ఫిట్‌నెస్ క్వీన్‌కు బ్రేక్? సమంత బేబీ బంప్ పిక్ ట్రెండింగ్!

ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే సమంత, ప్రెగ్నెన్సీ సమయంలోనూ చాలా సరదాగా స్పందించింది.

Update: 2026-07-01 04:02 GMT

సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సమంత తన జీవితంలో ఒక సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతోంది. త్వరలోనే ఆమె తల్లి కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించి ఫ్యాన్స్‌కు తీపి కబురు అందించింది. తన భర్త, ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న సమంత, తాజాగా తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసిన బేబీ బంప్ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

సిక్స్ ప్యాక్‌ కి గుడ్‌ బై చెప్పిన సమంత:

ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే సమంత, ప్రెగ్నెన్సీ సమయంలోనూ చాలా సరదాగా స్పందించింది. సోమవారం రోజున తన బేబీ బంప్ కనిపిస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకుంటూ.. "నా సిక్స్ ప్యాక్... మళ్లీ కలుద్దాం" అంటూ ఒక క్రేజీ క్యాప్షన్ పెట్టింది. ఇక గర్భంతో ఉన్నప్పటికీ తనదైన స్టైల్‌లో ఫన్నీగా పోస్ట్ చేయడంతో ఈ పిక్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

'మా ఇంటి బంగారం' సక్సెస్ మీట్‌లో గుడ్ న్యూస్:

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన తన లేటెస్ట్ మూవీ 'మా ఇంటి బంగారం' సక్సెస్ మీట్ వేదికగా సమంత తన ప్రెగ్నెన్సీ వార్తలను స్వయంగా ధృవీకరించింది. ఇక సినిమా మంచి విజయం సాధించిన ఆనందంతో పాటు, తన వ్యక్తిగత జీవితంలోని ఈ పెద్ద శుభవార్తను మీడియా ముఖంగా పంచుకోవడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

రెండేళ్ల పాటు నటనకు విరామం:

తల్లి కాబోతున్న తరుణంలో సమంత నటనకు కొంతకాలం విరామం ఇవ్వాలని నిర్ణయించుకుంది. "క్షమించండి, నా కెరీర్‌లో మరో చిన్న బ్రేక్ తీసుకుంటున్నాను. ఇక ఇప్పుడు నేను మెటర్నిటీ లీవ్‌పై వెళ్లాల్సి ఉంది, కానీ ఈ నిర్ణయం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని సమంత పేర్కొంది. ఈ లెక్కన ఆమె దాదాపు రెండేళ్ల పాటు వెండితెరకు దూరం కానున్నట్లు తెలుస్తోంది.

రాజ్ నిడిమోరుతో హ్యాపీ లైఫ్:

సమంత, ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ దర్శకుడు రాజ్ నిడిమోరు 2025లో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక పెళ్లయిన ఏడాదికే వీరిద్దరూ తమ జీవితంలోకి కొత్త అతిథిని ఆహ్వానించడానికి సిద్ధమవ్వడంతో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, స్నేహితులు ఈ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఫిట్‌నెస్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న సమంత, ఇప్పుడు మాతృత్వపు మధురిమలను ఆస్వాదించడానికి సిద్ధమైంది. సినిమా షూటింగులకు రెండేళ్లు బ్రేక్ ఇస్తున్నట్లు చెప్పినా, ఆమె క్షేమంగా తిరిగి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జీవితంలో సరికొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్న సమంత, రాజ్ నిడిమోరు దంపతులకు మనమూ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం..

Tags:    

Similar News