గ్లామర్ గేమ్ మార్చేసిన స్టార్ హీరోయిన్లు..

గ్లామర్ గేమ్‌ను పూర్తిగా మార్చేస్తూ తమదైన శైలిలో ఫ్యాషన్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఆ ముగ్గురు స్టార్ బ్యూటీస్ విశేషాలు ఇప్పుడు చూద్దాం..

Update: 2026-09-30 11:14 GMT

ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ 'కాస్మోపాలిటన్ ఇండియా' తన 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా విడుదల చేసిన స్పెషల్ ఎడిషన్ కవర్ పేజీలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. టాలీవుడ్, శాండ్‌వుడ్, కోలీవుడ్ అంటూ సౌత్ సినిమా ఇండస్ట్రీని తమ అద్భుతమైన నటనతో పాటు స్టైలిష్ గ్లామర్‌తో ఏలుతున్న ముగ్గురు ట్రెండింగ్ హీరోయిన్లు ఈ మ్యాగజైన్ కోసం ఒకే వేదికపై మెరిశారు. గ్లామర్ గేమ్‌ను పూర్తిగా మార్చేస్తూ తమదైన శైలిలో ఫ్యాషన్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఆ ముగ్గురు స్టార్ బ్యూటీస్ విశేషాలు ఇప్పుడు చూద్దాం..



 


క్యూట్ అండ్ కాన్ఫిడెంట్ కృతి శెట్టి:

'కాస్మోపాలిటన్' కవర్ గర్ల్‌గా మెరిసిన యంగ్ బ్యూటీ కృతి శెట్టి తన క్యూట్ స్మైల్‌తో అందరినీ కట్టిపడేస్తోంది. ఈ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో ఆమె మెథడ్ యాక్టింగ్, వ్యక్తిగత విషయాలు, తన డ్రీమ్ రోల్ గురించి మనసు విప్పి మాట్లాడింది. బోల్డ్ రెడ్ ఓవర్‌సైజ్డ్ బ్లేజర్, గోల్డ్ వాచ్ ధరించి, చిలిపి నవ్వులు చిందిస్తూ ఆమె ఇస్తున్న ఫోజులు ఈ కవర్‌కు హైలైట్‌గా నిలిచాయి. ఇక సినిమాల విషయానికొస్తే, త్వరలోనే ఆమె అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ సరసన వస్తున్నా 'జనవరి 12 విడుదల' చిత్రంలో నటించనుంది.



 


రాయల్ లుక్స్‌తో రుక్మిణి వసంత్ మ్యాజిక్:

లండన్‌లోని ప్రముఖ 'రాడా' అకాడమీలో నటనలో శిక్షణ తీసుకున్న రుక్మిణి వసంత్, శాండ్‌వుడ్ నుండి అన్ని భాషలలో అద్భుతమైన నటి. 'కాస్మోపాలిటన్' కవర్‌పై ఆమె రెండు అద్భుతమైన లుక్స్‌లో అదరగొట్టింది. నల్లటి లాంగ్-స్లీవ్ డ్రెస్‌లో చాలా స్లీక్‌గా కనిపిస్తూనే, మరోవైపు బ్లష్-పింక్ హాల్టర్ డ్రెస్‌లో ఎంతో అందంగా కనిపించింది. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ బ్యూటీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన 'డ్రాగన్' సినిమాలో నటిస్తూ పాన్-ఇండియా స్థాయిలో దూసుకెళ్తోంది.



 


స్టైలిష్ కౌచర్‌తో కల్యాణి ప్రియదర్శన్ గ్లామర్:

గత కొద్ది కాలంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న కల్యాణి ప్రియదర్శన్‌కు ఈ ఏడాది అన్నీ విజయాలే దక్కాయి. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నుండి వింబల్డన్ వరకు ప్రతిచోటా తన ఫ్యాషన్ సెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. 'కాస్మోపాలిటన్' కవర్ కోసం ఆమె షీర్ పౌడర్-బ్లూ ఆర్గాన్జా పఫ్-స్లీవ్ షర్టు, బీడెడ్ బర్డ్-మోటిఫ్ మినీ స్కర్ట్‌లో ఫుల్ కౌచర్ లుక్‌లో మెరిసింది. త్వరలో ఆమె 'జెనీ', 'లోకః చాప్టర్ 2' వంటి భారీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.



 


సినిమాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూనే, ఫ్యాషన్ ప్రపంచంలోనూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ ముగ్గురు తారలు నేటి యువతకు నిజమైన ఫ్యాషన్ ఐకాన్స్‌గా నిలుస్తున్నారు. 'కాస్మోపాలిటన్' 30వ వార్షికోత్సవ సంచిక కోసం వీరు చేసిన ఈ స్టైలిష్ ఫొటోషూట్, రాబోయే రోజుల్లో వీరు సౌత్ ఇండస్ట్రీని ఏవిధంగా ఏలబోతున్నారో స్పష్టంగా చాటిచెబుతోంది.



 


Tags:    

Similar News