కుమార్తె కోసం బాద్‌షా మెగా ప్లాన్!
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటిస్తోన్న`కింగ్` చిత్ర నిర్మాణ వ్యయం 350 కోట్ల రూపాయలుగా తేలడంతో ట్రేడ్ వర్గాల్లో సస్పెన్స్ నెలకుంది.
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటిస్తోన్న`కింగ్` చిత్ర నిర్మాణ వ్యయం 350 కోట్ల రూపాయలుగా తేలడంతో ట్రేడ్ వర్గాల్లో సస్పెన్స్ నెలకుంది. ఈ సినిమాతో షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ వెండితెరపై ప్రధాన పాత్రలో పరిచయమవుతోంది. అయితే ఇంత భారీ బడ్జెట్ పెడుతున్న తరుణంలో సినిమాలో అసలు మెయిన్ లీడ్ ఎవరు? సుహానా ఖాన్ చుట్టూనే కథ తిరుగుతుందా లేక షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారా? అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఒకవేళ సుహానా ఖాన్‌ను నమ్ముకుని ఇంత పెద్ద మొత్తం పెడితే అది కచ్చితంగా రిస్క్ అవుతుందనే విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. అయితే తాజా లీక్స్ ప్రకారం సినిమాలో షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్‌కో లేదా చిన్న పాత్రకో పరిమితం కావడం లేదు.
ఆయన ఈ చిత్రంలో టైటిల్ రోల్ `కింగ్` పాత్రలోనే పూర్తి స్థాయి లీడ్‌గా కనిపిస్తారు. కథా నేపథ్యం ప్రకారం షారుఖ్ ఖాన్ అండర్‌వరల్డ్‌లో అనుభవజ్ఞుడైన డాన్ పాత్రలో కనిపిస్తే.. సుహానా ఖాన్ ఆయన దగ్గర శిష్యురాలిగా పవర్‌ఫుల్ యాక్షన్ రోల్ పోషిస్తోందని సమాచారం. అంటే సినిమా బరువు బాధ్యతలన్నీ షారుఖ్ ఖాన్ తన భుజాలపైనే మోస్తున్నారు. తద్వారా సుహానా ఖాన్‌ను భారీ యాక్షన్ డ్రామా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నట్లే. ఒకవేళ సుహానా ఖాన్ లీడ్ రోల్‌లో ఉండి షారుఖ్ అతిథి పాత్రకే పరిమితమైతే 350 కోట్ల బడ్జెట్ అనేది నిర్మాతలకు ప్రమాదకరమైన రిస్క్ అయ్యేది.
ఎందుకంటే సుహానాకు ఇంకా థియేట్రికల్ మార్కెట్ , స్టార్ ఇమేజ్ రాలేదు. కానీ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేస్తుండటం, షారుఖ్ ఖానే స్వయంగా యాక్షన్ లీడ్‌గా రంగంలోకి దిగడంతో ఈ రిస్క్ కాస్తా భారీ రివార్డ్ గా మారే అవకాశం కనిపిస్తోంది. `పఠాన్`, `జవాన్` చిత్రాల తర్వాత షారుఖ్ ఖాన్ యాక్షన్ ఇమేజ్ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. ఆయన ఉంటే చాలు సినిమా వందల కోట్ల వసూళ్లు సాధిస్తుందనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో ఉంటుంది. ఈ చిత్రంలో తండ్రీకూతుళ్ల కాంబినేషన్ మాత్రమే కాకుండా? ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు మరిన్ని కమర్షియల్ హంగులను కూడా జోడించారు. బాలీవుడ్ అగ్ర నటి దీపికా పదుకోణే చిత్రంలో ప్రత్యేకమైన సాంగ్ , కీలక పాత్రలో కనిపించనుంది.
అభిషేక్ బచ్చన్ పవర్‌ఫుల్ పాత్ర పోషిస్తున్నాడు. ఇలా భారీ తారాగణం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. దీంతో 350 కోట్ల బడ్జెట్ అనేది ఒక నటి కోసమే కాకుండా? ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యాక్షన్ సినిమాను నిర్మించడానికి ఖర్చు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. సినిమాలోని యాక్షన్ సీక్వెన్సుల కోసమే బడ్జెట్‌లో సింహభాగం కేటాయించినట్లు తెలుస్తోంది. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ల పర్యవేక్షణలో దాదాపు ఆరు భారీ యాక్షన్ ఎపిసోడ్స్, కార్ ఛేజింగ్ సీన్స్ ప్లాన్ చేశారు. ఇటీవలే సౌత్ ఆఫ్రికా షెడ్యూల్‌లో షారుఖ్ ఖాన్, దీపికా పదుకోణే పై కీలకమైన యాక్షన్ సీన్లు , క్లైమాక్స్ ఫైట్లను చిత్రీకరించారు. ఈ విజువల్ గ్రాండియర్ వల్లే బడ్జెట్ అంతగా పెరిగిందన్నది మరో వెర్షన్. షారుఖ్ ఖాన్ మార్కెట్ ఉన్నందు వల్లే రైట్స రూపంలో పెట్టుబడిని సులభంగా తిరిగి రికవరీ చేయోచ్చు అని నిర్మాతలు ధీమాగా ఉన్నారు.