సమంతపై ఒత్తిడి ఈసారి ఇంకా కష్టం!
సమంత కెరీర్‌లో `మా ఇంటి బంగారం` విజయం మైలురాయిగా నిలిచిపోతుందన్నది కాదనలేని నిజం.
సమంత కెరీర్‌లో `మా ఇంటి బంగారం` విజయం మైలురాయిగా నిలిచిపోతుందన్నది కాదనలేని నిజం. ఈ లేడీ ఓరియేంటెడ్ చిత్రం బాక్సా ఫీస్ వద్ద వంద కోట్ల వసూళ్లను సాధించడం తో? సమంత సత్తా మరోసారి చాటుకుంది. సోలో హీరోయిన్‌గా ఈ స్థాయి విజయాన్ని అందుకోవడం అంటే? ఆమె తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నాయికల సరసన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే కాకుండా తనకంటూ బలమైన, ప్రత్యేకమైన మార్కెట్‌ను సృష్టించుకుందని చెప్పొచ్చు. అయితే ఈ విజయం సమంతపై ఓ కొత్త రకమైన ఒత్తిడిని తీసుకొస్తుందన్నది అంతే వాస్తవం.
వంద కోట్ల క్లబ్‌లో చేరడం అంటే? ఇకపై ప్రతి సినిమాకు అదే తరహా అంచనాలు ఉంటాయని అర్థం. ప్రేక్షకులు , నిర్మాతలు సామ్ నుండి మరింత ప్రతిభను, విభిన్నమైన కథలను ఆశిస్తారు. ఈ అంచనాలను నిలబెట్టుకోవాలనే ఒత్తిడి, ఏ నటి కైనా సహజం. ఈ క్రమంలో సమంత తదుపరి ప్రాజెక్టుల ఎంపికలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిం చాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో సమంత ఎంచుకున్న ప్రయోగాత్మక చిత్రాలు అమ్మడికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. కానీ ఇప్పుడు ఒక కమర్షియల్ స్టార్‌గా మారిన నేపథ్యంలో కథల ఎంపికలో సమతుల్యత పాటించడం సవాలుగా మారుతుందన్నది అంతే వాస్తవం.
భారీ బడ్జెట్ సినిమాలతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూనే బాక్సాఫీస్ వద్ద నిలకడైన వసూళ్లను సాధించాల్సిన బాధ్యత సామపై ఉంది. ఒక్కో అడుగు ఆచితూచి వేయాల్సిన సమయం ఇది. ఎందుకంటే? సమంతను కోట్ల రూపాయలు నిర్మాత ఖర్చు చేస్తున్నప్పుడు ఆ నమ్మకాన్ని రెండింతలు నిలబెట్టాలి.
కెరీర్ పరంగా సమంత వ్యక్తిగత నిర్ణయాలను కూడా మరింత బాధ్యతాయుతంగా తీసుకోవలసి ఉంది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కథానాయికగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న సమంత ఈ విజయాన్ని అదృష్టంగా కాకుండా తన శ్రమకు దక్కిన ప్రతిఫలంగా భావిస్తోంది.
ఈ క్రేజ్‌ను కొనసాగించడానికి తన ఫిట్‌నెస్, నటన , స్క్రిప్ట్ సెలక్షన్‌లో ఎప్పటికప్పుడు కొత్త మార్పులు చేస్తూనే ఉండాలి. ప్రస్తుత పోటీలో సమంత స్థానం సుస్థిరమైనదే అయినా? తదుపరి చిత్రాలు కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను మెప్పించకపోతే? విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి సామ్ ఎంచుకునే కథలు కేవలం సోలో హీరోయిన్‌గా ఆమె ఇమేజ్‌ను పెంచేవిగానే కాకుండా? కంటెంట్ పరంగా కూడా బలంగా ఉండాలి. నిర్మాతలు ఆమెపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి చిత్రంలోనూ వంద శాతం ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది.
సమంత లో ఒత్తిడి ఆమెలోని నటిని మరింత మెరుగుపరుస్తుందని ఆశీంచొచ్చు. `మా ఇంటి బంగారం` విజయం ఆమెకు ఒక పునాది మాత్రమే. ఈ పునాది మీద సమంత భవిష్యత్తును ఎలా నిర్మించుకుంటుంది అన్నదే అంద రిలోనూ ఉన్న ఆసక్తి. ఆచితూచి వేసే ప్రతి అడుగు సమంతను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని అభిమానులు కోరుకుంటున్నారు.