క్రేజీ సినిమాల‌పై ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ఎఫెక్ట్‌!

ఒక్కరి కోసం తీసుకునే నిర్ణ‌యాలు ఎంతో మందిని ఎఫెక్ట్ చేస్తాయంటారు. అది `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌` విష‌యంలో అక్ష‌రాలా నిజ‌మైందా? అంటే నిజ‌మైంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.;

Update: 2026-04-01 07:50 GMT

ఒక్కరి కోసం తీసుకునే నిర్ణ‌యాలు ఎంతో మందిని ఎఫెక్ట్ చేస్తాయంటారు. అది `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌` విష‌యంలో అక్ష‌రాలా నిజ‌మైందా? అంటే నిజ‌మైంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. వివ‌రాల్లోకి వెళితే..ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఐదేళ్ల క్రితం అంగీక‌రించిన మూవీ `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌`. 2021లో `భ‌వ‌దీయుడు భ‌గ‌త్‌సింగ్‌` పేరుతో ఈ ప్రాజెక్ట్‌ని ప్ర‌క‌టించారు. కొత్త క‌థ‌, ప‌వ‌న్‌ని దృష్టిలో పెట్టుకుని హ‌రీష్ శంక‌ర్ ప్ర‌త్య‌కంగా రాసుకున్న క‌థ‌తో చేయాల‌నుకున్నారు. ఆ త‌రువాత స్టోరీ మారింది..టైటిల్ కూడా `భ‌వ‌దీయుడు భ‌గ‌త్‌సింగ్‌` కాస్తా `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌`గా మారింది.

2022 డిసెంబ‌ర్‌లో దీన్ని స్టార్ట్ చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీ రాజ‌కీయాల్లో బిజీగా ఉన్న కార‌ణంగా ఆయ‌న డేట్స్ వీలుని బ‌ట్టి షూటింగ్ చేస్తూ వ‌చ్చారు. ఫైన‌ల్‌గా సినిమాని పూర్తి చేసి 2026 మార్చి 26న రిలీజ్ చేయాల‌ని డేట్ ఫిక్స్ చేశారు. రామ్ చ‌ర‌ణ్ `పెద్ది` రిలీజ్ డేట్ మార్చి 27. బాబాయ్ సినిమా వ‌స్తుండ‌టంతో అబ్బాయ్ `పెద్ది` రిలీజ్‌ని టీమ్ ఏప్రిల్ 30కి మార్చేసింది. ఇక్క‌డే అస‌లు క‌థంతా మొద‌లైంది. `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌`, పెద్ది రిలీజ్ అయిపోతే సాఫీగా త‌మ త‌మ సినిమాల‌ని వ‌రుస‌గా థియేట‌ర్ల‌లోకి తీసుకురావ‌చ్చని చిన్న సినిమాలు, టైర్ టు హీరోల సినిమాలు ప్లాన్ చేసుకున్నాయి.

`ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌` స‌డ‌న్ ఎంట్రీతో వీటీ ప్లాన్ మొత్తం మారి త‌ల‌కిందులైపోయింది. `పెద్ది` రిలీజ్‌ని బ‌ట్టి థియేట‌ర్ల‌లోకి త‌మ సినిమాల‌ని కూడా తీసుకొచ్చేయాల‌ని అఖిల్ `లెనిల్‌`, నిఖిల్ స్వ‌యంభు, నాగ‌చైత‌న్య వృష‌క‌ర్మ‌, వరుణ్ తేజ్ `కొరియ‌న్ కనకరాజు`, సాయి ధ‌ర‌మ్ తేజ్ `సంబ‌రాల ఏటిగ‌ట్టు` వంటి టైర్ 2 హీరోల సినిమాల‌తో పాటు చిన్న సినిమాలు కూడా గ‌ట్టిగానే ప్లాన్ చేసుకున్నాయి. ప్ర‌మోష‌న్స్‌ని కూడా ప‌క్కా ప్ర‌ణాళిక‌తో సిద్ధం చేసుకున్నాయి. అయితే వాట‌న్నింటి ప్లానింగ్‌కు `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌` భారీ ఎఫెక్ట్ ఇచ్చింద‌ని చెబుతున్నారు.

అంతే కాకుండా `ధురంధ‌ర్ 2` కూడా తీవ్ర ప్ర‌భావాన్ని చూపించింద‌ని ట్రేడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. స‌మ్మ‌ర్ బ‌రిలో నిల‌వాల‌ని చాలా మంది హీరోలు త‌మ సినిమాల‌ని సిద్ధం చేసుకుని రిలీజ్‌కు రెడీ అయిపోయారు. కానీ వారి ప్లానింగ్‌కు భారీ షాక్ ఇచ్చాయి ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌, ధురంధ‌ర్ 2. ఈ రెండు సినిమాల కార‌ణంగా తెలుగులో టైర్ 2 హీరోల నుంచి చిన్న సినిమాల వ‌ర‌కు రిలీజ్‌ల‌ని వాయిదా వేసుకోవాల్సి వ‌చ్చింది. మార్చి 26న రావాల‌నుకున్న రామ్ చ‌ర‌ణ్ `పెద్ది` ఏప్రిల్ 30కి వెళ్లిపోయింది.

ఇప్పుడు అది కూడా కాద‌ని, రిలీజ్ జూన్‌కు మారింద‌నే వార్త‌లు షికారు చేస్తున్నాయి. దీంతో ప్ర‌తి సినిమా రిలీజ్ డేట్ మారిపోయి ప‌రిస్థితి అస్థ‌వ్య‌స్థంగా మారింద‌ని, ఒక్క సినిమా ఎన్నో సినిమాల భ‌విత‌వ్యాన్ని మార్చేసింద‌ని ప‌లువ‌రు టాలీవుడ్ వ‌ర్గాలు వాపోతున్నారు. `పెద్ది` అనుకున్న‌ట్టుగా ఏప్రిల్ 30నే వ‌చ్చేస్తే ఓకే లేదా చివ‌రి నిమిషంలో రిలీజ్ డేట్‌ని జూన్‌కి మార్చేశాం అంటే మిగ‌తా సినిమాల ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మారే అవ‌కాశం ఉంద‌ని, మేక‌ర్స్ ఈ విష‌యంలో క్లారిటీని ఇచ్చి `పెద్ది` ఏప్రిల్ 30నే వ‌చ్చేస్తుంద‌ని ప్ర‌క‌టించాల‌ని, అలా చేస్తేనే మిగ‌తా సినిమాల రిలీజ్‌ల‌కు ఎలాంటి క‌న్ఫ్యూజ‌న్ ఉండ‌ద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

Tags:    

Similar News