శోభిత నిక్ నేమ్ ఇండియ‌న్ అంకుల్?

ఇప్పుడు అక్కినేని కోడ‌లు శోభిత కూడా ఒక గ‌మ్మ‌త్త‌యిన ఆలోచ‌న‌ను ప్రెజెంట్ చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. త‌న‌ను తాను శోభిత `ఇండియ‌న్ అంకుల్`! అని బోల్డ్ గా పిలుచుకోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.;

Update: 2025-10-04 10:38 GMT

కొన్నిసార్లు సెల‌బ్రిటీలకు గ‌మ్మ‌త్త‌యిన ఐడియాలు వ‌స్తుంటాయి. ఇప్పుడు అక్కినేని కోడ‌లు శోభిత కూడా ఒక గ‌మ్మ‌త్త‌యిన ఆలోచ‌న‌ను ప్రెజెంట్ చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. త‌న‌ను తాను శోభిత `ఇండియ‌న్ అంకుల్`! అని బోల్డ్ గా పిలుచుకోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

నేను సెల్ఫీ తీసుకునేటప్పుడు ఎప్పుడూ కెమెరా మీద కాకుండా స్క్రీన్ మీద నన్ను నేను చూసుకుంటాను. అది నన్ను `ఇండియన్ అంకుల్‌`లాగా మార్చేస్తే.. అయినా ఫర్వాలేదు అని రాసారు ఈ న‌టి. శోభిత త‌న‌ను తాను ఇలా పిల‌వ‌డానికి కార‌ణం త‌ను ధ‌రించిన హ్యాట్ ప్ర‌భావం అంటూ అభిమానులు గెస్ చేస్తున్నారు.

హ్యాట్ ధ‌రించిన ఫోటోగ్రాఫ్ లోనే కాదు ఇత‌ర ఫోటోల్లోను శోభిత యూనిక్ గా ధీమాగా క‌నిపిస్తోంద‌ని కొంద‌రు అభిమానులు వ్యాఖ్యానించారు. ఈ స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్ లో శోభితను హ‌గ్ చేసుకున్న చైతూ త‌న ముఖం క‌నిపించ‌కుండా దాచేయ‌డం కూడా గ‌మ్మ‌త్త‌యిన విష‌య‌మేనంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

తాజా ఫోటోషూట్ కోసం శోభిత ఎంపిక చేసుకున్న డిజైన‌ర్ దుస్తులు, మేకప్, హెయిర్ స్టైల్ ప్ర‌తిదీ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. వేష‌ధార‌ణ‌ల ప‌రంగా ప్ర‌యోగానికి వెన‌కాడ‌ని శోభిత ధ‌రించిన గాజులు, బ్రౌన్ షూస్, స్పోర్టీ ఇన్న‌ర్ లు ప్ర‌తిదీ ప్ర‌త్యేక‌త‌ను క‌లిగి ఉన్నాయ‌ని అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. శోభిత ఏం చేసినా అది ప్ర‌త్యేకంగా ఉంటుంద‌ని, కెరీర్ లో న‌ట‌న ప‌రంగా త‌న ఎంపిక‌లు ప్ర‌త్యేకం.. ఫ్యాష‌న్ సెన్స్ ప‌రంగాను యూనిక్ అంటూ ప్ర‌శంసిస్తున్నారు. పెళ్లి త‌ర్వాత శోభిత కెరీర్ ప‌రంగా ఆచితూచి అడుగులు వేస్తుంటే, చైత‌న్య మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్నారు.

Tags:    

Similar News