అలాంటి ఛాన్స్ వస్తే డే అండ్ నైట్ రెడీ..!

కన్నడ భామ శ్రీనిధి శెట్టి కె.జి.ఎఫ్ క్రేజ్ ని క్యాష్ చేసుకోలేదన్న కామెంట్ ఉన్నా కూడా తనది స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ పాలసీ అని చెప్పకనే చెబుతుంది.;

Update: 2025-10-06 04:06 GMT

కన్నడ భామ శ్రీనిధి శెట్టి కె.జి.ఎఫ్ క్రేజ్ ని క్యాష్ చేసుకోలేదన్న కామెంట్ ఉన్నా కూడా తనది స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ పాలసీ అని చెప్పకనే చెబుతుంది. కె.జి.ఎఫ్ లాంటి భారీ హిట్ తర్వాత అమ్మడికి వచ్చిన ఛాన్స్ లు ఎన్నో ఉన్నా వాటిని కాదని అమ్మడు విక్రం తో కోబ్రా చేసింది. అది వర్క్ అవుట్ కాలేదు కాబట్టి మళ్లీ కాస్త డైలమాలో పడింది. సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదా ముందు సైన్ చేసినా నాని హిట్ 3 లో ఛాన్స్ అందుకుని ఆ సినిమాతో సక్సెస్ అందుకుంది. ఇక నెక్స్ట్ అమ్మడు తెలుసు కదా సినిమాతో సర్ ప్రైజ్ చేయబోతుంది.

సినిమా ప్రమోషన్స్ లో శ్రీనిధి..

ఈ సినిమాలో శ్రీనిధితో పాటు రాశి ఖన్నా కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో శ్రీనిధి తన సినిమా అవకాశాల గురించి చెప్పుకొచ్చింది. అంతేకాదు ఒకేసారి ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి స్టార్ సినిమా ఆఫర్ వస్తే ఏం చేస్తారని అడిగితే.. రెండు ఓకే చేస్తా.. డే అండ్ నైట్ కాల్ షీట్స్ ఇచ్చేస్తా అంటుంది శ్రీనిధి. అలాంటి స్టార్ ఛాన్స్ లు రావాలే కానీ డే అండ్ నైట్ అదే పనిలో ఉంటా అంటుంది అమ్మడు. శ్రీనిధి క్లారిటీ చూసి ఆడియన్స్ అవాక్కవుతున్నారు.

అంతేకాదు అమ్మడు మంచి ఫుడీ అంట.. పైకి అలా కనిపించదు కానీ ఎక్కడ ఏ టేస్టీ ఫుడ్ దొరికినా కూడా అసలు వదిలి పెట్టదట. తెలుసు కదా ఇంటర్వ్యూలో సిద్ధు కూడా ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. శ్రీనిధి శెట్టి మంచి ఫుడీ అని ఎవరికీ పెట్టకుండా తినేస్తుందని సరదాగా ఆట పట్టించాడు సిద్ధు. అంతేకాదు ఆమె ఏం చెప్పాలనుకున్నా మొహమాట పడదని. బెంగుళూరులో షూటింగ్ జరిగితే మా ఇంటికి రావొద్దని డైరెక్ట్ గా చెప్పిందని సిద్ధు అన్నాడు.

నాని, సిద్ధులతో పాటు నెక్స్ట్ మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్..

ఐతే అది తాను సరదాగా అన్నానని శ్రీనిధి చెప్పి కవర్ చేసింది. మొత్తానికి శ్రీనిధి శెట్టి తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యేందుకు ఇక్కడ వరుస సినిమాలు చేస్తుంది. నాని, సిద్ధులతో పాటు నెక్స్ట్ మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ సినిమా ఆఫర్లు కూడా అందుకుంటే బెటర్ అని ఆడియన్స్ అంటున్నారు. అంతేకాదు త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంద్దని టాక్. అదే నిజమైతే మాత్రం ఒక సూపర్ హిట్ సినిమాలో అమ్మడు భాగమైనట్టే లెక్క.

శ్రీనిధి శెట్టి కూడా ఎలాంటి పాత్రైనా చేయడానికి రెడీ అంటుంది. తెలుసు కదా సినిమాలో అమ్మడు తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. సిద్ధు, శ్రీనిధి లవ్ సినిమాకు హైలెట్ అని అంటున్నారు. మరి హిట్ 3 తర్వాత శ్రీనిధి చేసిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News