టాలీవుడ్ హీరోల కొత్త ట్రెండ్.. స్పీడ్ కంటే దానికే ప్రాధాన్యం!
అయితే ఈ లేట్ వెనుక ఒక పక్కా ప్లానింగ్ ఉందనేది ఇండస్ట్రీ టాక్. ఈ ట్రెండ్ వెనుక కథ చుద్దాం..
టాలీవుడ్ యంగ్ హీరోల మైండ్‌సెట్ ఇప్పుడు పూర్తిగా మారిపోతోంది. ఒకప్పుడు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయాలనుకునే హీరోలు, ఇప్పుడు మాత్రం "స్పీడ్ కంటే క్వాలిటీనే ముఖ్యం" అంటూ 'టైమ్ టేకింగ్ జోన్' లోకి వెళ్తున్నారు. సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో వచ్చి ఆరు నెలలు దాటినా నవీన్ పోలిశెట్టి తన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. అయితే ఈ లేట్ వెనుక ఒక పక్కా ప్లానింగ్ ఉందనేది ఇండస్ట్రీ టాక్. ఈ ట్రెండ్ వెనుక కథ చుద్దాం..
ఆచితూచి అడుగులు వేస్తున్న నవీన్ పోలిశెట్టి:
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తర్వాత నవీన్ పోలిశెట్టి చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో చిన్న యాక్సిడెంట్ అవ్వడం వల్ల మరింత లేట్ అయింది. ఇక సంక్రాంతి సినిమా వచ్చి 6 నెలలు దాటినా నవీన్ కొత్త సినిమా అనౌన్స్ చేయకపోవడంతో ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నా, నవీన్ మాత్రం తన నిదానమే ప్రధానం సూత్రాన్ని నమ్ముకున్నాడు. ఇక ఫైనల్‌గా మైత్రి మూవీ మేకర్స్ ద్వారా తమిళ దర్శకుడు ఆంటోనీ భాగ్యరాజ్ చెప్పిన క్రేజీ లైన్‌కు నవీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని సమాచారం.
టాలీవుడ్‌లో మారుతున్న హీరోల మైండ్‌సెట్:
కేవలం నవీన్ పోలిశెట్టి ఒక్కడే కాదు.. ఇప్పుడు టాలీవుడ్‌లో రేంజ్‌తో సంబంధం లేకుండా చాలా మంది హీరోలు ఇదే దారిలో నడుస్తున్నారు. ఇక మాస్ మహారాజా రవితేజ, యంగ్ హీరో శ్రీవిష్ణు లాంటి ఒకరిద్దరిని మినహాయిస్తే.. మిగతా యంగ్ స్టార్స్ అంతా సినిమా సినిమాకూ భారీ గ్యాప్ తీసుకుంటున్నారు. మార్కెట్‌లో మంచి ఇమేజ్, ఫ్యామిలీ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ.. తొందరపడి తప్పుడు కథలతో రిస్క్ చేయడం కంటే, లేటైనా సాలిడ్ కంటెంట్‌తో రావాలనేదే వీరి ప్లాన్.
'టైమ్ టేకింగ్ జోన్'.. అసలు రహస్యం ఇదే:
ఈ గ్యాప్‌ను నెగెటివ్‌గా చూడలేం. ఎందుకంటే హీరోలు ఖాళీగా ఉండటం లేదు, ప్రీ ప్రొడక్షన్ మరియు స్క్రిప్ట్ వర్క్ కోసం ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు. కథను పక్కాగా లాక్ చేసుకుని, సెట్స్ పైకి వెళ్లాక మాత్రం అస్సలు టైమ్ వేస్ట్ చేయడం లేదు. ఇక షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసి, సకాలంలో థియేటర్లలోకి తెచ్చే కొత్త 'ప్రొడక్షన్ ఎఫిషియెన్సీ' ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. దీనివల్ల సినిమా క్వాలిటీ పెరగడమే కాకుండా బడ్జెట్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది.
మొత్తానికి టాలీవుడ్‌లో ఇప్పుడు "స్లో అండ్ స్టడీ" ఫార్ములానే నడుస్తోంది. నవీన్ పోలిశెట్టి లాంటి టాలెంటెడ్ హీరోలు తీసుకునే ఈ టైమ్.. థియేటర్లలో ప్రేక్షకులకు ఒక మంచి వినోదాన్ని అందిస్తుందని ఆశించవచ్చు. మరి ఆంటోనీ భాగ్యరాజ్‌తో నవీన్ సినిమా ఒకే చేస్తే ఏ రేంజ్ హిట్ అవుతుందో, ఏ సీజన్‌లో విడుదలవుతుందో తెలియాలంటే అఫీషియల్ అప్‌డేట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే..