బాలనటుడు రోహన్‌కు బర్త్ డే ట్రీట్.. ధీరజ్ మొగిలినేని నుంచి మరో ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్

ఇలాంటి ఆసక్తికర సమయంలో ఈ రోజు బాలనటుడు రోహన్ పుట్టినరోజు సందర్భంగా సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్ రిలీజ్ చేసిన స్పెషల్ బర్త్ డే పోస్టర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

Update: 2026-05-16 10:12 GMT

టాలీవుడ్‌లో కథా బలమున్న సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుంది. అలాంటి కంటెంట్ ఆధారిత సినిమాల‌ను ప్రేక్షకులకు అందిస్తూ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ధీరజ్ మొగిలినేని. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోష‌న్స్ కు ప్రాధాన్యం ఇచ్చే కథలను ఎంపిక చేసుకుంటూ ఆయన తన బ్యానర్‌కి ప్రత్యేకమైన ఇమేజ్ తీసుకొచ్చారు. ప్ర‌స్తుతం ఆయన ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న తాజా చిత్రం సమ్మర్ హాలిడేస్ కూడా అదే కోవకు చెందినదిగా సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

 

చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసే ఎమోష‌న‌ల్ కథతో రూపొందుతున్న ఈ చిల్డ్రన్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. డైరెక్ట‌ర్ శ్రీకర్ ఈ సినిమాను పిల్లలు మాత్రమే కాకుండా, ఫ్యామిలీ ఆడియ‌న్స్ అందరూ కనెక్ట్ అయ్యేలా రూపొందిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా సమ్మర్ వెకేషన్‌లో పిల్లలు చేసే అల్లరి, ఫ్రెండ్‌షిప్, ఫ్యామిలీ బాండింగ్స్ వంటి అంశాలను ఎంతో సహజంగా తెరపై చూపించబోతున్నారట. ఇటీవల రిలీజైన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.

ఇలాంటి ఆసక్తికర సమయంలో ఈ రోజు బాలనటుడు రోహన్ పుట్టినరోజు సందర్భంగా సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్ రిలీజ్ చేసిన స్పెషల్ బర్త్ డే పోస్టర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. పోస్టర్‌లో రోహన్ కనిపించిన లుక్ ఎంతో సహజంగా, ఎనర్జిటిక్‌గా ఉండటంతో సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. చిన్న వయసులోనే నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రోహన్ ఇప్పటికే 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్, భర్త మహాశయులకు విజ్ఞప్తి వంటి సినిమాల‌తో తన టాలెంట్ ను నిరూపించుకున్నారు. ముఖ్యంగా సహజమైన హావభావాలు, ఎమోషనల్ సీన్స్‌లో కనిపించే మెచ్యూరిటీ రోహ‌న్ కు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ సినిమాలో మరోసారి కీలక పాత్రలో కనిపించబోతుండటంతో ఈ సినిమా రోహ‌న్ కెరీర్‌లో మరొక మెట్టు అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా రోహన్‌కు సినీ వర్గాల నుంచి, అభిమానుల నుంచి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాబోయే రోజుల్లో రోహ‌న్ తెలుగు సినీ పరిశ్రమలో మరిన్ని మంచి అవకాశాలు అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

మరోవైపు ఈ సినిమాలో 35 చిన్న కథ కాదు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ అరుణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. రోహన్- అరుణ్ కాంబినేషన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారనుందని టాక్ వినిపిస్తోంది. టెక్నికల్‌గా కూడా సినిమా మంచి స్థాయిలో రూపొందుతోందని తెలుస్తోంది. సాయి ప్రకాశ్ సినిమాటోగ్రఫీ, సింజిత్ యెర్రమల్లి మ్యూజిక్ సినిమాకు ప్రత్యేక బలం కానున్నాయి. ముఖ్యంగా పిల్లల ఎమోష‌న్స్‌ను, వేసవి సెలవుల ఆనందాన్ని విజువల్‌గా అందంగా చూపించేందుకు టీమ్ ఎంతో శ్రద్ధ తీసుకుంటోందట. నిర్మాత ధీరజ్ మొగిలినేని కూడా ఈ సినిమాను కేవలం ఒక చిల్డ్రన్ మూవీగా కాకుండా ప్రతి ఒక్కరినీ తమ చిన్ననాటి జ్ఞాపకాలలోకి తీసుకెళ్లే ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది. త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న సమ్మర్ హాలిడేస్ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు పిల్లలను ఎంతగానో అలరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News