ఆ ఎక్స్ పీరియన్స్ కెరీర్ కు పూల బాట!
ఆ రోజుల్లో తాను నేర్చుకున్న ముఖ్యమైన పాఠం తన సినీ ప్రయాణంలో ఎంతో సహాయపడిందని వెల్లడించారు.
బాలీవుడ్ యువ నటి శర్వారి వాఘ్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్న అమ్మడు తాజాగా కెరీర్ తొలి నాళ్ల గురించి ఆసక్తికర విషయాన్ని పంచు కున్నారు. ప్రధాన నటిగా తెరపైకి రాకముందు అడ్వర్టైజింగ్ రంగంలో పనిచేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో తాను నేర్చుకున్న ముఖ్యమైన పాఠం తన సినీ ప్రయాణంలో ఎంతో సహాయపడిందని వెల్లడించారు. అందరి నటీమణులు మాదిరిగా షర్వారి కూడా కెరీర్ ఆరంభంలో ఎన్నో ఆడిషన్లు ఎదుర్కొన్నారు.
యాడ్స్ షూటింగ్స్‌లో పాల్గొనే సమయంలో చిన్న చిన్న షాట్స్ లో కూడా వంద శాతం ఎఫర్ట్ పెట్టడం ఎంత ముఖ్యమో ఆనాడే తెలుసుకున్నట్లు శార్వరీ తెలిపారు. కెమెరా ముందు ఎంత సేపు ఉన్నామనేది ముఖ్యం కాదని ఆ కొద్ది సమయంలోనే ప్రేక్షకులను ఆకట్టుకునేలా హావభావాలు పండించడం ఒక కళ అని పేర్కొన్నారు. అడ్వర్టైజింగ్ రంగంలో పని చేయడం వల్ల నటనపై మరింత పట్టు సాధించగలిగానని షర్వారి అన్నారు. కొన్ని సెకన్ల వ్యవధిలో డైరెక్టర్ చెప్పిన ఎమోషన్‌ను పర్ఫెక్ట్‌గా పలికించడం యాడ్స్‌లో చాలా ముఖ్యం.
ఈ అనుభవమే తనకు సినిమాల్లోకి వచ్చాక పెద్ద పాత్రలను అవలీలగా చేయడానికి పునాది గా నిలిచిందన్నారు. ప్రతి రోజూ కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన తనను ఈ స్థాయికి తెచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న షర్వారి ప్రతి విజయం వెనుక కఠిన శ్రమ ఉందన్నారు . ఏప్రాన్ నుంచి సినిమా సెట్స్ వరకు ప్రతీ అనుభవం ఒక పాఠం నేర్పిందన్నారు. తాను నటిస్తున్న ప్రతి చిత్రంలోనూ సహజమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుండటానికి తొలి నాళ్ల అనుభవాలే ప్రధాన కారణమనివిమర్శకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
ఇండస్ట్రీలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ప్రతిభతో పైకి వచ్చిన నట్లలో షర్వారి ఒకరుగా నిలుస్తున్నారు. ఆమె ఎంచుకుంటున్న స్క్రిప్ట్‌లు ..గ్లామర్ పాత్రలతో పాటు పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ పాత్రలు మంచి పేరు తెచ్చిపె డుతున్నాయి. చిన్న యాడ్స్ షూటింగ్స్‌తో కెరీర్ ప్రారంభించి నేడు స్టార్ హీరోయిన్‌గా ఎదిగే వరకు షర్వారి పడిన కష్టం ఎంతో మందికి ఆదర్శం. తొలి నాళ్లలో తాను నేర్చుకున్న చిన్న పాఠాలే తనను నేడు విజయవంతమైన మార్గంలో నడిపిస్తున్నాయి. శర్వారీ నుంచి మరిన్ని మంచి సినిమాలు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అలాగే నటిగా కెరీర్ ప్రారంభించే క్రమంలో ఎలాంటి అవకాశాలు వచ్చినా కాదనకుండా పనిచేయడం ద్వారా వచ్చే అనుభవం ఏ నటి కెరీర్ అయినా కీలకం. ప్రత్యేకించి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చే నటీమణులు సినిమాలకంటే ముందు యాడ్స్..చిన్న చిన్న సీరియల్స్ ద్వారా మంచి అనుభవాన్ని సంపాదించే అవకాశం ఉంటుందన్నది అంతే వాస్తవం.