'సహ' ట్రైలర్: ​సంజు లైఫ్ లో ఏం జరిగింది?

ఇక అదే తరహాలో ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేయడానికి సహ అనే సినిమా వస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా మీడియా ముందు రిలీజ్ చేశారు.

Update: 2026-08-27 12:50 GMT

డిఫరెంట్ కంటెంట్ తో వచ్చే ఎమోషనల్ డ్రామా సినిమాలకు ఈమధ్య మంచి రెస్పాన్స్ అందుతోంది. ఇక అదే తరహాలో ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేయడానికి సహ అనే సినిమా వస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా మీడియా ముందు రిలీజ్ చేశారు. ఇక సినిమాకు లైఫ్ ఆఫ్ సంజు అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు.

శివ కుమార్ కాసారం, శ్వేత లక్ష్మణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నిశాంత్ దోటి దర్శకత్వం వహించారు. సుమైరా స్టూడియోస్ బ్యానర్ పై తేజేశ్వర్ వెల్పుచర్ల నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ వీడియోలో ఈ సినిమా కథ ఎలా ఉండబోతోందనే బేసిక్ లైన్ ను రివీల్ చేస్తూ కొన్ని కీలకమైన సన్నివేశాలను చూపించారు.

ట్రైలర్ ఫస్ట్ హాఫ్ అంతా స్టూడెంట్ లైఫ్, కాలేజీ బ్యాక్ డ్రాప్ చుట్టూ తిరిగింది. హీరో హీరోయిన్ల మధ్య పరిచయం, స్నేహం, ఆ తర్వాత అది ప్రేమగా మారే సన్నివేశాలను ఈ వీడియోలో కట్ చేశారు. స్నేహితులతో కలిసి కాలేజీలో చేసే అల్లరి, ఇష్టపడిన అమ్మాయి చుట్టూ తిరిగే సీన్స్ తో కథను మొదలుపెట్టారు. ట్రైలర్ లోని మొదటి నిమిషం చూస్తుంటే ఒక లవ్ ట్రాక్ తో సినిమా ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.

ఆ తర్వాత కథ సీరియస్ టోన్ లోకి మారుతుంది. హీరో ఫ్రస్ట్రేషన్ తో ఉన్న సీన్స్, కోపంతో ఆఫీస్ పేపర్లు చించేయడం, లాకప్ లో ఉండటం, ఒంటరిగా ఏడవడం లాంటి విజువల్స్ చూపించారు. ఈ క్రమంలో వచ్చే కొన్ని డైలాగ్స్ సినిమాలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ ను హైలెట్ చేస్తున్నాయి.

ప్రేమకథలో ఏదో సమస్య వచ్చిందని, అది వాళ్ల జీవితాలను మార్చేసిందని ఈ షాట్స్ ద్వారా హింట్ ఇచ్చారు. ఇక ఈ వీడియోలో హీరో శివ కుమార్ రెండు వేర్వేరు గెటప్స్ లో కనిపించాడు. ఒకవైపు కాలేజీ కుర్రాడిగా ఉంటూనే, మరోవైపు గడ్డం పెంచుకుని సీరియస్ లుక్ లో ఉన్నాడు. దీన్ని బట్టి సినిమా కథ ఒక లాంగ్ స్పాన్ లో జరుగుతుందని అర్థమవుతోంది.

టెక్నికల్ విషయాలకు వస్తే కరుణాకర్ ఏ కెమెరా వర్క్, శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్, దినేష్ పెద్ది ఎడిటింగ్ కట్స్ ట్రైలర్ లో ఆయా సన్నివేశాలకు తగ్గట్లుగా ఉన్నాయి. వ్రజన పాండ్యా కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించారు. ట్రైలర్ ఎండింగ్ లో హీరోయిన్ చెప్పే డైలాగ్ సినిమా ఎమోషనల్ యాంగిల్ ను హైలెట్ చేసింది. "నువ్వు నవ్వుతూ ఉంటేనే నేను ధైర్యంగా ఉంటాను.. నీ నవ్వే నా ధైర్యం సంజు" అని ముగించిన విధానం చూస్తుంటే డ్రామా గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. సహ సినిమాకు బన్నీ వాసు, వంశీ నందిపాటి డిస్ట్రిబ్యూషన్ పరంగా సపోర్ట్ చేస్తుండటం థియేట్రికల్ రిలీజ్ కు హెల్ప్ అవుతోంది. ట్రైలర్ లాంచ్ ప్రెస్ మీట్ కు కూడా వాళ్లు హాజరై తమ మద్దతు తెలిపారు. ఇక ఈ చిత్రం థియేటర్లలో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.


Full View


Tags:    

Similar News