సమంత డెడికేషన్ కి ఫిదా.. ప్రెగ్నెన్సీలో కూడా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రెగ్నెన్సీ సమయంలోనూ పవర్ ఫుల్ వర్కౌట్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రెగ్నెన్సీ సమయంలోనూ పవర్ ఫుల్ వర్కౌట్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా గర్భిణీలు విశ్రాంతి తీసుకునే సమయంలో సమంత ఏకంగా జిమ్‌లో బరువులు ఎత్తుతూ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తుండటం విశేషం. ఈ ఏడాది చివర్లో తల్లి కాబోతున్న సమంత, తన ఇన్స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ హెవీ ఫిట్‌నెస్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులతో పాటు నెటిజన్లు ఆమె డెడికేషన్‌ను చూసి అవాక్కవుతున్నారు.
డాక్టర్ అనుమతితోనే వర్కౌట్స్.. సమంత హెచ్చరిక:
తన వర్కౌట్ వీడియోలతో పాటు సమంత ఒక ముఖ్యమైన సందేశాన్ని పంచుకుంది. డాక్టర్ అనుమతి పొందిన తర్వాతే తాను ఈ వ్యాయామాలు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే ప్రీనేటల్ ట్రైనింగ్‌లో శిక్షణ పొందిన నిపుణుడి పర్యవేక్షణలోనే తన శరీర పరిస్థితికి తగ్గట్టుగా వర్కౌట్స్ మలుచుకున్నానని చెప్పింది. ఇక ప్రతి మహిళ ప్రెగ్నెన్సీ ప్రయాణం వేరుగా ఉంటుందని, తనను చూసి ఎవరూ సొంతంగా వ్యాయామాలు చేయవద్దని, తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలని సూచించింది.
ట్రెండీ స్పోర్ట్స్ అవుట్‌ఫిట్‌లో ఫిట్‌నెస్ మేనియా:
ఈ వర్కౌట్ వీడియోలలో సమంత లుక్ కూడా నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆరెంజ్ రంగు స్లిమ్-ఫిట్ ట్యాంక్ టాప్, బర్గండీ రంగు హై-వేస్టెడ్ కంప్రెషన్ లెగ్గింగ్స్ ధరించి ఆమె కనిపించింది. ఇక దానికి తోడు వైట్ స్నీకర్స్ వేసుకుని జిమ్‌లో ఎంతో యాక్టివ్‌గా హెవీ బరువులు ఎత్తుతూ కనిపించింది. ప్రెగ్నెన్సీ గ్లోతో పాటు ఆమెలోని ఫిట్‌నెస్ పట్టుదల ఈ లుక్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.
'మా ఇంటి బంగారం' హిట్టుతో డబుల్ హ్యాపీనెస్:
రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న తర్వాత, కొద్ది నెలల క్రితం వచ్చిన 'మా ఇంటి బంగారం' సినిమాతో సమంత బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఒకవైపు కెరీర్‌లో బిజీగా ఉంటూనే, మరోవైపు వ్యక్తిగత జీవితంలో మాతృత్వానికి సిద్ధమవుతోంది. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఫిట్‌నెస్‌ను నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తుండటంతో సమంత క్రమశిక్షణను అందరూ అభినందిస్తున్నారు.
ప్రెగ్నెన్సీ బ్రేక్.. మెటర్నిటీ లీవ్‌లో సమంత:
గతంలో మయోసైటిస్ వ్యాధి బారిన పడినప్పుడు సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చిన సమంత, ఇప్పుడు తన ప్రెగ్నెన్సీ కారణంగా మరోసారి సినిమాలకు కొద్దిరోజుల పాటు తాత్కాలిక విరామం ప్రకటించింది. "మా ఇంటి బంగారం సినిమా విజయం తర్వాత నా ప్రస్తుత పరిస్థితి రీత్యా చిన్న బ్రేక్ తీసుకోక తప్పదు, అందుకే మెటర్నిటీ లీవ్ తీసుకుంటున్నాను.. ఈ సమయం పూర్తయ్యాక మళ్లీ సరికొత్త ప్రాజెక్ట్‌లతో మీ ముందుకు వస్తాను" అని సమంత స్వయంగా చూపిన సంగతి తెలిసిందే.
ఇక సమాజంలో గర్భిణీలపై ఉన్న పాత ఆలోచనలను తిరగరాస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలితో ప్రేరణగా నిలుస్తోంది సమంత. నిపుణుల సమక్షంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఫిట్‌గా ఉండవచ్చని నిరూపిస్తున్న సమంత వర్కౌట్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారాయి..