శర్వానంద్ బైకర్.. సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉందంటే?
ముఖ్యంగా ఇంటర్వెల్ కు ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్లు, క్లిఫ్ జంప్ సన్నివేశం సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది.;
చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బైకర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మోటార్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన తొలి భారతీయ చిత్రంగా రానున్న ఆ సినిమాను దర్శకుడు అభిలాష్ రెడ్డి రూపొందించగా, యూవీ క్రియేషన్స్ సంస్థ అత్యంత భారీ స్థాయిలో నిర్మించింది. తాజాగా ఆ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికేట్ పొందింది. అలాగే సినిమా నిడివి 2 గంటలు 35 నిమిషాలుగా ఫిక్స్ చేశారు.
సెన్సార్ రిపోర్ట్ ప్రకారం.. బైకర్ విజువల్ వండర్ గా ఎమోషన్స్ తో నిండిన ఒక భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా రేసింగ్ సన్నివేశాలు హాలీవుడ్ రేంజ్ లో ఉండటంతో తెలుగు ప్రేక్షకులు సిల్వర్ స్క్రీన్ పై చూసే ఎక్స్పీరియన్స్ విభిన్నంగా ఉంటుందని సమాచారం. రియల్ రేస్ ట్రాక్ లపై చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని వినికిడి.
సినిమా ఫస్టాఫ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో ప్రేక్షకులను వెంటనే కథలోకి తీసుకెళ్తుందని సెన్సార్ వర్గాలు పేర్కొనట్లు తెలుస్తోంది. శర్వానంద్ తన పాత్రలో అద్భుతంగా నటించి ప్రతి సన్నివేశంలోనూ ఆకట్టుకుంటారని వినికిడి. చాలా కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తున్న రాజశేఖర్ తన ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులను ఆకర్షిస్తారని సమాచారం.
ముఖ్యంగా ఇంటర్వెల్ కు ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్లు, క్లిఫ్ జంప్ సన్నివేశం సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది. ఆ సన్నివేశాలు సెకండాఫ్ పై భారీ అంచనాలు పెంచేలా ఉంటాయని సమాచారం. తండ్రీకొడుకుల ఎమోషన్స్ ప్రధానంగా ఉండి, శర్వానంద్- రాజశేఖర్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కదిలించేలా ఉంటాయని వినికిడి.
సాంకేతికంగా కూడా బైకర్ రిచ్ వాల్యూస్ తో రూపొందిన సినిమా అని టాక్ వినిపిస్తోంది. విజువల్స్, సౌండ్ డిజైన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ కథకు అనుగుణంగా ఉండి సినిమా అనుభూతిని మరింత పెంచుతాయని టాక్ వినిపిస్తోంది. ప్రతి విషయంలో దర్శకుడు ఎంతో ఫోకస్ పెట్టినట్టు సెన్సార్ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. క్లైమాక్స్ లో వచ్చే భారీ రేసింగ్ సీక్వెన్స్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తుందని సమాచారం.
ఆ సన్నివేశం ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందని తెలుస్తోంది. మొత్తంగా బైకర్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అందించే రేసింగ్ డ్రామాగా నిలుస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక చిత్రం ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. విడుదలకు ముందు రోజు పడనున్న పెయిడ్ ప్రీమియర్ షోలు ఇప్పటికే హౌస్ ఫుల్ అయ్యాయని సమాచారం. అన్ని ప్రాంతాల్లో టికెట్లకు డిమాండ్ నెలకొనడం సినిమాపై ఆసక్తిని స్పష్టంగా చూపిస్తోంది. ఈ నేపథ్యంలో బైకర్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటుందా అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.