అదే జరిగితే.. జూలై కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తుందేమో..
ఒక నెల.. ఎనిమిది సినిమాలు.. అందులో ఎక్కువ శాతం విజయాలు సాధిస్తే ఎలా ఉంటుంది? టాలీవుడ్ లో కొత్త జోష్ కనిపించడమే కాదు, జూలై 2026 స్పెషల్ మంత్ గా గుర్తుండిపోయే ఛాన్స్ ఉంటుంది.
ఒక నెల.. ఎనిమిది సినిమాలు.. అందులో ఎక్కువ శాతం విజయాలు సాధిస్తే ఎలా ఉంటుంది? టాలీవుడ్ లో కొత్త జోష్ కనిపించడమే కాదు, జూలై 2026 స్పెషల్ మంత్ గా గుర్తుండిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే ఏడాదిలో తొలి ఆరు నెలలు పూర్తయ్యాయి. ఇప్పుడు రెండో హాఫ్ ను మొదలుపెట్టిన జూలైపై అందరి దృష్టి నిలిచింది. చిన్న, మీడియం రేంజ్ సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతుండటంతో ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెరుగుతోంది.
ప్రతి సినిమా విడుదల సమయంలో "ఈసారి మంచి హిట్ కావాలి" అనేది ఆ మూవీ టీమ్ తొలి కోరిక. ఎందుకంటే ఒక్క విజయం చాలామంది కెరీర్ ను మార్చేస్తుంది. హీరోలకు మార్కెట్ పెరుగుతుంది. హీరోయిన్లకు కొత్త అవకాశాలు వస్తాయి. దర్శకులు, నిర్మాతలకు పెద్ద ప్రాజెక్టులు దక్కుతాయి. టెక్నీషియన్ల టాలెంట్ కు మరింత గుర్తింపు లభిస్తుంది. అందుకే జూలైలో విడుదల కానున్న ప్రతి చిత్రం తనదైన అంచనాలతో బరిలోకి దిగుతోంది.
జూలైలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ఇవే!
రావు బహుదూర్
నాగబంధం
లెనిన్
ఓ సుకుమారి
మకుటం
చెన్నై లవ్ స్టోరీ
సిగ్మా
శ్రీనివాస మంగాపురం
పై సినిమాలను చూస్తే విభిన్న కథాంశాలతో తెరకెక్కిన చిత్రాలు కనిపిస్తున్నాయి. మైథలాజికల్ అడ్వెంచర్ నుంచి యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ వరకు ప్రేక్షకులకు ఆయా సినిమాలు అందుబాటులోకి రానున్నాయి. ఇదే జులై నెలకు మరో స్పెషాలిటీగా చెప్పొచ్చు. అయితే రిలీజ్ కౌంట్ ఎక్కువగా ఉండటం ఒక్కటే సరిపోదు. ఆ సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలి. మంచి టాక్ కూడా సొంతం చేసుకోవాలి. బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోవాలి. అలాంటి పరిస్థితి ఏర్పడితే నిర్మాతలకు ఇన్వెస్ట్మెంట్ పై నమ్మకం పెరుగుతుంది.
అదే సమయంలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుంది. థియేటర్లలో సందడి పెరగడంతో మొత్తం ఇండస్ట్రీలోనే పాజిటివ్ ఎన్విరాన్మెంట్ వస్తుంది. మరోవైపు ఒక సినిమా విజయం మరో సినిమాకూ ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు వరుసగా సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీంతో ఒకే నెలలో పలువురు హీరోలు, కొత్త దర్శకులు, యువ నటీనటులు తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే అవకాశం దక్కుతుంది.
ఇటీవల ప్రేక్షకుల టేస్ట్ లో కూడా మార్పు కనిపిస్తోంది. కథ బాగుంటే చిన్న సినిమానైనా ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలైలో విడుదలయ్యే ప్రతి చిత్రం కంటెంట్ పరంగా ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఇప్పుడు విడుదలకు సిద్ధమైన ఎనిమిది చిత్రాల్లో ఎక్కువ భాగం విజయాలు సాధిస్తే అది కేవలం ఆయా మూవీ టీమ్స్ కే కాదు, మొత్తం ఇండస్ట్రీకి కూడా మంచి న్యూసే. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు అందరికీ కూడా కచ్చితంగా కొత్త అవకాశాలు వస్తాయని చెప్పాలి. అదే జరిగితే... జూలై 2026 నిజంగానే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ చరిత్రలోనే నయా హిస్టరీ క్రియేట్ చేయడం పక్కా అనుకోవాలి.