రిలీజ్‌ కంటే ముందే బ్లాక్‌బస్టర్ టాక్.. టాలీవుడ్‌లో హైప్ క్రియేట్ చేసిన మూవీస్!

తెలుగు సినిమా రేంజ్ ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింది. కేవలం కథల పరంగానే కాదు.. రిలీజ్‌కు ముందే క్రియేట్ చేసే హైప్, బిజినెస్ పరంగా కూడా టాలీవుడ్ రికార్డులు సృష్టిస్తోంది.

Update: 2026-05-19 08:06 GMT

తెలుగు సినిమా రేంజ్ ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింది. కేవలం కథల పరంగానే కాదు.. రిలీజ్‌కు ముందే క్రియేట్ చేసే హైప్, బిజినెస్ పరంగా కూడా టాలీవుడ్ రికార్డులు సృష్టిస్తోంది. బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడి, పుష్ప 2 చిత్రాలు థియేటర్లలోకి రాకముందే పాటలు, టీజర్లు, ట్రైలర్లతో ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు అదే అంచనాలతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన సరికొత్త చిత్రం ‘పెద్ది’ థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతోంది. ఆ వివరాలు చూద్దాం..

బాహుబలి 2 సృష్టించిన ప్రభంజనం:

తెలుగు సినిమా హిస్టరీని ‘బాహుబలి’కి ముందు.. ఆ తర్వాత అని మార్చేసిన సినిమా ఇది. 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?' అనే ఒకే ఒక్క ప్రశ్న దేశవ్యాప్తంగా కోట్ల మంది ప్రేక్షకులలో విపరీతమైన క్యూరియాసిటీని పెంచేసింది. దాంతో బాహుబలి 2 రిలీజ్‌కు ముందే ఇండియాలోనే ఎన్నడూ లేనంత భారీ క్రేజ్‌ను, పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.




 


ఆర్ఆర్ఆర్ గ్లోబల్ మేనియా:

ఇక దర్శకధీరుడు రాజమౌళి స్క్రీన్ పైన చూపించిన రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల కాంబినేషన్ ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్‌కు పూనకాలు తెప్పించింది. సినిమా అనౌన్స్ చేసిన రోజు నుండి, సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ అయ్యే సరికి ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక బిజినెస్ పరంగా కూడా విడుదలకు ముందే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.




 



కల్కి 2898 ఏడి సైన్స్ ఫిక్షన్ వండర్:

ఇక రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె లాంటి భారీ తారాగణంతో వచ్చిన ఈ విజువల్ వండర్ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. మన పురాణాలకు సైన్స్ ఫిక్షన్ కథాంశాన్ని జోడించి చూపించబోతున్నారనే చిన్న హింట్ ఇవ్వడంతోనే, అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సరికొత్త రికార్డులు సృష్టించింది.




 


పుష్ప 2: ది రూల్ తగ్గేదే లే:

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 1’ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. అందుకే పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశారు. షెకావత్ నెక్స్ట్ ఏమి చేస్తాడు అని పుష్ప 2 కోసం ఎంతోమంది ఎదురు చూసారు.ఇక సినిమా రిలీజ్ కాకముందే కేవలం గ్లింప్స్, ట్రైలర్లతోనే ‘పుష్ప 2’ ఆల్-టైమ్ హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడం టాలీవుడ్ హిస్టరీలోనే ఒక అద్భుతం.




 


ఇప్పుడు రామ్ చరణ్ ‘పెద్ది’ వంతు:

ఇలాంటి భారీ సినిమాల కోవలోనే ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా చేరిపోయింది. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా పవర్‌ఫుల్ ట్రైలర్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తోంది. నిన్న ట్రైలర్ ,పాటల్లో రామ్ చరణ్ స్టెప్స్ చూసిన ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసుకున్నారు. టాలీవుడ్‌లో మరోసారి ముందస్తు బ్లాక్‌బస్టర్ వైబ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.




 


జూన్ 4న థియేటర్లలో రచ్చ:

ఇక భారీ అంచనాలు, రికార్డు స్థాయి బిజినెస్ నడుమ పెద్ది చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. పాటలు, ట్రైలర్‌తోనే బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు సృష్టించిన రామ్ చరణ్.. థియేటర్లలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.

ఒకప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక టాక్ వచ్చేది.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది ట్రైలర్లతోనే బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకోవడం మన టాలీవుడ్ సినిమాలకే చెల్లింది. మరి ఇక రాబోయే జూన్ 4న ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సరికొత్త రికార్డులను సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే..

Tags:    

Similar News