సందీప్ వంగా.. చాలా డిటైల్డ్ గా ఉన్నారే..
ఒక సినిమా హిట్ కావాలంటే మంచి కథ, స్టార్ హీరో, భారీ బడ్జెట్ మాత్రమే సరిపోవు. షూటింగ్ ప్లానింగ్ కూడా కీలకం.
ఒక సినిమా హిట్ కావాలంటే మంచి కథ, స్టార్ హీరో, భారీ బడ్జెట్ మాత్రమే సరిపోవు. షూటింగ్ ప్లానింగ్ కూడా కీలకం. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కే సినిమాల్లో స్టార్ హీరో డేట్స్ ఎలా యూజ్ చేసుకుంటారన్నది నిర్మాతలకు, దర్శకులకు పెద్ద సవాల్. ఇప్పుడు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా విషయంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్లాన్ చూస్తుంటే.. ఆయన ఎంత డిటైల్డ్ గా ఆలోచిస్తున్నారో చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం స్పిరిట్ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఆ సినిమా కోసం క్యాస్టింగ్ కేటాయించిన ప్రతి రోజు వాల్యుబుల్ కావడంతో, ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకుండా వంగా ముందుగానే పూర్తి స్థాయి ప్లాన్ సిద్ధం చేశారని సమాచారం. ఏ రోజు ఏ సీన్ తీయాలి, ఏ నటుడు ఎప్పుడు అందుబాటులో ఉండాలి, ఎంత సమయంలో షూటింగ్ పూర్తి చేయాలనే అంశాలన్నింటినీ ముందే ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే షూటింగ్ షెడ్యూల్స్ కూడా చాలా కచ్చితంగా సాగుతున్నాయని టాక్.
ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సాధారణంగా సినిమాల్లో చివర్లో షూట్ చేసే క్లైమాక్స్ సీన్స్ ఈసారి ముందే పూర్తి చేయాలని వంగా భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. క్లైమాక్స్ లో మెయిన్ క్యాస్టింగ్ మొత్తం పాల్గొనే అవకాశం ఉండటంతో, అందరి డేట్స్ అందుబాటులో ఉన్నప్పుడే ఆ కీలక భాగాన్ని పూర్తి చేయాలనే ప్లాన్ చేస్తున్నారని వినికిడి.
అంతేకాదు.. హీరో, హీరోయిన్ కు సంబంధించిన కొన్ని సీన్స్ షూటింగ్ లో కూడా టైమ్ వేస్ట్ కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. షూటింగ్ కోసం అవసరం లేని ఏర్పాట్లు, ప్రయాణాలు తగ్గించి, అందుబాటులో ఉన్న ప్రదేశాల్లోనే సన్నివేశాలను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. దీంతో షూటింగ్ వేగంగా సాగడమే కాకుండా, యూనిట్ కు కూడా అనవసరమైన లేట్ లేకుండా పనులు పూర్తవుతున్నాయని అంటున్నారు.
సందీప్ రెడ్డి వంగా గత చిత్రాలను గమనించినా.. ఆయన వర్క్ స్టైల్ ఇదే తరహాలో ఉంటుందని అంతా చెబుతుంటారు. స్క్రిప్ట్ సిద్ధం చేసే దశ నుంచే ప్రతి సీన్ ను విజువలైజ్ చేసి, షూటింగ్ సమయంలో ఎలాంటి గందరగోళం లేకుండా చూసుకోవడం ఆయన ప్రత్యేకతగా చెబుతారు. ఇప్పుడు స్పిరిట్ విషయంలో కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
మూవీ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఈక్వల్ గా ముందుకు తీసుకెళ్లేలా ప్లాన్ సిద్ధం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెద్ద సినిమాల్లో టైమ్ సేవ్ చేయడానికి ఇలాంటి ప్లానింగ్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పాలి. ఇక సినిమాలో ప్రభాస్, త్రిప్తి డిమ్రీ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. ఏదేమైనా సందీప్ రెడ్డి వంగా కేవలం మంచి దర్శకుడిగానే కాదు, సమయాన్ని సేవ్ చేసుకునే పక్కా ప్లానర్ గా కూడా మరోసారి నిరూపించుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన డిటైల్డ్ ప్లానింగ్ స్క్రీన్ పై కూడా అదే స్థాయిలో కనిపిస్తే.. స్పిరిట్ వంగా కెరీర్ లో మరో స్పెషల్ మూవీగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.