వివాహంతో మారిన న‌టి జీవితం!

బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ జీవితంలో వివాహం భారీ మార్పులు తెచ్చిందా? అంటే స‌న్నివేశం అలాగే క‌నిపిస్తోంది.;

Update: 2026-03-31 18:30 GMT

బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ జీవితంలో వివాహం భారీ మార్పులు తెచ్చిందా? అంటే స‌న్నివేశం అలాగే క‌నిపిస్తోంది. వివాహానికి ముందు సోన‌మ్ క‌పూర్ వరుస సినిమాలతో బిజీగా ఉండేది. కానీ పెళ్లి త‌ర్వాత కుటుంబానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఓసారి ఆ వివ‌రాల్లోకి వెళ్తే.. సోనమ్ కపూర్ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాల వివాహం 2018లో ఘనంగా జరిగిన సంగ‌తి తెలిసిందే. పెళ్లికి ముందు `నీర్జా`, `రాంజన`,` ప్రేమ్ రతన్ ధన్ పాయో` వంటి హిట్ చిత్రాలతో బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసింది. కానీ వివాహం అనంత‌రం వృత్తిపరంగా చాలా సెలక్టివ్‌గా మారారు.

నటన కంటే కూడా ఫ్యామిలీ లైఫ్‌ని బ్యాలెన్స్ చేయడానికే ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తుంది. 2022లో మొదటి కుమారుడు వాయు జన్మించిన తర్వాత సోనమ్ సినిమాలకు కొంత విరామం ఇచ్చింది. అనంత‌రం 2023లో `బ్లైండ్` అనే క్రైమ్ థ్రిల్లర్‌తో రీ-ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అప్పటి నుండి సోన‌మ్ మరే కొత్త ప్రాజెక్ట్‌ను కూడా ప్రకటించలేదు. నాటి నుంచి ఆచితూచి అడుగులు వేస్తోంది. కంటెంట్ ఉన్న సినిమాల్లో మాత్రమే నటించాలని నిర్ణయించుకున్నట్లు పలు సందర్భాల్లో వెల్లడించింది.

అలా మూడేళ్లు గ‌డిచిపోయింది. తాజాగా నిన్న‌టి రోజున సోనమ్ కపూర్ రెండ‌వ‌సారి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మిచ్చింది. దీంతో సోన‌మ్ కుటుంబంలో న‌లుగురు స‌భ్యుల‌తో నిండిపోయింది. దీంతో సోన‌మ్ క‌పూర్ మరికొన్ని నెలు పాటు ఇంటికే పరిమితం కానున్నార‌ని తెలుస్తోంది. మ‌రి ఏడాది త‌ర్వాతైన స్పీడ‌ప్ అవుతుందా? లేదా? అన్న‌ది చూడాలి. అయితే సినీ తారలు పెళ్లి తర్వాత కెరీర్‌కు దూరమవుతున్నారనే చర్చ జరిగిన ప్రతిసారీ సోనమ్ తనదైన శైలిలో సమాధానమిస్తుంటుంది. ప్రొఫెషనల్ లైఫ్ కంటే వ్యక్తిగత ఎదుగుదల కుటుంబంతో గడపడం ముఖ్యమని నమ్ముతుంది.

సినిమాలు త‌గ్గించినా? ఫ్యాషన్ బ్రాండ్స్, సోషల్ కాన్సెప్ట్స్ , బిజినెస్ వెంచర్స్‌తో మాత్రం నిత్యం బిజీగా ఉంటుంది. సోనమ్ కపూర్ తన జీవితంలో ప్రతి దశను ఎంతో బాధ్యతగా ఇష్టంతో గడుపుతుంద‌న్న‌ది సుస్పష్టం. సినిమాల్లో విజయం, వైఫల్యాల కంటే మాతృత్వంలోని ఆనందానికి ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తుంది. ఇప్ప‌టికే సోన‌మ్ కు 40 ఏళ్లు వ‌చ్చేసాయి. న‌టించ‌డానికి వ‌య‌సు అడ్డండి కాదు. కానీ న‌టిగా బిజీ అవ్వాలంటే? అమ్మ‌డు సీరియ‌స్ గా తీసుకుంటే త‌ప్ప సాధ్యం కాదు. ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో న‌టీమ‌ణుల మ‌ధ్య పోటీ కూడా పెరిగింది.

న‌త‌వ‌రం హీరోయిన్ల‌తో బాలీవుడ్లో తీవ్ర‌మైన పోటీ క‌నిపిస్తుంది. మ‌రి తండ్రి అనీల్ క‌పూర్ ను మించిన త‌న‌య‌గా ఎదుగుతందంటే? వివాహం త‌ర్వాత నెమ్మ‌దించ‌డం తాజాగా అభిమానుల్లోనూ చ‌ర్చ‌కు దారి తీస్తోంది. పెళ్లి చేసుకున్న క‌రీనా క‌పూర్, కియారా అద్వాణీ, క‌త్రినా కైఫ్ , దీపికా ప‌దుకొణే, అలియాభ‌ట్ లాంటి పెళ్లైన‌ భామ‌లు వృత్తి-వ్య‌క్తిగ‌త జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తున్నా? సోనమ్ క‌పూర్ మాత్రం వారి బాట‌లో న‌డ‌వ‌లేక‌పోతుంద‌న్నది కాద‌న‌లేని నిజం.

Tags:    

Similar News