కనకవతిని అలా చూసి తట్టుకోలేకపోతున్న హృదయాలు!
రాకింగ్ స్టార్ యష్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రంలో యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ రుక్మిణి వసంత్ కీలక పాత్రలో నటించారు
`టాక్సిక్: ఎ ఫెయిరీ టెల్ ఫర్ గ్రోన్-అప్స్` చిత్రం విడుదలై భారీ చర్చకు దారితీస్తోంది. రాకింగ్ స్టార్ యష్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రంలో యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ రుక్మిణి వసంత్ కీలక పాత్రలో నటించారు. అయితే ఈ చిత్రంలో రుక్మిణి కనిపించిన తీరు.. ముఖ్యంగా కొన్ని ఇంటిమేట్ సీన్స్ .. బోల్డ్ రోల్ చూసి అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. `కాంతార`..ఇతర మలయాళ, కన్నడ సినిమాలలో అత్యంత పద్ధతిగా, సాంప్రదాయబద్ధంగా, కామ్ అండ్ క్యూట్ లుక్స్‌లో కనిపించిన అమ్మడు ఒక్కసారిగా బోల్డ్ పాత్రలో కనిపించడాన్ని కొందరు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
తెరపై ఆమెను ఆ విధంగా చూసి తట్టుకోలేకపోతున్నామని తమ ఊహలకు భిన్నంగా ఈ పాత్ర ఉందని సోషల్ మీడియా వేదికగా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. నిర్దిష్టమైన ఇమేజ్ ఉన్న నటిని ఇలాంటి బోల్డ్ జోనర్‌లో చూడటం కొంత మందికి షాకింగ్‌గా మారింది. ఈ పరిణామంతో సోషల్ మీడియాలో రుక్మిణి వసంత్ పాత్రపై ..ఆమె ఎంచు కున్న జానర్‌పై తీవ్ర వ్యతిరేకత, మోరల్ పోలీసింగ్ మొదలయ్యాయి. `మీరు ఇలాంటి పాత్రల్లో నటిస్తారని ఊహించలేదు` అంటూ కొందరు నెటిజన్లు ఆన్‌లైన్‌లో విమర్శలు గుప్పిస్తున్నారు.
రుక్మిణి నటన కంటే ఆ పాత్రలోని బోల్డ్‌నెస్‌ను మాత్రమే హైలైట్ చేస్తూ ట్రోల్స్ చేస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ విమర్శలను మరోవైపు ఇంకొంతమంది అభిమానులు ఖండిస్తున్నారు. నటిగా తన పరిధిని విస్తరించుకోవడానికి రుక్మిణి వసంత్ చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ అప్రిషియేట్ చేయాలని కోరుతున్నారు. ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా కథ డిమాండ్ మేరకు ఛాలెంజింగ్ రోల్స్‌ను ఎంచుకోవడం ప్రతి నటి ప్రొఫెషనల్ జర్నీలో భాగమని సమర్థిస్తున్నారు.
దర్శకులు గీతూ మోహన్‌దాస్ రూపొందించిన డార్క్ యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచంలో ప్రతి పాత్రకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని.. దానిని సినిమా కోణంలోనే చూడాలని సపోర్టర్లు సూచిస్తున్నారు. నటీమణుల వ్యక్తిగత ఇమేజ్‌ను ఆన్-స్క్రీన్ క్యారెక్టర్లతో ముడిపెట్టి విమర్శించడం సరికాదని హితవు పలుకుతున్నారు. రుక్మిణి వసంత్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. మరి ఈ విమర్శలు..సమర్దనలపై రుక్మిణీ వసంత్ ఎలా స్పందిస్తుంది? అన్నది చూడాలి. రుక్మిణి తదుపరి లైనప్ చూస్తే కిట్టీలో అన్ని క్రేజీ ప్రాజెక్టులే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన `డ్రాగన్` లో నటిస్తోంది. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న `ధర్మన్` లోనూ నటిస్తోంది. తాజాగా మలయాళంలో ఓ స్టార్ హీరో చిత్రానికి సైన్ చేసింది.