మారుతోన్న ప్రేక్షకుల అభిరుచి!

ముఖ్యంగా జెన్-జీ తరం ప్రేక్షకులు మొబైల్ ఫోన్లలో ప్రపంచంలోని ఏ మూలన ఉన్న అద్భుతమైన కంటెంట్‌నైనా క్షణాల్లో చూడగలుగుతున్నారు.

Update: 2026-07-20 11:30 GMT

డిజిటల్ యుగంలో ప్రేక్షకుడి అభిరుచి వేగంగా మారుతోంది. ముఖ్యంగా జెన్-జీ తరం ప్రేక్షకులు మొబైల్ ఫోన్లలో ప్రపంచంలోని ఏ మూలన ఉన్న అద్భుతమైన కంటెంట్‌నైనా క్షణాల్లో చూడగలుగుతున్నారు. హాలీవుడ్ చిత్రాల విజువల్ వండర్స్ నుండి కొరియన్ సిరీస్‌ల భావోద్వేగాల వరకు గ్లోబల్ కంటెంట్ తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది. ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా అలరిస్తున్న సంప్రదాయ దేశీయ చిత్రాలు, కొత్త తరం ఆశించే అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవడంలో కొంత వెనుకబడుతున్నాయన్నది వాస్తవం.

హాలీవుడ్ - కొరియన్ కంటెంట్ విజయానికి ప్రధాన కారణం వారి ప్రీ-ప్రొడక్షన్- కథా నిబద్ధత. ఒక సినిమా షూటింగ్ మొదలవ్వకముందే? స్క్రిప్ట్ స్థాయి నుండి ప్రతి చిన్న అంశాన్ని పక్కాగా సిద్ధం చేసుకుంటారు. విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్ వంటి సాంకేతిక అంశాలపై చూపే శ్రద్ధ, ప్రేక్షకులను ఒక మాయా ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇంకా చాలా వరకు మేకింగ్ కంటే కూడా స్టార్ డమ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటం అంత ర్జాతీయ పోటీలో వెనుకబడిపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోందన్న‌ది ప‌చ్చి నిజం.

జెన్-జీ తరం ప్రేక్షకుడు కేవ‌లం కథను మాత్రమే చూడటం లేదు. ఆ కథను ప్రెజెంట్ చేసిన విధానాన్ని కూడా గమనిస్తున్నాడు. లాజిక్ లేని సన్నివేశాలు, సాగదీసే కథనాలు, పాతబడిన ఫార్మాట్లు విసుగు కలిగిస్తు న్నాయి. గ్లోబల్ కంటెంట్ చూస్తున్న ప్రేక్షకుడికి దేశీయ చిత్రాల్లో అదే స్థాయి నాణ్యత , కొత్తదనం కనిపించాలి. అందుకే? కథాంశం ఎంత బలంగా ఉన్నా? దానిని ప్రెజెంట్ చేసే విధానంలో కూడా అంతర్జాతీయ ప్రమాణాలు ఉండటం నేటి అవసరం.

ఈ మార్పును గమనించిన దర్శకులు కొందరు ఇప్పటికే భారీ బడ్జెట్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నారు. అయితే పెద్ద సినిమాలకే పరిమితం కాకుండా చిన్న సినిమాల నుంచి కూడా అత్యుత్తమ కంటెంట్ రావాల్సిన అవసరం ఉంది. ప్రీ-ప్రొడక్షన్ దశలో చేసే ప్రతి చిన్న ప్రయత్నం తుది ఉత్పత్తిలో స్పష్టమైన మార్పును చూపిస్తుంది. టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నాం అనేదాని కంటే? ఆ టెక్నాలజీ ద్వారా ప్రేక్షకుడికి ఎలాంటి అనుభూతిని ఇస్తున్నాం? అన్నదే కీలకం.

ఇకనైనా ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ప్రేక్షకుడి పల్స్ ను పట్టుకోవాల్సిన సమయం ఆస‌న్న‌మైంద‌ని గ‌మ‌నించాలి. గ్లోబల్ కంటెంట్‌కు పోటీగా నిలవాలంటే? స్టార్ పవర్ కంటే కంటెంట్ పవర్ పెరగాలి. అంతర్జాతీయ స్థాయిలో వెనకబ డిపోయామని బాధపడటం కంటే మన దగ్గర ఉన్న అద్భుతమైన కథలను అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో తెరకెక్కించడం ద్వారానే గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకోగలమ‌ని బ‌లంగా న‌మ్మాలి. ప్రేక్షకుడు ఇప్పుడు చాలా తెలివైనవాడు. అతను కోరుకునేది వినోదం మాత్రమే కాదు. ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసే అనుభవాన్ని ఆశీస్తున్నారు.

మారిన అభిరుచులకు అనుగుణంగా చేంజ్ అనేది సినిమా రంగానికి తప్పనిసరి. కంటెంట్ నాణ్యతలో రాజీ పడకుండా ప్రతి అడుగులోనూ కొత్తదనాన్ని వెతుక్కుంటే? మన చిత్రాలు కూడా ప్రపంచవ్యాప్తంగా విజయఢంకా మోగిస్తాయి. ప్రేక్షకుడి పల్స్ పట్టుకుని వారిని అలరించే అద్భుతమైన కథలతో మనం సిద్ధమైతే? గ్లోబల్ మార్కెట్‌లో తెలుగు సినిమా స్థాయి మరింత పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News