ప్ర‌భాస్‌ని పోలీస్‌గా చూపించే ఛాన్స్ వంగాకే రాసి పెట్టి ఉంది!

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా... సందీప్ ఆలోచనా విధానం.. అత‌డు తెర‌కెక్కిస్తున్న‌ భారీ చిత్రం `స్పిరిట్` గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసారు.

Update: 2026-09-01 05:29 GMT

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వ శైలి, మేకింగ్ పద్ధతి టాలీవుడ్‌లోనే కాకుండా భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా... సందీప్ ఆలోచనా విధానం.. అత‌డు తెర‌కెక్కిస్తున్న‌ భారీ చిత్రం `స్పిరిట్` గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసారు. సందీప్ ఒక దృశ్యాన్ని చూసే విధానం... దాన్ని తెరపైకి తీసుకొచ్చే విజువలైజేషన్ వేరే స్థాయిలో ఉంటాయని.. చిన్నతనం నుంచే అత‌డు తీసే ఫోటోలలో కూడా ఆ ప్రత్యేకమైన ఫ్రేమింగ్ నైపుణ్యం కనిపించేదని ప్రణయ్ వెల్లడించారు.

ఒక సినిమా నిర్మాణంలో అత్యంత కీలకమైన ఎడిటింగ్, డైరెక్షన్, రైటింగ్ , మ్యూజిక్ సెన్స్ .. ఈ అన్ని విభాగాలపై సందీప్‌కు పూర్తి పట్టు ఉంది. షూటింగ్ ప్రారంభించడానికి ముందే ఎడిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పష్టమైన అవగాహన ఉండటం వల్ల... సెట్‌లోకి అడుగుపెట్టే సమయానికే ఏ షాట్ ఎలా తీయాలో అత‌డికి మైండ్‌లో పక్కా ప్లాన్ ఉంటుంది. ఈ స్పష్టత కారణంగా షూటింగ్ ప్రక్రియ చాలా వేగంగా, స్మార్ట్‌గా పూర్తికావడమే కాకుండా ప్రొడక్షన్ ఖర్చులు కూడా నియంత్రణలో ఉంటాయి.

సినిమా నిర్మాణంలో క్రమశిక్షణ ఎంత ముఖ్యమో వివరిస్తూ ప్రణయ్ రెడ్డి ఒక అరుదైన విషయాన్ని షేర్ చేసారు. దాదాపు 250 రోజులకు పైగా సాగిన తమ చిత్రాల షూటింగ్ ప్రయాణంలో సందీప్ ఏ రోజూ సెట్‌కి వచ్చి కన్‌ఫ్యూజన్‌తో ఉన్నట్లు చూడలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇప్పటివరకు వారు పూర్తి చేసిన సినిమాల్లో ఒక్క రోజు కూడా రీషూట్ చేయాల్సిన అవసరం గానీ, ప్యాచ్‌వర్క్ చేయాల్సిన పరిస్థితి గానీ రాలేదని చెప్పడం సందీప్ పక్కా ప్లానింగ్‌కు నిదర్శనం.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- సందీప్ వంగా కాంబినేషన్‌లో తెర‌కెక్కుతున్న 'స్పిరిట్' చిత్రంపై అంచనాల గురించి ప్ర‌శ్నిస్తే.. అభిమానుల కోరిక నెరవేరబోతోందని తెలిపారు. ప్రభాస్‌ను ఒక పవర్‌ఫుల్, ఫుల్-లెంగ్త్ పోలీస్ ఆఫీసర్‌గా చూడాలని కోట్లాది మంది అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. సందీప్ ఒక వినూత్నమైన కాప్ డ్రామా పాయింట్‌తో కథ చెప్పగానే ప్రభాస్ ఎంతో ఇంప్రెస్ అయ్యి, వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రణయ్ స్పష్టం చేశారు. ప్ర‌భాస్ కెరీర్ లో ఇన్నాళ్లు కాప్ డ్రామాలో న‌టించ‌లేదు. ఆ ఛాన్స్ నీకే ఉన్న‌ట్టుంది.. నీకోసం దాచాము! అని ప్ర‌భాస్ అంటుంటారు. ఏక్ నిరంజ‌న్ లో అత‌డు చేసిన‌ది కేవ‌లం పోలీస్ స‌హ‌కారి పాత్ర‌. స్పిరిట్ లో మాత్రం పూర్తి స్థాయి పోలీసాఫీస‌ర్ గా చూస్తారు. సందీప్ మార్క్ ట్రీట్ మెంట్ ఉంటుంద‌ని ప్ర‌ణ‌య్ రెడ్డి వంగా తెలిపారు.

ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త యాక్షన్ అనుభూతిని ఇస్తుందని నిర్మాత ప్రణయ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా కథలో వచ్చే హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లు, ఇంటర్వెల్ బ్లాక్ ఎపిసోడ్‌లు థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేసేలా డిజైన్ చేస్తున్నట్లు తెలిపారు. ఒక విజనరీ డైరెక్టర్, పాన్ వ‌ర‌ల్డ్ స్టార్ కాంబినేషన్‌లో వస్తున్న 'స్పిరిట్' భారతీయ చిత్రసీమలో మరొక సంచలనానికి వేదిక కాబోతోంది.

Tags:    

Similar News