ఇండస్ట్రీలో ఆ జోడీ ఓ రోల్ మోడల్!
బాద్‌షా షారుఖ్ ఖాన్ - గౌరీ ఖాన్ దంపతుల గురించి చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ సెలబ్రిటీల్లో ఆదర్శ దంపతులుగా పేరుంది.;
బాద్‌షా షారుఖ్ ఖాన్ - గౌరీ ఖాన్ దంపతుల గురించి చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ సెలబ్రిటీల్లో ఆదర్శ దంపతులుగా పేరుంది. తాజాగా ఈ జోడీ గురించి `కర్తవ్య` చిత్ర నిర్మాత ఆశిష్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమా నిర్మాణంలో నిర్మాతలకు - దర్శకులకు ఎదురయ్యే అతిపెద్ద సవాలు నటీనటుల సహకారం. ఈ విషయంలో షారుఖ్ దంపతులు ఏనాడూ ప్రాజెక్టుకు అడ్డుగా నిలవలేదన్నారు. పైగా సినిమాను ముందుకు తీసుకెళ్లేందుకు తమవంతు సహాయం అందిస్తారని ఆశిష్ కొనియాడారు.
షారుఖ్ ఖాన్‌కు తన సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్నా? ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి పనిచేసేటప్పుడు ఆయన ఏమాత్రం గర్వం చూపరని ఆశిష్ సింగ్ అన్నారు. సాధారణంగా పెద్ద స్టార్ హీరోలు షూటింగ్ షెడ్యూల్స్ విషయంలో లేదా టెక్నీషియన్ల ఎంపికలో వేలు పెడుతుంటారని టాక్ ఉంటుంది. కానీ షారుఖ్ మాత్రం దర్శకుడు ,నిర్మాతల విజన్‌ను గౌరవిస్తారని షూటింగ్ సజావుగా సాగడానికి అవసరమైన అన్ని వెసులుబాట్లను కల్పిస్తారని సింగ్ వివరించారు.
గౌరీ ఖాన్ గురించి మాట్లాడుతూ, ` ఒక నిర్మాతగా ఆమె ఎంతో స్పష్టతతో ఉంటారన్నారు. సినిమా మేకింగ్ ప్రక్రియలో అనవసరమైన ఆందోళనలు సృష్టించకుండా టీమ్ అందరికీ స్వేచ్ఛగా పనిచేసే వాతావరణాన్ని గౌరీ కల్పిస్తా రన్నారు. ప్రాజెక్టు ఆలస్యం కాకుండా ఉండేందుకు ఆమె తీసుకునే నిర్ణయాలు నిర్మాతలకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయని గుర్తు చేసుకున్నారు. ఒక సినిమా విజయవంతం కావాలంటే నటీనటులు, నిర్మాతల మధ్య ఉండాల్సిన పరస్పర గౌరవానికి వీరు నిదర్శనమని అశిష్ ప్రశంసించారు.
షారుఖ్ ఖాన్ వంటి గ్లోబల్ స్టార్‌తో పని చేయడం అంటే ఉండే ఒత్తిడిని ఆయన తన వ్యక్తిత్వంతో సులభతరం చేస్తారని ఆశిష్ తెలిపారు. సెట్స్‌పైకి షారుఖ్ వచ్చినప్పుడు ఆయన ఇచ్చే పాజిటివ్ ఎనర్జీ అందరినీ ఉత్తేజ పరుస్తుందన్నారు. ఏ చిన్న సమస్య తలెత్తినా ? షారుక్ సానుకూలంగా స్పందిస్తారన్నారు. విచిత్రమైన కోరికలు కోరడం లేదా నిర్మాతలను ఇబ్బంది పెట్టే పనులు షారుఖ్ నుండి ఎప్పుడూ ఊహించలేమని స్పష్టం చేశారు.
అలాగే ఇండస్ట్రీలో మారుతోన్న పరిస్థితులపైనా స్పందించారు. పెద్ద హీరోలు సహకరిస్తేనే సినిమాలు సకాలంలో పూర్తవుతాయని షారుఖ్ దంపతులు ఈ విషయంలో ఓ రోల్ మోడల్ లాంటివారని ఆశిష్ సింగ్ అభిప్రాయపడ్డారు. వాళ్లు ఎప్పుడూ ప్రాజెక్టుకు అవరోధంగా మారరు. బదులుగా సమస్యలను పరిష్కరించడంలో భాగస్వాములవుతారు అని అన్నారు. అందుకే రెడ్ చిల్లీస్ సంస్థతో అసోసియేట్ అవ్వడం ఇతర నిర్మాతలకు ఎప్పుడూ మంచి అనుభవంగానే ఉంటుందని చెప్పుకొచ్చారు.
స్టార్ హోదాను పక్కన పెట్టి వృత్తి పట్ల అంకితభావంతో ఉండటం వల్లే షారుఖ్ ఖాన్ దశాబ్దాలుగా పరిశ్రమలో తిరుగులేని బాద్‌షాగా కొనసాగుతున్నారు. నిర్మాతలను గౌరవించడం, షూటింగ్ వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచడం అనేవి యువ నటీనటులు ఆయన నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు. ఆశిష్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో షారుఖ్ అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారాయి. షారుక్ ఖాన్ హుందాతనాన్ని మరోసారి లోకానికి చాటాయి.