స్టార్ హీరో సెట్స్ నుంచి క్లైమాక్స్ యాక్షన్ సీన్ ఔట్!
ముఖంపై తగిలిన గాయాలు, రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌లో వరుసగా నిలిపి ఉంచిన కార్లు వంటివి క్లైమాక్స్ సీన్ ఎంత భారీగా ఉండబోతుందో హింట్ ఇస్తున్నాయి.
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `కింగ్` చిత్రంపై అంచనాలుఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుండి వరుసగా జరుగుతున్న లీకులు యూనిట్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశానికి సంబంధించిన కొన్ని కీలక చిత్రాలు ఇంటర్నెట్‌లో లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పక్కా కార్ చేజింగ్ సీక్వెన్స్ షూట్ చేస్తున్న సమయంలో ఈ ఫోటోలను తీసినట్లు స్పష్టమవుతోంది. వైరల్ అవుతున్న తాజా చిత్రాలలో షారుఖ్ ఖాన్ ఎంతో ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు.
ముఖంపై తగిలిన గాయాలు, రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌లో వరుసగా నిలిపి ఉంచిన కార్లు వంటివి క్లైమాక్స్ సీన్ ఎంత భారీగా ఉండబోతుందో హింట్ ఇస్తున్నాయి. గత నెల రోజులుగా చిత్ర బృందం ఈ హై-ఓల్టేజ్ యాక్షన్ , చేజింగ్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ యాక్షన్ డ్రామాలో షారుఖ్ ఖాన్ సరికొత్త రగ్గడ్ లుక్‌లో మెరవబోతున్నారని ఫోటోలు చూస్తే అర్థమవుతోంది. దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ షెడ్యూల్ సమయంలో షారుఖ్ ఖాన్ బ్లాక్ మస్టాంగ్ కారులో యాక్షన్ సీన్లు చేస్తున్నట్లు అభిమానులు గుర్తించారు. అంతకుముందు ఈ సినిమాలోని రొమాంటిక్ సాంగ్ కోసం దీపికా పదుకోణే, షారుఖ్ ఖాన్‌ల లీకైన విజువల్స్ కూడా నెట్టింట హల్‌చల్ చేశాయి.
కేప్ టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన ఆ సాంగ్ షూట్‌తో పాటు ఇప్పుడు లీకైన కార్ చేజింగ్ ఫోటోలు సినిమాపై హైప్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తున్నాయి. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ విలన్‌గా నటిస్తుండటంతో షారుఖ్ - అభిషేక్ మధ్య వచ్చే మైండ్ బ్లోయింగ్ ఫేస్-ఆఫ్ సీక్వెన్స్ కోసమే ఈ క్లైమాక్స్ ప్లాన్ చేసినట్లు టాక్ నడుస్తోంది.
ఒకవైపు ఈ లీకులు అభిమానులను ఖుషీ చేస్తున్నా? దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. `దయచేసి కింగ్ సెట్స్ నుండి ఎలాంటి లీకైన కంటెంట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దు` అంటూ అభిమానులకు బహిరంగంగా విజ్ఞప్తి చేశారు.
చిత్ర బృందం అహోరాత్రులు కష్టపడి థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇవ్వాలని చూస్తోందని, మేకర్స్ అధికారికంగా విడుదల చేసే వరకు ఓపిక పట్టాలని సిద్ధార్థ్ ఆనంద్ కోరారు. షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండటంతో ప్రాజెక్ట్ పై భారీ బిజినెస్ క్రేజ్ నెలకొంది. సాంకేతికత పెరిగిన నేటి రోజుల్లో ఎంత జాగ్రత్తగా ఉన్నా సినిమా షూటింగ్ వివరాలు లీక్ కావడం మేకర్స్‌కు పెద్ద సవాలుగా మారింది. ఏదేమైనా? ఈ లీకులు ఒక రకంగా సినిమాకు ఫ్రీ పబ్లిసిటీని తెచ్చిపెడుతున్నాయనేది వాస్తవం. `పఠాన్`, `జవాన్` చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన షారుఖ్ ఖాన్ కింగ్ సినిమా క్లైమాక్స్ యాక్షన్‌తో థియేటర్లలో ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తారో చూడాలి.