అర్జున్ రెడ్డి పిల్ల బికినీ భీభత్సం.. స్టన్నింగ్!

అర్జున్ రెడ్డితో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన నటి శాలిని పాండే, అప్పట్లో సింపుల్ లుక్‌తోనే అందరినీ ఆకట్టుకుంది.;

Update: 2025-08-29 15:18 GMT

అర్జున్ రెడ్డితో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన నటి శాలిని పాండే, అప్పట్లో సింపుల్ లుక్‌తోనే అందరినీ ఆకట్టుకుంది. కానీ ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. తాజా బికినీ ఫోటో షూట్‌లో ఆమె గ్లామరస్ అవతార్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. బీచ్‌లో బ్లాక్ బికినీతో సేదతీరుతూ తీసుకున్న ఫోటోలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి.

శాలిని పాండే కెరీర్‌ను వెనక్కి తిరిగి చూస్తే, టాలీవుడ్‌లో అర్జున్ రెడ్డి తరువాత బిగ్ ఆఫర్స్ రావాలని ఆశించారు. అయితే ఆ అంచనాలు నెరవేరలేదు. కొన్ని తమిళ చిత్రాలు, బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌లో నటించినా, పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ ఆమెకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, సోషల్ మీడియాలో తన స్టైల్, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్‌ను క్రమం తప్పకుండా షేర్ చేస్తూ అభిమానులతో కనెక్ట్ అవ్వడం.

ఇటీవల ఇటాలియన్ స్ట్రీట్స్‌లో రెడ్ ట్రౌజర్, బ్యాక్‌లెస్ టాప్‌లో చేసిన ఫోటో షూట్ కూడా ఫాలోవర్స్ దృష్టిని ఆకర్షించింది. సింపుల్ గ్లామర్ కాకుండా ధైర్యంగా ఎంచుకునే అవుట్‌ఫిట్స్‌తో ఆమె ఫ్యాషన్ ఎక్స్‌పెరిమెంట్స్ కొనసాగిస్తోంది. ఇలాగే ట్రావెల్ మూడ్‌లో షేర్ చేసే పిక్స్ కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

సినిమాల్లో ఎక్కువ సక్సెస్ రాకపోయినా, శాలిని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. వెబ్ కంటెంట్, హిందీ ప్రాజెక్ట్స్, అలాగే OTT ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తనకు మరోసారి అవకాశం వస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియాలో ట్రెండీ కంటెంట్ పంచుకోవడం ద్వారా తన ప్రెజెన్స్‌ను నిరంతరం కొనసాగిస్తోంది.

Tags:    

Similar News