నా ఫోన్‌కు కాల్ చేసి బూతులు తిట్టండి.. హీరో కామెంట్స్

శివ కుమార్ మాట్లాడుతూ ముందుగా ఈ సినిమాను థియేటర్లలో తీసుకువచ్చేందుకు సపోర్ట్ చేస్తున్న బన్నీ వాసు, వంశీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.

Update: 2026-08-27 11:04 GMT

నిశాంత్ దోటి దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ మూవీ సాహా: లైఫ్ ఆఫ్ సంజు. శివ కుమార్ కాసారం, శ్వేత లక్ష్మణ్ జంటగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న థియేటర్లలోకి రాబోతోంది. తేజేశ్వర్ వెల్పుచర్ల నిర్మించిన ఈ చిత్రానికి బన్నీ వాసు, వంశీ నందిపాటి అండగా నిలవడంతో సినిమాపై బజ్ పెరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శివ కుమార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.

శివ కుమార్ మాట్లాడుతూ ముందుగా ఈ సినిమాను థియేటర్లలో తీసుకువచ్చేందుకు సపోర్ట్ చేస్తున్న బన్నీ వాసు, వంశీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఒక చిన్న సినిమాగా మొదలైన తమ ప్రాజెక్ట్ కి వారు రావడం వల్ల ఒక బ్లాక్ బస్టర్ కళ వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే మీడియా మిత్రులకు, తమకు అండగా ఉన్న కుటుంబ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

సాహా అనేది ఒక చిన్న సినిమా కాదని, కంటెంట్ పరంగా చాలా పెద్ద సినిమా అని చెప్పారు. ఈ కథ ప్రేక్షకులకు చాలా సంవత్సరాల పాటు గుర్తుండిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకే సెప్టెంబర్ 4న ఈ చిత్రాన్ని చూడబోయే ప్రేక్షకులకు సవాల్ విసిరారు. "మా సినిమాను థియేటర్ లో చూడబోయే ముందు మీరు ఊహించుకోగలిగినంత పెద్ద అంచనాలు పెట్టుకోండి.. మీ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఒక తోపు సినిమాను చూడబోతున్నారని ఫిక్స్ అవ్వండి" అని హీరో శివ కుమార్ ధీమాగా చెప్పారు.

ఒకవేళ సినిమా చూశాక మీ అంచనాలు ఒక్క శాతం తగ్గినా, తాను బాధ్యత వహిస్తానని చెప్పడం విశేషం. "మీ అంచనాలు ఏమాత్రం తలకిందులైనా నా ఫోన్ నంబర్ కి నేరుగా కాల్ చేసి నన్ను బూతులు తిట్టండి, నేను భరిస్తాను" అని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ సినిమా నచ్చితే మాత్రం, ఆ విషయాన్ని పది మందికి చెప్పి తమ చిన్న చిత్రాన్ని బతికించాలని ఆయన కోరారు.

ఈ సినిమా రిలీజ్ అనౌన్స్ చేసిన తర్వాత చాలా మంది తనను డిస్కరేజ్ చేసేలా మాట్లాడారని శివ చెప్పారు. ఇంత కాంపిటీషన్ లో పెద్ద సినిమాలు వస్తుండగా మీకెందుకు, ఎవరికీ తెలియని మీ ముఖాలు ఎవరూ చూడరు అని అన్నారని చెప్పారు. కానీ వాటన్నింటినీ దాటుకుని బ్లాక్ బస్టర్ కొడితేనే, ఇండస్ట్రీ మొత్తం తమ వైపు చూస్తుందనే నమ్మకంతోనే తాము ముందడుగు వేశామని ఆయన అన్నారు.

ఎంతో కాలంగా ఇండస్ట్రీలో అవకాశాల కోసం పోరాడుతున్న తమ లాంటి వాళ్లంతా కలిసి చేసిన ఈ సినిమాను ఒక ఫ్రెండ్ గా అందరికీ రికమెండ్ చేస్తున్నానని ఆయన చెప్పారు. థియేటర్ లో ఈ చిత్రం బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని, సాహా సినిమాను అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ ఒక స్పీచ్ ముగించారు.




Tags:    

Similar News