మెగా మేనల్లుడికి టచ్ లోకి వెళ్లిన శ్రీకాంత్ అడ్డాల!
శ్రీకాంత్ అడ్డాల పేరు వినగానే `కొత్త బంగారు లోకం`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` వంటి కుటుంబ కథా చిత్రాలు గుర్తుకు వస్తాయి.
శ్రీకాంత్ అడ్డాల పేరు వినగానే `కొత్త బంగారు లోకం`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` వంటి కుటుంబ కథా చిత్రాలు గుర్తుకు వస్తాయి. క్లీన్ ఎంటర్టైనర్‌లను రూపొందించడంలో ప్రత్యేక ముద్ర వేసుకున్న శ్రీకాంత్ ప్రస్తుతం కెరీర్‌లో కొత్త బాటలను వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ నుండి పరిచయమైన యువ హీరో వైష్ణవ్ తేజ్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నటించే అవకాశం ఉందనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.వైష్ణవ్ తేజ్ తన రీర్ మొదట్లో మాస్ - క్లాస్ అంశాలు కలగలిసిన కథలను ఎంచుకుని ప్రయోగాలు చేస్తున్నారు.
మరోవైపు శ్రీకాంత్ అడ్డాల తనదైన శైలిలో భావోద్వేగాలను పండించడంలో దిట్ట. ఇద్దరి కలయిక గనుక నిజమైతే అది ఖచ్చితంగా వైవిధ్యమైన ప్రయత్నం అవుతుంది. ముఖ్యంగా శ్రీకాంత్ అడ్డాల స్క్రిప్ట్‌లో ఉండే సహజత్వం ..వైష్ణవ్ తేజ్ నటనలోని గాఢత కలిస్తే ప్రేక్షకులకి కొత్త రకమైన వినోదాన్ని అందించొచ్చు. ప్రస్తుతం టాలీవుడ్‌లో యువ హీరోలు ప్రయోగాత్మక చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వైష్ణవ్ తేజ్ కూడా అదే బాటలో పయనిస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల లాంటి అనుభవజ్ఞుడైన దర్శకుడితో పని చేస్తే? అది అతని కెరీర్‌కి మంచి మలుపుగా మారొచ్చు.
శ్రీకాంత్ అడ్డాల కూడా తనదైన శైలి నుండి భిన్నమైన కథాంశాలను వెతుకుతు న్నారని సమాచారం. ఇద్దరి ఆలోచనలు కలిస్తే పవర్ ఫుల్ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ కాంబినేషన్ గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇండస్ట్రీలో ఇలాంటి చర్చలు జరగడం సాధారణమే అయినా? శ్రీకాంత్ అడ్డాల - వైష్ణవ్ తేజ్ భేటీపై జరుగుతున్న ప్రచారం ప్రాధాన్యతను సంతరిం చుకుంది. ఒకవేళ వీరు కలిసి పని చేస్తే? అది వైష్ణవ్ తేజ్ ఇమేజ్‌ను మారుస్తుందా లేక శ్రీకాంత్ అడ్డాల తన పాత ఫామ్‌ను తిరిగి అందుకుంటారా? అనేది చూడాలి.
స్క్రిప్ట్ లెవల్‌లో ఏమైనా చర్చలు జరుగుతున్నాయా? అనే దానిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఈ కాంబినేషన్ గురించి వినిపిస్తున్న వార్తలను బట్టి చూస్తుంటే కథా చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని తెలుస్తోంది. వైష్ణవ్ తేజ్ తదుపరి చిత్రాల ఎంపికలో జాగ్రత్తగా ఉంటున్నారు. శ్రీకాంత్ అడ్డాల కూడా తనదైన శైలి మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇద్దరి సమ్మేళనం ప్రేక్షకులకు ఎలాంటి కొత్త అనుభూతిని ఇస్తుందోనని మెగా అభిమానులు అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
దర్శక-నిర్మాతల సమన్వయంతో హీరోల ఎంపిక అనేది సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది. శ్రీకాంత్ అడ్డాల వంటి దర్శకుడు, వైష్ణవ్ తేజ్ వంటి యువ ప్రతిభను ఏ విధమైన కథతో ప్రేక్షకులకు పరిచయం చేస్తారో? అనేది చర్చనీయాంశం. ఈ క్రేజీ కాంబినేషన్ నిజమైతే అది మెగా ఫ్యామిలీలో మరో సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.