సెప్టెంబర్ లో థియేటర్లలో సందడి చేయబోయే చిత్రాలు ఇవే!

మరి సెప్టెంబర్ నెలలో థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఆ చిత్రాల గురించి ఇప్పుడు చూద్దాం.

Update: 2026-08-31 05:02 GMT

కొత్త వారం వస్తే కొత్త చిత్రాల కోసం ప్రేక్షకులు ఏ విధంగా అయితే ఎదురు చూస్తారో.. కొత్త నెల వచ్చింది అంటే మరికొన్ని చిత్రాల కోసం అంతే ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక నేటితో ఆగస్టు నెల పూర్తి కాబోతోంది. రేపటి నుంచి సెప్టెంబర్ మాసం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సెప్టెంబర్ మొదటి వారం నుండి లాస్ట్ వారం వరకు పలు చిత్రాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. మరి సెప్టెంబర్ నెలలో థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఆ చిత్రాల గురించి ఇప్పుడు చూద్దాం.

సెప్టెంబర్ 3:

సుమంత్ ప్రభాస్ హీరోగా , సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న 'రోమాంచికం' సినిమా సెప్టెంబర్ 3వ తేదీన విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో అనంతిక సనిల్ కుమార్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా వేణుగోపాల్ రెడ్డి ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు.

ఇదే రోజు దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న 'ఐయామ్ గేమ్' కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తోంది. ట్రైలర్ అద్భుతంగా ఉందని అటు ఎన్టీఆర్ కూడా పోస్ట్ పెట్టడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా నెలకొన్నాయి.

సెప్టెంబర్ 4:

సెప్టెంబర్ 4న అల్లరి నరేష్ తన పాత జోనర్ నమ్ముకుని ప్రేక్షకులు ముందుకు వస్తున్న చిత్రం 'రంభ ఊర్వశి మేనక'. ఈ సినిమా సెప్టెంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే శ్వేత లక్ష్మణ్, కుమార్ కాసారం జంటగా నటించిన 'సహా' చిత్రంతో పాటు శ్రీరామ్ నటించిన 'మా రాముడు అందరివాడు' చిత్రం కూడా అదే రోజు విడుదల కాబోతోంది.

సెప్టెంబర్ 10:

సెప్టెంబర్ రెండవ వారం అయిన సెప్టెంబర్ 10వ తేదీన కార్తీక్ హీరోగా 'సర్దార్' చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న 'సర్దార్ 2' విడుదల కాబోతోంది. ముఖ్యంగా కార్తీకి తెలుగు ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ , తొలిభాగానికి వచ్చిన ఆదరణ కారణంగానే ఇప్పుడు సర్దార్ 2 సెప్టెంబర్ నెలలో విడుదల కాబోతుండడంతో అందరి అంచనాలు దీని పైనే ఉన్నాయి.

సుమంత్ నటించిన 'మహేంద్రగిరి వారాహి', ఆనంద్ దేవరకొండ నటించిన 'ఎపిక్' చిత్రాలు రెండు కూడా సెప్టెంబర్ 11న విడుదల కాబోతున్నాయి. 'బేబీ' చిత్రం తర్వాత మళ్లీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబోలో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

సెప్టెంబర్ 18:

నిహాల్ నటించిన 'సీక్రెట్ సోల్జర్' కూడా థియేటర్లలోకి సెప్టెంబర్ 18న రాబోతోంది.

సెప్టెంబర్ 24:

టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న చిత్రం 'ది ప్యారడైజ్'. నాని నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో దసరా సినిమా వచ్చి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో మళ్లీ ఈ మూవీపై అంచనాలు నెలకొన్నాయి..ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ సినిమాపై ఊహించని బజ్ క్రియేట్ చేసింది. అనిరుధ్ మ్యాజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది . నాని కెరియర్లో భారీ బడ్జెట్ నిర్మాణంలో రాబోతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదల కాబోతోంది. ఇందులో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్ చేస్తుండగా .. మోహన్ బాబు విలన్ గా , కయాదులోహర్ హీరోయిన్గా నటిస్తున్నారు.

సెప్టెంబర్ 25:

అరవింద్ నటించిన రూపాయనమః చిత్రం విడుదల కాబోతోంది.

ఇలా మొత్తానికి అయితే సెప్టెంబర్ నెల మొత్తం భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి ఏ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News