స్టార్ హీరో మిత్రుడిపై ఏపీ సీఐడీ నిఘా.. అరెస్ట్ తప్పదా?
సాధారణంగా సినిమాల ప్రమోషన్ల కోసం ఇలాంటి వార్తలు పుట్టిస్తుంటారని కొందరు భావించినప్పటికీ, ఈసారి వ్యవహారం సీరియస్ గానే ఉన్నట్లు కనిపిస్తోంది.;
టాలీవుడ్‌లో గత కొన్ని గంటలుగా ఒక హాట్ టాపిక్ ఫిలిం సర్కిల్స్‌ను షేక్ చేస్తోంది. ఒక ప్రముఖ నిర్మాతను అరెస్ట్ చేసేందుకు ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్‌లో గాలింపు చేపట్టారనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. సదరు నిర్మాత ఒక టాలీవుడ్ స్టార్ హీరోకి అత్యంత సన్నిహితుడు కావడం ఇప్పుడు మరింత చర్చకు దారితీసింది. వ్యక్తిత్వ హననం.. అంటే వ్యక్తి గౌరవానికి భంగం కలిగించేలా చేశారనే కేసులో భాగంగానే పోలీసులు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ నిర్మాత ఎక్కడ ఉన్నారనేది తెలియకపోవడంతో పోలీసులు ముమ్మరంగా వెతుకుతున్నారని తెలుస్తోంది.
సాధారణంగా సినిమాల ప్రమోషన్ల కోసం ఇలాంటి వార్తలు పుట్టిస్తుంటారని కొందరు భావించినప్పటికీ, ఈసారి వ్యవహారం సీరియస్ గానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఏపీ సీఐడీ బృందాలు నేరుగా హైదరాబాద్ వచ్చి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం వెనుక బలమైన ఆధారాలు ఉన్నాయని సమాచారం. మీడియాలో విషయం చర్చనీయాంశంగా మారడంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. అసలు ఆ నిర్మాత ఎవరు? ఆయన ఏ స్టార్ హీరోకి మిత్రుడు? అనే విషయాలపై రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి.
రాజకీయ కారణాలు లేదా సోషల్ మీడియాలో చేసిన వివాదాస్పద పోస్టుల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని టాక్ నడుస్తోంది. గతంలో కూడా కొందరు సినిమా వ్యక్తులు ఇలాంటి ఐటీ సెల్ లేదా సోషల్ మీడియా కేసుల్లో ఇరుక్కున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి ఏకంగా ఒక బడా నిర్మాత పేరు వినిపిస్తుండటంతో ఫిలిం నగర్ వర్గాల్లో టెన్షన్ నెలకొంది. నేడు లేదా రేపట్లో అరెస్ట్ జరిగే అవకాశం ఉందనే లీకులు వస్తుండటంతో అందరి ఫోకస్ ఇండస్ట్రీపై పడింది. ఇది కేవలం పొలిటికల్ ఇష్యూనా లేక వ్యక్తిగత కక్షలతో చేస్తున్నదా అనేది తేలాల్సి ఉంది.
మరోవైపు నెటిజన్లు మాత్రం ఇది ఏదైనా సినిమా పబ్లిసిటీ స్టంట్ కావొచ్చని పందాలు కూడా కాస్తున్నారు. కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు రంగంలోకి దిగాక ఇలాంటి రూమర్లు రావడం అసాధ్యమని మరికొందరు చెబుతున్నారు. సదరు స్టార్ హీరోకి ఈ విషయం తెలుసా? ఆయన తన మిత్రుడిని కాపాడుకునే ప్రయత్నం చేస్తారా? లేక ఈ వివాదం నుంచి దూరంగా ఉంటారా? అనేది కూడా తెలియాల్సి ఉంది.
అరెస్ట్ జరిగితే తప్ప అసలు నిందితుడు ఎవరనేది అధికారికంగా బయటకు వచ్చేలా లేదు. ఒకవేళ ఈ అరెస్ట్ గనుక నిజమైతే టాలీవుడ్ లో ఇది పెద్ద సంచలనంగా మారుతుంది. ఇప్పటికే కొంతమంది నిర్మాతలు తమ వ్యాపారాల కోసం లేదా రాజకీయ మద్దతు కోసం ఇలాంటి చిక్కుల్లో పడటం చూస్తున్నాం. ఏపీ సీఐడీ గాలింపు వేగవంతం కావడంతో సదరు నిర్మాత లొంగిపోతారా లేక ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తారా అనేది చూడాలి. ప్రస్తుతానికి హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేట్ లొకేషన్లలో పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని గంటలు వేచి చూడక తప్పదు.