నిర్మాతను ఎలా ముంచుతారంటే.. ఇదే ఉదాహరణ!

టాలీవుడ్‌లోకి హడావుడిగా దూసుకొచ్చిన ఆ బడా నిర్మాత ఇప్పుడు ‘వంద కోట్లు’ అనే మాట వింటేనే ఆమడ దూరం వెళ్తున్నారట.;

Update: 2026-04-18 10:30 GMT

టాలీవుడ్‌లోకి హడావుడిగా దూసుకొచ్చిన ఆ బడా నిర్మాత ఇప్పుడు ‘వంద కోట్లు’ అనే మాట వింటేనే ఆమడ దూరం వెళ్తున్నారట. కెరీర్ మొదట్లో వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు తీసి, రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో ఒక రేంజ్ క్రియేట్ చేసుకున్న ఆయన, ఇప్పుడు మాత్రం చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. లేటెస్ట్ గా ఒక పాన్ ఇండియా డైరెక్టర్ చెప్పిన వంద కోట్ల బడ్జెట్ ప్రపోజల్‌ను ఆయన నిర్మొహమాటంగా తిరస్కరించారు.

ఈ రిజెక్షన్ వెనుక అసలు కారణం కేవలం సినిమా ఫెయిల్యూర్ మాత్రమే కాదు, ఆయనకు ఎదురైన ఒక చేదు అనుభవం ప్రధాన కారణమని తెలుస్తోంది. సదరు నిర్మాత ఇటీవల ఒక స్టార్ హీరోతో కలిసి తీసిన భారీ చిత్రం బాక్సాఫీస్ వద్ద కోలుకోలేని దెబ్బ తీసింది. సినిమా ఫ్లాప్ అవ్వడం ఇండస్ట్రీలో సహజమే అయినా, ఆ మేకింగ్ టైమ్‌లో ఆయన నమ్మిన వ్యక్తులే ఆయనను నిలువునా ముంచారనే టాక్ వినిపిస్తోంది.

ప్రొడక్షన్ ఖర్చుల పేరుతో కోట్ల రూపాయల లెక్కలు తారుమారు చేశారని, కళ్లముందే నమ్మకస్థులే డబ్బులు నొక్కేశారని సదరు నిర్మాత తీవ్ర మనస్తాపానికి గురయ్యారట. వంద కోట్లు ఖర్చు పెట్టడం ఆయనకు పెద్ద లెక్క కాదు కానీ, ఆ పెట్టిన ప్రతి పైసా కరెక్ట్‌గా ఖర్చవుతుందా లేదా అనే విషయంలో ఆయనకు నమ్మకం పోయింది. పాన్ ఇండియా కథతో వచ్చిన ఆ డైరెక్టర్ చెప్పిన బడ్జెట్ వినగానే, ఈ పాత గాయాలు మళ్ళీ గుర్తొచ్చి ఆయన ‘నో’ చెప్పేశారని తెలుస్తోంది.

మరోవైపు, ఆ సినిమాకి అంత ఖర్చు అవసరం లేదని, డైరెక్టర్ కావాలనే బడ్జెట్‌ను పెంచి చూపించారనే గుసగుసలు నిర్మాత టీమ్ నుంచి వినిపిస్తున్నాయి. మేకర్స్ బ్యాడ్ ఫేజ్‌లో ఉన్నప్పుడు, భారీ బడ్జెట్లతో వారిని ఒప్పించాలనుకోవడం దర్శకులు చేసే పెద్ద పొరపాటు. కంటెంట్‌ను నమ్మే కంటే బడ్జెట్‌ను హైలైట్ చేసే వారికి ఇప్పుడు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం ఆ నిర్మాత తన పద్ధతి మార్చుకుంటున్నారు. ఇకపై భారీ సినిమాలు కాకుండా, తక్కువ బడ్జెట్‌లో మంచి కంటెంట్ ఉన్న సినిమాలపై ఫోకస్ పెట్టాలని ఫిక్స్ అయ్యారట. నమ్మకమే పెట్టుబడిగా సాగే ఈ ఇండస్ట్రీలో, ఒకసారి దెబ్బ తిన్న నిర్మాత మళ్ళీ కోలుకోవాలంటే అది కేవలం హిట్స్ వల్ల కాదు, ఆయన నమ్మకాన్ని నిలబెట్టే వ్యక్తుల వల్ల సాధ్యమవుతుంది. కేవలం స్టార్ పవర్ లేదా గ్రాండియర్ చూసి మురిసిపోకుండా, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడం మొదలుపెట్టారు.

స్టూడియోలో కూర్చుని గ్రాఫిక్స్ మీద కోట్లు కుమ్మరించడం కంటే, గ్రౌండ్ లెవల్‌లో స్క్రిప్ట్ మీద వర్క్ చేసే దర్శకుల కోసం ఆయన వెతుకుతున్నారు. వంద కోట్లు ఖర్చు చేసే సత్తా ఉన్నా, అది సరైన చేతుల్లో పడుతుందో లేదో అన్న అనుమానమే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడానికి రీజన్ అని తెలుస్తోంది. నమ్మకద్రోహం జరిగిన చోట మళ్ళీ కోట్లు పెట్టడం కంటే, చిన్న సినిమా అయినా సేఫ్ గా ఉండటమే బెటర్ అని ఆయన భావిస్తున్నారు. ఈ దెబ్బతో ఆయన సెలక్షన్ ప్రాసెస్ పూర్తిగా మారిపోయినట్లు సన్నిహితులు చెబుతున్నారు.

Tags:    

Similar News