ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య కాలేజ్ ముచ్చ‌ట్లు ఇంట్రెస్టింగ్

చీటీల గేమ్‌లో హీరోయిన్ వైష్ణవి చైతన్యకు `కాలేజ్ స్టూడెంట్... అటెండెన్స్` అనే ప్రశ్న రాగా.. క్షణం కూడా ఆలోచించకుండా 100శాతం అని సమాధానమిచ్చారు.

Update: 2026-09-04 03:51 GMT

సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించే ప్రత్యేక ఇంటర్వ్యూలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. తాజాగా జరిగిన ఓ సరదా ఇంటర్వ్యూలో `ఎపిక్` చిత్రబృందం `కాలేజ్ స్టూడెంట్` అనే థీమ్‌ ఆధారంగా సాగిన చీటీల ఆటలో సందడి చేసింది. సినిమా థీమ్ కి త‌గ్గ‌ట్టే ప్ర‌శ్న‌లు ఆక‌ట్టుకున్నాయి. ఈ `ఫిల్ ఇన్ ది బ్లాంక్స్` సెగ్మెంట్‌లో నటీనటులు- ఇతర సాంకేతిక నిపుణులు తమ కాలేజీ జ్ఞాపకాలను, వినోదాత్మక విషయాలను షేర్ చేస్తూ అభిమానులను అలరించారు.

వైష్ణవి చైతన్య అటెండెన్స్ సీక్రెట్.. 100 శాతం పర్ఫెక్ట్:

చీటీల గేమ్‌లో హీరోయిన్ వైష్ణవి చైతన్యకు `కాలేజ్ స్టూడెంట్... అటెండెన్స్` అనే ప్రశ్న రాగా.. క్షణం కూడా ఆలోచించకుండా 100శాతం అని సమాధానమిచ్చారు. చదువు విషయాల్లో... అకడమిక్స్‌లో తాను చాలా స్ట్రిక్ట్‌గా ఉండేదాన్నని.. రోజూ క్రమం తప్పకుండా కాలేజ్‌కు వెళ్లేదాన్నని వైష్ణ‌వి చెప్పారు.. వైష్ణవి చెప్పిన ఈ సమాధానం త‌న‌కు చదువుపై ఉన్న శ్రద్ధను, క్రమశిక్షణను స్పష్టం చేస్తోంది.

ఆనంద్ దేవరకొండ స్టైల్.. 75 శాతం అటెండెన్స్ - పంక్చువాలిటీ:

ఇక హీరో ఆనంద్ దేవరకొండ విషయానికి వస్తే..అదే ప్రశ్న (కాలేజ్ స్టూడెంట్... అటెండెన్స్ ) కు ఆయన తనదైన శైలిలో స్పందించారు. కాలేజ్ విద్యార్థికి కనీసం 75శాతం అటెండెన్స్ ఉండాలని సమాధానమిచ్చారు. అలాగే ``కాలేజ్ రూల్ .. ఫస్ట్ రూల్ ..`` అనే ప్రశ్నకు స్పందిస్తూ సమయపాలన చాలా ముఖ్యమని పేర్కొన్నారు. కేవలం మాటల్లోనే కాకుండా, రియల్ లైఫ్‌లో .. షూటింగ్ సెట్స్‌లో కూడా తాను ఎప్పుడూ సరైన సమయానికే హాజరవుతానని ఆనంద్ చెప్పుకొచ్చారు.

బ్యాక్‌బెంచర్స్ గొప్పతనంపై టీమ్ స్పంద‌న‌:

ఈ గేమ్ సెగ్మెంట్‌లో `బ్యాక్‌బెంచర్` అనే అంశంపై చిత్రబృందంలోని ఒక సభ్యుడు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పూర్వం బ్యాక్‌బెంచర్లపై ఉన్న అపోహలు ఇప్పుడు లేవని.. నేటి కాలేజీలలో చివరి బెంచ్ విద్యార్థులకు ప్రత్యేకమైన నైపుణ్యాలు, ప్రతిభ ఉంటున్నాయని వ్యాఖ్యానించారు. కాలేజీ రోజుల్లో వెనుక బెంచ్‌లో కూర్చున్న ఎందరో విద్యార్థులు ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ డెవలపర్లుగా, గేమర్లుగా, స్టాండప్ కమెడియన్లుగా సక్సెస్ అయ్యారని.. కాబట్టి కూర్చునే బెంచ్ ఒకరి భవిష్యత్తును నిర్ణయించలేదని స్పష్టం చేశారు.

షూటింగ్ సెట్ డిసిప్లిన్ - ఇష్టమైన సబ్జెక్టులు:

కాలేజ్ లైఫ్‌లోని ఇష్టమైన సబ్జెక్టులు - నైపుణ్యాల గురించి మాట్లాడుకుంటూ... ప్రతీ విద్యార్థిలోనూ ఏదో ఒక ప్రత్యేకమైన ప్రాక్టికల్ స్కిల్ దాగి ఉంటుందని టీమ్ సభ్యులు అభిప్రాయపడ్డారు. దీనితో పాటు.. తమ సినిమా షూటింగ్ సెట్స్‌లో పాటిస్తున్న క్రమశిక్షణ గురించి దర్శకుడు .. ఇతర యూనిట్ సభ్యులు ప్రస్తావించారు. సమయపాలనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని.. హీరో ఆనంద్‌తో సహా నటీనటులందరూ అనుకున్న సమయం కంటే ముందే సెట్‌కి వచ్చి షెడ్యూల్స్ కచ్చితంగా పూర్తయ్యేలా సహకరిస్తారని వెల్లడించారు.

Tags:    

Similar News