విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో స‌రైన ప్రేమ‌క‌థ కుద‌రాలి!

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఎస్.కే.ఎన్, విజయ్ దేవరకొండతో మళ్ళీ కలిసి పనిచేయడంపై ఉన్న స్పష్టమైన ఆలోచనలను పంచుకున్నారు.

Update: 2026-09-04 03:51 GMT

టాలీవుడ్‌లో సరికొత్త కాన్సెప్ట్ చిత్రాలను ప్రోత్సహించే యంగ్ ప్రొడ్యూసర్లలో ఎస్.కే.ఎన్ (SKN) ఒకరు. GA2 బ‌న్నివాసుతో క‌లిసి ఎస్.కే.ఎన్ భాగ‌స్వామి. విజయ్ దేవరకొండ హీరోగా నిర్మించిన `టాక్సీవాలా` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించడమే కాకుండా.. వీరి కాంబినేషన్‌కు ప్రత్యేక క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఎస్.కే.ఎన్, విజయ్ దేవరకొండతో మళ్ళీ కలిసి పనిచేయడంపై ఉన్న స్పష్టమైన ఆలోచనలను పంచుకున్నారు. గ‌త‌ విజయం ఇచ్చిన ఉత్సాహంతో.. విజయ్ ఇమేజ్‌కు తగినట్లుగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కాంబినేషన్‌కు సంబంధించి ఎస్.కే.ఎన్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. విజయ్ దేవరకొండ కోసం తన వద్ద ఒక ప్రత్యేకమైన కథాంశం ఉందని.. ఈ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేయడానికి తన మైండ్‌లో ఒక డైరెక్టర్ కూడా ఉన్నారని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ దర్శకుడు తన ప్రాజెక్టులతో.. విజయ్ దేవరకొండ తన సినిమాలతో బిజీగా ఉన్నారని.. సరైన సమయం- డేట్లు కుదిరిన వెంటనే ఈ క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కడం ఖాయమని ఎస్.కే.ఎన్ తెలిపారు.

విజయ్ దేవరకొండను యూత్ ఐకాన్‌గా అభివర్ణిస్తూ.. ఆయన కోసం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ -రొమాంటిక్ ఫిల్మ్ చేయాల‌నే ఆలోచనలో ఉన్నట్లు ఎస్.కే.ఎన్ వెల్లడించారు. విజయ్ ఇప్పటికే లవ్ జోనర్‌లో ఎన్నో గుర్తుండిపోయే చిత్రాలు చేసినా ఈసారి సరికొత్త టచ్ ఉన్న ప్రేమకథతో ప్రేక్షకులను అలరించాలని భావిస్తున్నారు. సరైన సినర్జీ- ఎనర్జీలు కలిసినప్పుడే మంచి సినిమా రూపుదిద్దుకుంటుందని.. అందుకే ఎలాంటి తొందరపాటు లేకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు.

దేవరకొండ కుటుంబంతో తనకు ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని కూడా ఎస్.కే.ఎన్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, రష్మికలతో కలిసి ప్రాజెక్టులు చేస్తూ 3-4 సినిమాల సుదీర్ఘ ప్రయాణం ఉన్నందున ఆ కుటుంబంతో ప్రత్యేక బంధం ఏర్పడిందన్నారు. విజయ్ తండ్రి గోవర్ధన్ రావు కూడా ఎప్పుడూ ఒక మంచి కథతో రమ్మని అడుగుతుంటారని.. అందుకే ఒక బలమైన కథ.. విజన్ ఉన్న డైరెక్టర్‌తోనే వారిని కలవాలని భావిస్తున్నట్లు ఆయన వివరించారు.

చివరగా విజయ్ దేవరకొండ కెరీర్ లైనప్‌పై ఎస్.కే.ఎన్ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రాహుల్ సంకృత్యన్ (మైత్రి మూవీస్) .. గౌతమ్ తిన్ననూరిల దర్శకత్వంలో విజయ్ చేయనున్న త‌దుప‌రి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్లుగా నిలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. విజయ్ దేవరకొండ రేంజ్ - మార్కెట్‌కు తగ్గట్టుగా మళ్ళీ పెద్ద హిట్లు పడితే ఇండస్ట్రీకి వచ్చే కిక్ వేరేలా ఉంటుందని పేర్కొంటూ.. సరైన సమయంలో తమ కాంబినేషన్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు.

Tags:    

Similar News