ధోని భార్య సాక్షి ధరించిన వాచ్ ఖరీదు, ఫీచర్స్ ఏంటో తెలుసా?
సెలబ్రిటీలు కొంతమంది ఎంత హుందాగా ఉంటారో.. వారు ఉపయోగించే వస్తువులు కూడా అంతే లగ్జరీగా ఉంటాయి. ముఖ్యంగా మరి కొంతమంది సింపుల్గా కనిపించినా.. తమ వస్తువులతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.
సెలబ్రిటీలు కొంతమంది ఎంత హుందాగా ఉంటారో.. వారు ఉపయోగించే వస్తువులు కూడా అంతే లగ్జరీగా ఉంటాయి. ముఖ్యంగా మరి కొంతమంది సింపుల్గా కనిపించినా.. తమ వస్తువులతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఇప్పటికే టాలీవుడ్ లో ప్రభాస్ , ఎన్టీఆర్, రామ్ చరణ్ తదితర హీరోలు సింపుల్ గా కనిపించినా.. వారు పెట్టుకునే వాచ్ మొదలు.. ధరించే షూ.. ఉపయోగించే కార్ వరకూ అన్నీ కూడా ఖరీదైనవే ఉంటాయి. ఇప్పుడు ఒక స్టార్ క్రికెటర్ భార్య పెట్టుకున్న వాచ్ అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా దాని ఖరీదు, ఫీచర్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
అలాంటి వారిలో మహేంద్రసింగ్ ధోని భార్య సాక్షి ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంది. సాధారణంగా ఇండియాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చిందంటే చాలు అభిమానులు తమ పనులన్నింటినీ పక్కనపెట్టి మరీ ఈ మ్యాచ్ చూడడానికి స్టేడియంకి వెళ్ళిపోతారు అనడంలో సందేహం లేదు . మరి కొంతమంది తమ ఆఫీసుల నుండి సెలవులు కూడా తీసుకుంటున్నారు. తమ అభిమానుల జట్లకు మద్దతు ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సీజన్ కోసం అభిమానులతో పాటు ఐపీఎల్ ఆటగాళ్ల భాగస్వాములు కూడా రంగంలోకి దిగడం అందరినీ ఆశ్చర్యపరిచింది .ముఖ్యంగా తమ భాగస్వామ్యులను ఆటలో ప్రోత్సహించడమే కాకుండా తమ క్లాసిక్ లుక్ కి ఖరీదైన వాచ్ లను జతచేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.
అందులో భాగంగానే ఇటీవల 2026 ఏప్రిల్ 26న జరిగిన ఆర్సీబీ వర్సెస్ జీటీ పోటీలో విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ రూ.28 లక్షలకు పైగా విలువైన పాంథెర్ డి కార్టియర్ వాచ్ ను ధరించి అందర్నీ ఆకట్టుకోగా.. ఇటు ఏప్రిల్ 23న ముంబైలో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా సాక్షి ధోని తన వాచ్ తో మరింత క్లాసిక్ లుక్ లో కనిపించడమే కాకుండా అందరినీ ఆకట్టుకుంది.
ఇక ఈ మ్యాచ్ సమయంలో సాక్షి ధోని ధరించిన వాచ్ ధర సుమారుగా 3 కోట్ల రూపాయలకు పైమాటే. ఇది రిచర్డ్ మిల్లే RM 67 -02 వేడ్ వాన్ నీకెర్క్ దక్షిణాఫ్రికా ఒలంపిక్ గోల్డ్ మెడల్ విన్నర్, 400 మీటర్ల తో ప్రపంచ రికార్డును అందుకున్న వ్యక్తితో కలసి రూపొందించిన అత్యంత తేలికైన టైం పీస్ అని చెప్పవచ్చు.. ముఖ్యంగా ఉన్నత శ్రేణి క్రీడాకారుల కోసం అత్యుత్తమ పనితీరు కలిగిన ఈ టైం పీసులను రూపొందించడంలో తయారీదారుల నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది.. ముఖ్యంగా 47.52x 38.70 x 7.80 మి.మీ కొలత కలిగిన ఈ వాచ్ క్వార్ట్జ్ TPT తో రూపొందించారు.ఈ వాచ్ లోని ఎల్లో అలాగే గ్రీన్ రంగులు దక్షిణాఫ్రికా జాతీయ జెండాను సూచిస్తాయి. ఇకపోతే ఈ వాచ్ తేలికైనదే కాదు షాక్ రెసిస్టెంట్ అలాగే దీని స్టైలిష్ డిజైన్ కూడా అందరిని ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఎక్కువ కాలం మన్నిక రావడమే కాకుండా మంచి సౌకర్యాన్ని కూడా అందిస్తుంది.
ఇకపోతే ఒలంపిక్స్ స్ప్రింటర్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన అత్యంత తేలికైన ఆటోమేటిక్ వాచ్ ఇది. కేవలం 32 గ్రాముల బరువును మాత్రమే కలిగి ఉంటుంది. టిటానియం, కార్బన్ టి పి టి , ఎక్స్ట్రా ఫ్లాట్ CRMA 7 క్యాలిబర్ మూమెంట్ ను ఉపయోగించి దీనిని తయారు చేశారు. ఇకపోతే ఈ వాచ్ ధర సాధారణంగా లభ్యత అలాగే మోడల్ కండిషన్ బట్టి సుమారుగా రూ.3.1 కోట్ల నుండి రూ.3.9 కోట్ల వరకు ఉంటుంది. ఏది ఏమైనా సాక్షి ఇలాంటి వాచ్ ను ధరించి అందరిని ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. అంతేకాదు ఈ వాచ్ ధరించి ఇండియన్ మొదటి మహిళగా గుర్తింపు సంపాదించింది సాక్షి.