సూపర్‌ స్టార్‌ మూడో ఏడాదిలోనూ లేనట్లే..!

బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ అభిమానులతో పాటు హిందీ సినిమా ప్రేక్షకులు 'కింగ్‌' సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.

Update: 2026-07-14 17:30 GMT

బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ అభిమానులతో పాటు హిందీ సినిమా ప్రేక్షకులు 'కింగ్‌' సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. పఠాన్‌ వంటి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని షారుఖ్‌ ఖాన్‌కి అందించిన సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. పఠాన్ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా భారీ యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో కింగ్‌ సినిమాను సిద్దార్థ్‌ రూపొందిస్తున్నాడు. గత రెండేళ్లుగా ఈ సినిమా గురించి మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఎట్టకేలకు సినిమాను ఈ ఏడాది చివరి వరకు విడుదల చేయబోతున్నట్లుగా కొన్ని వారాల క్రితం దర్శకుడు చెప్పుకొచ్చాడు. కానీ తాజా పరిణామాలు, పరిస్థితులు చూస్తూ ఉంటే సినిమా ఇప్పట్లో విడుదల అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. బాలీవుడ్ వర్గాల వారు కింగ్‌ సినిమా వచ్చే ఏడాదిలోనే విడుదల అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

షారుఖ్‌ ఖాన్‌ కింగ్‌ సినిమా రిలీజ్‌...

ఈ ఏడాది చివర్లో విడుదల చేయడం కోసం కింగ్‌ సినిమాను రెడీ చేస్తున్న దర్శకుడు సిద్దార్థ్‌ కి పెద్ద షాక్‌ తగిలింది. షూటింగ్‌ సమయంలో షారుఖ్ ఖాన్‌కి గాయం అయింది. ఆ గాయంతోనే షూటింగ్‌లో పాల్గొంటూ ఉండగా భుజం నొప్పి మరింత ఎక్కువ అయిందని, దాంతో షూటింగ్‌ ను నిలిపి వేయాల్సి వచ్చిందని సమాచారం అందుతోంది. యాక్షన్‌ సీన్స్ కోసం షారుఖ్ ఖాన్‌ ఎంతటి సాహసం అయినా చేసేందుకు రెడీ అవుతాడు. అత్యంత కఠినమైన సీన్స్‌ ను సైతం షారుఖ్‌ సొంతంగానే చేసిన దాఖలాలు ఉన్నాయి. అందుకే ఇటీవల యాక్షన్‌ సీన్స్‌ షూట్‌ సమయంలో గాయం అయిందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. షారుఖ్‌ ఖాన్‌ కనీసం మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. అందుకే సినిమా షూటింగ్‌ నిలిపి వేసినట్లుగా బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

పఠాన్‌, జవాన్‌ సినిమాల తర్వాత...

షారుఖ్‌ ఖాన్‌ హీరోగా సినిమా వచ్చి ఏకంగా మూడు ఏళ్లు అవుతుంది. 2023లో షారుఖ్‌ ఖాన్‌ నుంచి వరుసగా పఠాన్‌, జవాన్‌, డుంకీ సినిమాలు వచ్చాయి. మూడు సినిమాలకు మూడు సినిమాలు బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఏ సినిమాకు ఆ సినిమా అన్నట్లుగా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో షారుఖ్‌ తదుపరి సినిమాలపై సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. ఒకే ఏడాది మూడు సినిమాలతో హిట్‌ కొట్టిన షారుఖ్‌ ఖాన్‌ అనూహ్యంగా మూడు ఏళ్ల గ్యాప్‌ తీసుకున్నాడు. 2024, 2025లో షారుఖ్‌ ఖాన్‌ నటించిన సినిమాలు ఒక్కటి కూడా రాలేదు. కనీసం 2026లో అయినా కింగ్‌ సినిమాతో కింగ్‌ ఖాన్‌ వస్తాడేమో అనుకుంటే అది కూడా సాధ్యం కావడం లేదు. ఈ ఏడాది లో షారుఖ్‌ కింగ్‌ మూవీ విడుదల కాబోవడం లేదని యూనిట్‌ సభ్యులు ఇప్పటికే కన్ఫర్మ్‌ చేశారు.

బాలీవుడ్‌ కింగ్ ఖాన్‌ షారుఖ్‌ న్యూ మూవీ...

2027లో సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అంటే 2026లోనూ షారుఖ్‌ ఖాన్‌ ఫ్యాన్స్‌కి నిరాశే మిగిలింది అని చెప్పక తప్పదు. వరుసగా మూడు ఏళ్లలో షారుఖ్‌ ఒక్క సినిమాను విడుదల చేయక పోవడంను ఫ్యాన్స్‌ తప్పుబడుతున్నారు. ఎంత ఏడాదిలో మూడు సినిమాలు విడుదల చేస్తే మాత్రం మూడు ఏళ్లు కనీసం ఒక్క సినిమాను విడుదల చేయకుండా ఎలా ఉంటారు అంటూ విమర్శలు గుప్పిస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. కనీసం వచ్చే ఏడాదిలో అయినా షారుఖ్‌ ఖాన్‌ రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి ఈ మూడు ఏళ్ల గ్యాప్‌ ను ఫిల్‌ చేయాలి అంటూ ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. కింగ్‌ సినిమాలో షారుఖ్‌ ఖాన్‌తో పాటు దీపికా పదుకునే, అభిషేక్‌ బచ్చన్‌, అనిల్‌ కపూర్‌, సుహానా ఖాన్‌, రాణీ ముఖర్జీ, జాకీ ష్రాఫ్‌ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Tags:    

Similar News