RC17 : జాన్వీ కంటే ఈమె బెటర్‌..!

రామ్‌ చరణ్‌, సుకుమార్‌ కాంబోలో రూపొందబోతున్న సినిమా కోసం ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Update: 2026-10-13 05:31 GMT

రామ్‌ చరణ్‌, సుకుమార్‌ కాంబోలో రూపొందబోతున్న సినిమా కోసం ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో సినిమాను మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్ ను సుకుమార్‌ పూర్తి చేసినట్లుగా సమాచారం అందుతోంది. దాదాపు రెండేళ్ల గ్యాప్‌ తీసుకున్న సుకుమార్‌ ఫుల్ స్వింగ్త్‌తో రామ్‌ చరణ్‌ మూవీ షూటింగ్‌కు హాజరు కాబోతున్నట్లు ఆయన శిష్యులు మాట్లాడుతున్నారు. సుకుమార్‌ స్క్రిప్ట్‌ పై ఎంత వర్క్‌ చేస్తే సినిమా అంత అద్భుతంగా వస్తుందని, పుష్ప సినిమా విషయంలో నిరూపితం అయ్యింది. అందుకే రామ్‌ చరణ్‌ సినిమా కోసం దాదాపుగా సుకుమార్‌ ఏడాది పాటు స్క్రిప్ట్‌ వర్క్ చేశాడని, ఇంకా ఫైనల్‌, ఫినిషింగ్‌ వర్క్‌ జరుగుతుంది కనుక కచ్చితంగా అద్భుతంగా వచ్చి ఉంటుంది అనే విశ్వాసం ను ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు, అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

రామ్‌ చరణ్‌, సుకుమార్‌ కాంబో మూవీ....

ఇటీవలే రామ్‌-సుక్కు కాంబో మూవీకి సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ రవిచంద్రన్‌ పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మైత్రి మూవీ మేకర్స్ వారు ఇప్పటికే సంగీత దర్శకుడు అనిరుధ్‌ కి అడ్వాన్స్ ఇచ్చారని సమాచారం అందుతోంది. సుకుమార్‌ మొదటి సారి దేవి శ్రీ ప్రసాద్‌ తో కాకుండా మరో సంగీత దర్శకుడితో వర్క్ చేయబోతున్నాడు. హిట్‌ పెయిర్‌ బ్రేక్ కాబోతున్న నేపథ్యంలో కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, మరికొందరు మాత్రం అంతకు మించి ఉండటం ఖాయం అనే నమ్మకంతో ఉన్నారు. సంగీత దర్శకుడి గురించి ఒక వైపు చర్చ జరుగుతున్న ఈ సమయంలోనే హీరోయిన్‌ కి సంబంధించిన విషయమై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రామ్‌ చరణ్‌ కు జోడీగా దర్శకుడు సుకుమార్‌ సారా అర్జున్‌ ను హీరోయిన్‌గా ఎంపిక చేసే విషయమై చర్చలు జరుపుతున్నాడు అనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల ద్వారా వినిపిస్తున్నాయి.

సారా అర్జున్‌ హీరోయిన్‌గా తెలుగు సినిమా...

సుకుమార్‌ తన ప్రతి సినిమా హీరోయిన్‌ విషయంలో ప్రత్యేక శ్రద్ద చూపిస్తూ ఉంటాడు. సుక్కు కథలో కచ్చితంగా హీరోయిన్‌కి మంచి స్పేస్ ఉంటుంది. అంతే కాకుండా స్క్రీన్‌ ప్లే విషయంలోనూ హీరోయిన్‌కి ప్రాధాన్యత కల్పించడం సుకుమార్‌ స్టైల్‌. అందుకే హీరోయిన్‌ కాస్త ప్రతిభావంతురాలు కావడంతో పాటు, అందంగా ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సారా అర్జున్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. బాల నటిగా పలు సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మధ్య కాలంలో దురంధర్ సినిమాతో సారా అర్జున్‌ దుమ్ము లేపిన విషయం తెల్సిందే. తెలుగులో గుణ శేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన యుఫోరియా సినిమాలోనూ నటించింది. చూడ్డానికి అందంగా కనిపించడంతో పాటు, యాక్టింగ్‌ పరంగా కూడా మంచి మార్కులు దక్కించుకుంటున్న సారా అర్జున్‌ ను చరణ్‌ కు జోడీగా ఎంపిక చేయాలనే ఆలోచన పట్ల మిశ్రమ స్పందన వినిపిస్తోంది.

చరణ్‌కు జోడీగా ధురంధర్‌ బ్యూటీ...

రామ్‌ చరణ్‌ కు జోడీగా సారా అర్జున్‌ ఎంపికను కొందరు ఫ్యాన్స్ సమర్ధిస్తున్నారు. పెద్ద సినిమాలో చరణ్‌ కు జోడీగా నటించిన జాన్వీ కపూర్‌ కంటే సారా అర్జున్‌ ఇంకా బెటర్‌గా ఉంటుందని, చరణ్‌ కి జోడీగా, లుక్స్ పరంగా తప్పకుండా ఆకట్టుకుంటుందని పలువురు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం బాల నటిగా కనిపించిన సారా ను ఇంకా చిన్న పిల్లగానే చూస్తున్నారు. కనుక చరణ్‌ ఆమెతో నటిస్తే చిన్న పిల్లతో నటించిందనే విమర్శలు వస్తాయేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సారా అర్జున్‌ ఎంపిక విషయమై సుకుమార్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో కానీ, ఫ్యాన్స్ మాత్రం రకరకాలుగా ఆలోచనలు చేస్తూ గందరగోళం వ్యక్తం చేస్తున్నారు. అతి త్వరలోనే సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో మొత్తం వివరాలను సుకుమార్‌ అండ్‌ టీం వెళ్లడించే అవకాశం ఉంది. అదే సమయంలో హీరోయిన్‌ విషయంలోనూ స్పష్టత ఇవ్వొచ్చు.

Tags:    

Similar News