యష్ 'టాక్సిక్' కొత్త సాంగ్.. ఈసారి రొమాన్స్ అంతకుమించి..

కేజీఎఫ్ సిరీస్‌ తో పాన్ ఇండియా రేంజ్ లో భారీ గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యష్ ఇప్పుడు టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

Update: 2026-07-21 07:45 GMT

కేజీఎఫ్ సిరీస్‌ తో పాన్ ఇండియా రేంజ్ లో భారీ గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యష్ ఇప్పుడు టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆ మూవీ టీజర్, ఫస్ట్ సాంగ్ తబాహితో అంచనాలు పెంచిన మూవీ టీమ్.. తాజాగా సెకెండ్ పాట మనసాగదేను తీసుకొచ్చింది. అయితే ముఖ్యంగా ఈసారి రొమాన్స్ డోస్ మరింత పెరగడం అభిమానులతో పాటు సినీ ప్రియుల్లో హాట్ టాపిక్ గా మారింది.




 


గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాక్సిక్' చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచిన మేకర్స్ వరుసగా పాటలను విడుదల చేస్తున్నారు. మొదటి పాట తబాహిలో యష్, కియారా అడ్వాణీ మధ్య బోల్డ్ కెమిస్ట్రీని చూపించిన టీమ్.. ఇప్పుడు మనసాగదే పాటలో యష్, తారా సుతారియా మధ్య సాగే లవ్ స్టోరీని హైలైట్ చేసింది.

ఆ పాటలో యష్‌ ను ఇప్పటివరకు అభిమానులు చూడని యాంగిల్ లో చూపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేజీఎఫ్ లో కనిపించిన మాస్, యాక్షన్ ఇమేజ్‌ కు భిన్నంగా.. ఇక్కడ కేర్‌ ఫ్రీ, రొమాంటిక్ పర్సన్ గా కనిపిస్తున్నారు. తారా సుతారియాతో కలిసి కనిపించే సీన్స్ పాటకు ప్రధాన బలంగా మారాయి. బాత్‌టబ్ సీన్, గన్‌ తో ప్రపోజ్ చేసే సన్నివేశం, వర్షంలో ఇద్దరి మధ్య సాగే రొమాంటిక్ మూమెంట్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

అయితే పాటలో మరో విషయం కూడా చర్చనీయాంశమవుతోంది. నయనతార పాత్రకు సంబంధించిన కొన్ని షాట్లు అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా ఆమె సిగరెట్ తాగుతూ కనిపించడం, యష్‌ తో ఉన్న ఎమోషనల్ సీన్స్ కథలో ఆమె రోల్ ఇంపార్టెన్స్ పై కొత్త ప్రశ్నలను తెరపైకి తీసుకొస్తున్నాయి. దీంతో సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి పెరుగుతోంది.

మ్యూజిక్ పరంగా కూడా మనసాగదే పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తనిష్క్ బాగ్చీ, అర్స్లాన్ నిజామీ, ఫహీమ్ అబ్దుల్లా స్వరపరిచిన ఈ మెలోడీని సిద్ధార్థ్ బస్రూర్ ఆలపించారు. తెలుగు వెర్షన్‌ కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఐదు భాషల్లో విడుదలైన ఆ పాట విజువల్స్, మ్యూజిక్ కలిసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, తబాహి పాటపై కొంత విమర్శలు వచ్చినా.. మూవీ టీమ్ తగ్గినట్లు కనిపించడం లేదు.

యాక్షన్ కంటే ముందుగా పాత్రల మధ్య ఉన్న రిలేషన్స్, ఎమోషన్స్, రొమాన్స్‌ ను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తోంది. దీంతో టాక్సిక్ నిజంగా గ్యాంగ్‌ స్టర్ డ్రామానా? లేక లవ్ ఎమోషన్స్ కు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న కథనా? అనే చర్చ మొదలైంది. ఇప్పటికే తబాహితో వార్తల్లో నిలిచిన టాక్సిక్.. ఇప్పుడు మనసాగదేతో మరింత దృష్టిని ఆకర్షించింది. ట్రైలర్ విడుదలయ్యే సమయానికి సినిమా చుట్టూ మరింత హైప్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే యష్ కొత్త సాంగ్ చూసిన ప్రేక్షకులు ఈసారి మాత్రం మేకర్స్ రొమాన్స్ విషయంలో తబాహిని మించిపోయారని అంటున్నారు.



Full View


Tags:    

Similar News