క‌లిసొస్తున్న రెండు అక్షరాల టైటిల్ సెంటిమెంట్!

పరిశ్రమలో సెంటిమెంట్లు, ట్రెండ్స్ ఎప్పుడూ మారుతుంటాయి. అయితే ఇటీవల కాలంలో టాలీవుడ్ మేకర్స్ నయా సెంటిమెంట్‌ను తెరపైకి తీసుకొచ్చారు.

Update: 2026-08-25 12:30 GMT

పరిశ్రమలో సెంటిమెంట్లు, ట్రెండ్స్ ఎప్పుడూ మారుతుంటాయి. అయితే ఇటీవల కాలంలో టాలీవుడ్ మేకర్స్ నయా సెంటిమెంట్‌ను తెరపైకి తీసుకొచ్చారు. సినిమా టైటిల్ ఎంత క్యాచీగా షార్ట్ అండ్ స్వీట్‌గా ఉంటే ప్రేక్షకులకు అంత త్వరగా రిజిస్టర్ అవుతుందని దర్శక నిర్మాతలు గట్టిగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే రెండే రెండు అక్షరాల టైటిల్స్‌తో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తూ బాక్సాఫీస్ వద్ద ఇప్ప‌టికే కొంత మంది అదృష్టాన్ని ప‌రీక్షిం చుకోగా..మ‌రికొంత మంది పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు.

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబినేషన్‌లో రిలీజ్ అయిన `పెద్ది` సినిమా టైటిల్ చిన్నదైనా బాక్సాఫీస్ వద్ద భారీ ఇంపాక్ట్ చూపించింది. అలాగే లోకేష్ కనకరాజ్ హీరోగా న‌టించిన `డిసి` చిత్రం కూడా అంచనాలకు మించి కలెక్షన్లు రాబట్టింది. పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ కంబ్యాక్ మూవీగా వచ్చిన `ఓజి` టైటిల్ కూడా కేవలం రెండే అక్షరాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అప్ప‌టివ‌ర‌కూ వ‌రుస ప్లాప్ ల‌తో ఉన్న పీకే `ఓజీ` విజ‌యంతో కోలుకున్నారు.

ఈ నేపథ్యంలోనే అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌లకు కూడా మేకర్స్ ఇదే సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తున్నారు. ప్రభాస్ - హను రాఘవపుడి కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న‌ భారీ పీరియాడిక్ చిత్రానికి `ఫౌజీ` అనే రెండు అక్షరాల టైటిల్‌ను ఖరారు చేశారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి - బాబీ కలయికలో సంక్రాంతి కానుకగా రాబోతున్న చిత్రానికి `కాక` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అల్లరి నరేష్ ..ఇతర స్టార్ హీరోల చిత్రాల విషయంలోనూ ఇదే షార్ట్ టైటిల్ ఫార్ములాను ఫాలో అవుతున్నారు.

ఇదే కోవలో అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాకు `రాకా` అనే శక్తివంతమైన టైటిల్ ఖార‌రైంది. మరోవైపు గోపీచంద్ హీరోగా న‌టిస్తోన్న‌ కొత్త సినిమాకు `సింగ` అనే రెండు అక్షరాల పేరునే లాక్ చేశారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు టాప్ హీరోలంతా తమ సినిమాలకు షార్ట్ అండ్ స్వీట్ టైటిల్స్ పెట్టడానికి పోటీ పడుతున్నారు. సోషల్ మీడియా .. డిజిటల్ యుగంలో ప్రేక్షకులకు సులభంగా గుర్తుండిపోయేలా ఈ పేర్లు ఎంతగానో దోహదపడుతున్నాయి.

రెండు అక్షరాల సెంటిమెంట్ అప్‌కమింగ్ రిలీజ్ చిత్రాలకు కచ్చితంగా కలిసి వస్తుందని చిత్ర యూనిట్లు నమ్ము తున్నాయి. పెద్ద సినిమాలైనా? చిన్న సినిమాలైనా? టైటిల్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటే ఓపెనింగ్స్ అంత గట్టిగా వస్తాయని ట్రేడ్ వర్గాలు కూడా విశ్లేషిస్తున్నాయి. చిన్న పదంతో థియేటర్లలో భారీ ప్రకంపనలు సృష్టించవచ్చని ఈ ట్రెండ్ నిరూపిస్తోంది.

.

Tags:    

Similar News