రాజేంద్ర ప్రసాద్‌లా నిలిచిపోతాడు: శివ నిర్వాణ, బివిఎస్ రవి ప్రశంసలు!
శ్రీ విష్ణులోని టాలెంట్‌ను పొగుడుతూ ఈ ఇద్దరూ చేసిన కామెంట్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. శివ నిర్వాణ మాట్లాడుతూ తన గాడ్‌ఫాదర్ కోన వెంకట్‌పై ఉన్న అభిమానాన్ని గుర్తు చేసుకున్నారు.
శ్రీ విష్ణు హీరోగా రాబోతున్న లేటెస్ట్ పీరియడ్ ఎంటర్‌టైనర్ కామ్రేడ్ కళ్యాణ్ టీజర్ రిలీజ్ కాగానే మంచి హైప్ తెచ్చుకుంది. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో కోన ఫిల్మ్ కార్పొరేషన్, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 9న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ, రైటర్ బివిఎస్ రవి పాల్గొన్నారు.
శ్రీ విష్ణులోని టాలెంట్‌ను పొగుడుతూ ఈ ఇద్దరూ చేసిన కామెంట్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. శివ నిర్వాణ మాట్లాడుతూ తన గాడ్‌ఫాదర్ కోన వెంకట్‌పై ఉన్న అభిమానాన్ని గుర్తు చేసుకున్నారు. దాదాపు 12 ఏళ్ల అసిస్టెంట్ డైరెక్టర్ స్ట్రగుల్ తర్వాత నిన్ను కోరి సినిమాతో తనను తొలి మెట్టు ఎక్కించిన గురువు కోన వెంకట్ అని, ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు.
కోన వెంకట్ ఎవరినైనా నమ్మి సినిమా స్టార్ట్ చేశారంటే మరో శివ నిర్వాణ రాబోతున్నాడని తనకు అనిపిస్తుందని, ఈ మూవీతో దర్శకుడు జానకిరామ్ పెద్ద స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. హీరో శ్రీ విష్ణుతో తనకున్న పాత అనుబంధాన్ని శివ నిర్వాణ గుర్తు చేసుకున్నారు. పరశురామ్ డైరెక్షన్‌లో వచ్చిన సోలో సినిమాలో శ్రీ విష్ణు చిన్న రోల్ చేసినప్పుడు తాను క్లాప్ అసిస్టెంట్‌గా పనిచేశానని గుర్తు చేశారు.
అప్పటి నుంచి ఇద్దరం పారలల్‌గా సమానంగా ఎదగడం చాలా సంతోషాన్ని ఇస్తుందన్నారు. ఇంట్లో భోజనం చేసేటప్పుడు రిలాక్స్ అవ్వడానికి తాను శ్రీ విష్ణు సినిమాలు ఎక్కువగా పెట్టుకుని చూస్తుంటానని వెల్లడించారు. శ్రీ విష్ణు కామెడీ టైమింగ్‌ను లెజెండరీ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌తో శివ నిర్వాణ పోల్చారు.
గతంలో వచ్చిన ఆహా నా పెళ్లంట లాంటి క్లాసిక్ సినిమాలను ఈ రోజుకు కూడా జనం ఎలాగైతే టీవీల్లో ఇష్టపడి చూస్తున్నారో, భవిష్యత్తులో శ్రీ విష్ణు చేసిన సామజవరగమన లాంటి చిత్రాలను కూడా అలాగే చూస్తారని ప్రశంసించారు. తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇంట్లో కూర్చుని హాయిగా నవ్వుకునేలా వినోదాన్ని అందిస్తున్న శ్రీ విష్ణుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రైటర్ బివిఎస్ రవి మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ గురించి సరదా విషయాలు షేర్ చేసుకున్నారు. కోన వెంకట్ తనకు ఈ కథ ఎప్పుడో చెప్పారని, విన్నప్పుడే చాలా నవ్వుకున్నానని చెప్పారు. ప్రొడ్యూసర్ కృష్ణ కర్నాటి తనకు నైబర్, మంచి ఫ్రెండ్ అని, ఆయనకున్న ప్యాషన్, కమిట్‌మెంట్ తాను స్వయంగా చూశానని అన్నారు. ఈ సినిమాలో తాను ఒక రోజు షూటింగ్‌లో చిన్న గెస్ట్ రోల్ చేశానని, అప్పుడే డైరెక్టర్ జానకిరామ్ షాట్ సెలెక్షన్, పనితీరు చూసి చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడని నిర్మాతకు ముందే చెప్పానని గుర్తు చేశారు.
మాస్ మహారాజా రవితేజ సినిమాల్లాగే శ్రీ విష్ణు చిత్రాలు కూడా ప్రతీ ఒక్కరి ఇంట్లో వాళ్లలా అందరికీ నచ్చేలా ఉంటాయని బివిఎస్ రవి తెలిపారు. అందరి ఇంట్లో హీరో శ్రీ విష్ణు అని, ఈ కామ్రేడ్ కళ్యాణ్ కూడా పెద్ద బ్లాక్‌బస్టర్ కావాలని విష్ చేశారు. చివరగా హీరోయిన్ మహిమా నంబియార్‌తో పాటు టెక్నీషియన్లందరికీ బెస్ట్ విషెస్ చెబుతూ, టాలీవుడ్‌కు సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ ఉండకూడదంటూ స్పీచ్ ముగించారు.