CM విజ‌య్ భార్య ఎక్క‌డ‌? ప్రజా క్షేత్రంలో విజయం ముందు అవన్నీ చిన్నబోయాయి!

అత్యంత కీలకమైన పదవీ బాధ్యతలు స్వీకరించే సమయంలో కుటుంబ సభ్యులు పక్కన లేకపోవడం చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఈ వేడుకలో నటి త్రిష సందడి చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.;

Update: 2026-05-11 06:46 GMT

తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన చారిత్రక ఘట్టం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ వేడుకలో విజయ్ భార్య సంగీత సోర్నలింగం.. వారి పిల్లలు కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో గుసగుసలకు తావిచ్చింది. గత కొంతకాలంగా విజయ్-సంగీత‌ దంపతుల మధ్య విభేదాలు ఉన్నాయని.. వారు విడివిడిగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. అత్యంత కీలకమైన పదవీ బాధ్యతలు స్వీకరించే సమయంలో కుటుంబ సభ్యులు పక్కన లేకపోవడం చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఈ వేడుకలో నటి త్రిష సందడి చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

విజయ్ భార్య సంగీత సోర్నలింగం ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్నట్లు సమాచారం. తండ్రి ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కావడంతో లండన్‌లోని తమ కుటుంబ వ్యాపారాలను స్వ‌యంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కేవలం సంగీత పేరిట కుటుంబ వ్యాపారాల ద్వారా వందల కోట్ల నికర ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ పిల్లలు కూడా విదేశాల్లోనే తమ ఉన్నత చదువులలో బిజీగా ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోయారని ఒక వర్గం అంటున్నా... రాజకీయ ప్రత్యర్థులు మాత్రం దీనిని ఒక `ఫ్యామిలీ డ్రామా`గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.

తమిళనాడు ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ వ్యక్తిగత జీవితంపై... ముఖ్యంగా భార్యతో విడాకుల వ్యవహారంపై ప్రత్యర్థులు గట్టిగానే విమర్శలు గుప్పించారు. అయితే ఈ అంశం ఓటర్లపై పెద్దగా ప్రభావం చూపకపోవడం గమనార్హం. తమిళ తంబీలు విజయ్‌ను కేవలం ఒక నటుడిగానే కాకుండా.. ఒక ఆశావహ నాయకుడిగా చూశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన చూపిన నిబద్ధత, `తమిళగ వెట్రి కళగం` (టీవీకే) పార్టీ సిద్ధాంతాలు వ్యక్తిగత వివాదాలను మరుగున పడేలా చేశాయి. ఓటర్లు వ్యక్తిగత జీవితం కంటే ప్రజా ప్రయోజనాలకే పెద్దపీట వేశారని ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.

సంగీత సోర్నలింగం కుటుంబం లండన్‌లో హోటల్ రంగం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో స్థిరపడింది. విజయ్ రాజకీయ ఎదుగుదల సమయంలో ఆమె కావాలనే మీడియాకు దూరంగా ఉంటున్నారా లేక నిజంగానే విభేదాల వల్ల లండన్‌కే పరిమితమయ్యారా? అనేది ఇంకా స్పష్టత లేదు. ప్రమాణ స్వీకార వేదికపై త్రిష ఉనికిని కొందరు సినిమా అనుబంధంగా చూస్తుంటే.. మరికొందరు మాత్రం దీనికి రాజకీయ రంగు పులుముతున్నారు. ఏదేమైనా ఒక పక్కా ప్లానింగ్‌తో రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ తన వ్యక్తిగత విషయాలు పాలనపై ప్రభావం చూపకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్ర‌స్తుతం విజ‌య్ కుమారుడు జాస‌న్ విజ‌య్ ద‌ర్శ‌కుడిగా మారేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. త‌ల్లిదండ్రుల న‌డుమ వివాదం, సంఘ‌ర్ష‌ణ‌ల‌ను దాటుకుని, అన్నిటినీ త‌ట్టుకుని క్రియేటివ్ రంగంలో అత‌డు కూడా త‌న ల‌క్ష్యం దిశ‌గా పోరాడి త‌న తండ్రిలానే విజేత కావాల్సి ఉంది.

ఓవైపు ఫ్యామిలీ మెలోడ్రామా ఇబ్బంది పెట్టినా.. దళపతి దిమాకున్నోడు! అంటూ ఇప్పుడు ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. తన చుట్టూ ఎన్ని వివాదాలు ముసురుకున్నా... వాటన్నింటినీ దాటుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. భార్యాపిల్లల గైర్హాజరుపై ఎన్ని గుసగుసలు వినిపించినా... ప్రజా క్షేత్రంలో ఆయన సాధించిన విజయం ముందు అవన్నీ చిన్నబోయాయి. లండన్‌లో వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలుతున్న సోర్నలింగం భవిష్యత్తులో విజయ్ రాజకీయ ప్రయాణంలో తోడుగా నిలుస్తారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతం మాత్రం తమిళనాడులో విజయ్ మార్క్ పాలన ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

Tags:    

Similar News