ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ఇండియన్ బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాలు , అభిమానులు పృథ్వీరాజ్ సుకుమారన్‌కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ `వారణాసి`తో ఆయన మరో ఘనవిజయాన్ని అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కుంభ పాత్ర‌తో పృథ్వీరాజ్ ఇండియా బెస్ట్ పెర్ఫామ‌ర్‌గా మ‌రోసారి నిరూపిస్తాడా? అన్న‌ది ఈ సినిమా విడుద‌ల త‌ర్వాత డిసైడ్ అవుతుంది.

Tags:    

Similar News