అదిరిపోయిన ప్రభాస్ లేటెస్ట్ లుక్.. బయటపడ్డ సందీప్ టాలెంట్!

చిత్ర పరిశ్రమలో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో గానే కాకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోగా భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు ప్రభాస్.

Update: 2026-06-03 05:22 GMT

చిత్ర పరిశ్రమలో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో గానే కాకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోగా భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ గా చలామణి అవుతూ.. నిర్మాతల హీరోగా మరింత పేరు అందుకున్నారు. ముఖ్యంగా భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా వైడ్ అభిమానులను దక్కించుకున్న హీరో గా నిలిచిన ప్రభాస్.. ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల జాబితాలలో ఒకరిగా నిలిచారు.




 


బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు దక్కించుకొని.. ఇక అక్కడి నుంచి వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ లుక్కుతో అభిమానులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు మరోసారి తన అద్భుతమైన ఔట్ఫిట్ తో.. పర్ఫెక్ట్ మేకోవర్తో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఒకవైపు తన సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉంటూనే మరొకవైపు కాస్త సమయం దొరికితే చాలు అభిమానులతో సెల్ఫీలు దిగుతూ వారిని ఆనందపరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక స్టైలిస్ట్ ప్రభాస్ తో తీసుకున్న లేటెస్ట్ లుక్ ఫోటోని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకోవడంతో అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ లేటెస్ట్ లుక్కుకి ఫిదా అవుతూ.. ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు.

ప్రభాస్ లేటెస్ట్ లుక్ విషయానికి వస్తే..ప్రస్తుతం ప్రభాస్ ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతుండగా.. ఒక హెయిర్ స్టైలిస్ట్ ప్రభాస్ తో దిగిన సెల్ఫీని నెట్టింట పంచుకున్నారు. ఈ ఫోటోలో ప్రభాస్ బ్లాక్ టీ షర్ట్ ధరించి.. సరికొత్త హెయిర్ స్టైల్.. రగ్గడ్ బియర్డ్ తో అదిరిపోయే లుక్కులో కనిపించారు. ఈ సరికొత్త మేకోవర్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక అమ్మాయిలైతే పిచ్చెక్కిపోతూ ప్రభాస్ పై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇకపోతే ఆ హెయిర్ స్టైలిస్ట్ ప్రభాస్తో దిగిన ఫోటోని షేర్ చేస్తూ .."షూటింగ్ టైం విత్ బాహుబలి" అంటూ రెడ్ హాట్ ఎమోజిని షేర్ చేసింది. ప్రస్తుతం ప్రభాస్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ప్రభాస్ స్పిరిట్ విషయానికి వస్తే.. సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఇది. త్రిప్తి డిమ్రీ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా ప్రభాస్, త్రిప్తి లకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను అఫీషియల్ గా రిలీజ్ చేసే సినిమాపై అంచనాలు పెంచారు సందీప్ రెడ్డి వంగ. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ సినిమాకు సంబంధించిన ఈ లుక్ అభిమానులను ఆకట్టుకోవడంతో సందీప్ రెడ్డి వంగ టాలెంట్ మామూలుగా లేదుగా.. ప్రభాస్ ను మరో రేంజ్ లో ప్రేక్షకులకు చూపించబోతున్నారా? అనే కామెంట్లు చేస్తున్నారు. మరి సందీప్ తన టాలెంట్ ను ఉపయోగించి ప్రభాస్ ను తెరపై ఏవిధంగా చూపిస్తారో చూడాలి.

Tags:    

Similar News