తమన్, అనిరుధ్ సాంగ్.. ప్రోమోతోనే హైపెక్కించేలా..

తాజాగా విడుదలైన ప్రోమోలోనే ఆ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మెలోడియస్ ట్యూన్‌ కు అనిరుధ్ వాయిస్ మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Update: 2026-05-26 18:25 GMT

సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో మరో క్రేజీ కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్, కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ కలిసి చేసిన తాజా సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారింది. వీరిద్దరి కాంబో లో రూపొందిన హాయ్ రే సాంగ్ ప్రోమో విడుదలై మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. పూర్తి పాట విడుదలకు ముందే ప్రోమో మంచి హైప్ క్రియేట్ చేయడం విశేషం.

ఇటీవల తమన్ తన సోషల్ మీడియా ఖాతాలో అనిరుధ్‌ ను ట్యాగ్ చేస్తూ 'బ్రదర్.. ఇక మొదలుపెడదామా?' అంటూ చేసిన పోస్ట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. దానికి అనిరుధ్ కూడా అదే ఉత్సాహంతో స్పందిస్తూ 'నేను రెడీ.. సాయంత్రం 6:03కి స్టార్ట్ చేద్దాం' అని రిప్లై ఇచ్చారు. వీరిద్దరి మధ్య జరిగిన ఫన్నీ కన్వర్జేషన్ వెనక ఏదో పెద్ద ప్రాజెక్ట్ ఉందన్న చర్చ మొదలైంది. చివరకు ఆ సస్పెన్స్‌ కు తెరదించుతూ 'ఇట్లు అర్జున' సినిమా కోసం ఇద్దరూ కలిసి పనిచేస్తున్నట్లు రివీల్ చేశారు.

ఇట్లు అర్జున చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా, ఇందులోని హాయ్ రే అనే మెలోడీ సాంగ్‌ ను అనిరుధ్ ఆలపించారు. తాజాగా విడుదలైన ప్రోమోలోనే ఆ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మెలోడియస్ ట్యూన్‌ కు అనిరుధ్ వాయిస్ మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లవ్ ఫీలింగ్ ను సింపుల్‌ గా, ఫీల్‌ తో చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రోమో ప్రారంభంలో బండోడు, బక్కోడు అంటూ తమన్, అనిరుధ్‌ లను సరదాగా పరిచయం చేసిన విధానం అభిమానులకు బాగా కనెక్ట్ అయింది.

ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్లీ కెమిస్ట్రీ కూడా వీడియోలో స్పష్టంగా కనిపించింది. కేవలం కొన్ని సెకన్ల ప్రోమోతోనే పూర్తి పాటపై అంచనాలు పెంచేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఆ చిత్రంలో అనీశ్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు మహేశ్ ఉప్పాల సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. సినిమాను దర్శకుడు వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు. దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకీ.. ఇప్పుడు నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఇప్పటికే ఇట్లు అర్జున సినిమాపై యువతలో మంచి ఆసక్తి ఉంది. ఇప్పుడు తమన్- అనిరుధ్ వర్క్ చేస్తుండడంతో ఆ హైప్ మరింత పెరిగింది. ముఖ్యంగా మ్యూజిక్ లవర్స్ ఆ సాంగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూర్తి పాట ఈ నెల 28న విడుదల కానుండగా, ప్రోమో చూసిన తర్వాత ఇది మరో చార్ట్‌ బస్టర్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదేమైనా.. తమన్ కంపోజిషన్, అనిరుధ్ ఎనర్జిటిక్ వాయిస్, కొత్త జంట కెమిస్ట్రీ కలిసి హాయ్ రే సాంగ్‌ ను ముందుగానే ట్రెండింగ్‌ లోకి తీసుకొచ్చాయి. ఇప్పుడు పూర్తి పాట విడుదల తర్వాత హైప్ ఏ స్థాయికి వెళ్తుందో చూడాలి.

Tags:    

Similar News