బ్యూటీ కాదు… సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యం! ఆ హీరోయిన్ స్ట్రాంగ్ మెసేజ్

సినీ పరిశ్రమలో హీరోయిన్లపై ఉండే ఒత్తిడి గురించి నటి సమీరా రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సమాజంలో ఒక కొత్త చర్చకు దారితీశాయి.

Update: 2026-07-18 11:30 GMT

సినీ పరిశ్రమలో హీరోయిన్లపై ఉండే ఒత్తిడి గురించి నటి సమీరా రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సమాజంలో ఒక కొత్త చర్చకు దారితీశాయి. కెరీర్ ప్రారంభంలో ఇండస్ట్రీ సృష్టించిన ఇన్సెక్యూరిటీ నుండి బయటపడటానికి, తనను తాను పూర్తిగా అంగీకరించడానికి ఆమెకు 40 ఏళ్ల వయసు దాటాల్సి వచ్చింది. 20 ఏళ్ల వయసులో సమాజం, కెరీర్ పెట్టే కృత్రిమ అందాల ఒత్తిళ్లకు లొంగిపోయే మహిళలు.. వయసు పెరిగే కొద్దీ మానసికంగా ఎంత స్ట్రాంగ్ అవుతారో చెప్పడానికి సమీరా జీవితమే ఒక పెద్ద ఉదాహరణ. బాహ్య సౌందర్యం కంటే 'ఆత్మగౌరవం' ముఖ్యమనే స్వేచ్ఛను సాధించడంలో వయసు ఒక ఆయుధంగా ఎలా మారుతుందో ఆమె మాటలు ద్వార తెలుస్తుంది.

హీరోల కంటే పొడవుగా ఉంటానని వంగి నడవడం:

సమీరా రెడ్డి తన తొలి చిత్రం 'మైనే దిల్ తుజ్కో దియా' రోజులను గుర్తు చేసుకుంటూ.. తన సహజ రూపాన్ని మార్చడానికి ఇండస్ట్రీ ఎంత ఒత్తిడి తెచ్చిందో ఆవేదన వ్యక్తం చేశారు. మేకప్ ద్వారా ఆమె రంగును రెండు మూడు షేడ్స్ తెల్లగా మార్చేవారట. అంతేకాదు, తోటి హీరోల కంటే తాను పొడవుగా కనిపిస్తానేమో అని భయంతో నడుస్తున్నప్పుడు వంగి నడిచేదాన్ని అని ఆమె చెప్పారు. ఇక హీరో ఆధిపత్యం కోసం ఒక నటి తన సహజత్వాన్ని ఎంతగా చంపుకోవాల్సి వస్తుందో ఈ విషయాలు నిరూపిస్తున్నాయి.

ప్యాడెడ్ బ్రాలు, కలర్ లెన్స్‌ల బందీగా 20ల ప్రాయం:

తన సహజ రూపం ఇండస్ట్రీకి సరిపోదనే అభద్రతాభావంతో సమీరా రెడ్డి ఏళ్ల తరబడి ప్యాడెడ్ బ్రాలు, బమ్ ప్యాడ్స్, రంగురంగుల కాంటాక్ట్ లెన్స్‌లు వాడాల్సి వచ్చింది. బరువు తగ్గిన తర్వాత కూడా నీ శరీరం సరిగ్గా లేదంటూ కాస్ట్యూమ్ డిజైనర్లు, మహిళా అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా కామెంట్లు చేసేవారట. ఇక 20 ఏళ్ల వయసులో ఉండే అమాయకత్వం, కెరీర్ లో నిలదొక్కుకోవాలనే ఆరాటం వల్ల మహిళలు ఇలాంటి అవాస్తవిక బ్యూటీ స్టాండర్డ్స్ బందీలుగా మారిపోతుంటారు.

40లలో వచ్చే మానసిక బలం - వయసే ఒక ఆయుధం:

సమీరా చాల కాలం దాదాపు 14 ఏళ్ల తర్వాత 'ఆఖరి సవాల్' చిత్రంతో హిందీ సినిమాలోకి రి ఎంట్రీ ఇవ్వనుంది. ఇక ఇప్పుడు తన 40ల వయసులోకి వచ్చాకే ఈ ఇన్-సెక్యూరిటీస్ నుండి బయటపడ్డానని స్పష్టం చేశారు. వయసు పెరగడం అనేది మహిళలకు కేవలం శారీరక మార్పు కాదు, అది ఒక మానసిక ఆయుధం. 40లలోకి అడుగుపెట్టాక సమాజం ఏమనుకుంటుందో అనే భయం పోయి, 'నేను ఎలా ఉంటే అలాగే ఉంటాను' అనే సెల్ఫ్ రెస్పెక్ట్, స్వేచ్ఛ మహిళల్లో పెరుగుతాయి.

సమీరా రెడ్డి పంచుకున్న నిజాలు కేవలం సినిమా రంగానికే కాదు, సమాజంలోని ప్రతి మహిళకు వర్తిస్తాయి. రంగు, రూపు, పొడవుల కంటే కూడా తనను తాను ప్రేమించుకోవడం, ఆత్మగౌరవంతో బతకడం ముఖ్యం అనే స్ట్రాంగ్ మెసేజ్ ఆమె ఇచ్చారు. ఇక బాహ్య సౌందర్యం కోసం ఇతరుల అంచనాలకు లొంగిపోకుండా, మనసుకు నచ్చినట్టు స్వేచ్ఛగా బతికినప్పుడే మహిళలకు నిజమైన సాధికారత లభిస్తుంది అన్నది విశ్లేషకులు అభిప్రాయం.

Tags:    

Similar News