డైరెక్టర్‌కు డ్రీమ్ డే.. బాక్సాఫీస్‌కు సైలెంట్ సర్ప్రైజ్ డే?

సినీ ఇండస్ట్రీలో అవకాశాలకు ఒక నిర్దిష్టమైన టైమ్‌లైన్ ఉంటుందని చెప్పలేం. కొందరికి కెరీర్ ప్రారంభంలోనే పెద్ద బ్రేక్ దొరుకుతుంది.

Update: 2026-09-02 10:22 GMT

సినీ ఇండస్ట్రీలో అవకాశాలకు ఒక నిర్దిష్టమైన టైమ్‌లైన్ ఉంటుందని చెప్పలేం. కొందరికి కెరీర్ ప్రారంభంలోనే పెద్ద బ్రేక్ దొరుకుతుంది. మరికొందరికి మాత్రం సంవత్సరాల నిరీక్షణ తర్వాత తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ వస్తుంది. ముఖ్యంగా డైరెక్ష‌న్ లాంటి క్రియేటివ్ రంగంలో వయసు కంటే ఆలోచన, కథ చెప్పే సామర్థ్యం, ఆడియ‌న్స్ ను ఆకట్టుకునే విజన్‌నే ఎక్కువగా నిర్ణయాత్మకంగా మారుతాయి. ఇప్పుడు రోమాంచకం సినిమా కూడా అలాంటి ఇంట్రెస్టింగ్ డిస్క‌ష‌న్‌కు కారణమవుతోంది.

సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాతో వేణుగోపాల్ రెడ్డి డైరెక్ట‌ర్ గా తన కెరీర్లో కొత్త చాప్ట‌ర్ ను ప్రారంభిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా సినీ ప్ర‌పంచంలో ఉన్న అనుభవాన్ని ఇప్పుడు తన సొంత కథనంతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. ఒక డైరెక్ట‌ర్ కల నెరవేరడానికి సరైన వయసు అంటూ ఏదీ ఉండదని చెప్పే ఉదాహరణగా ఈ ప్రయాణాన్ని చూడొచ్చు.

అయితే రోమాంచకం సినిమాకు ఇప్పుడు మరో ఆసక్తికరమైన పరీక్ష కూడా ఎదురుగా ఉంది. భారీ స్టార్ హీరోలు, భారీ బడ్జెట్ హడావుడి లేకుండానే ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వస్తుండటం సినిమాకు తొలి స్థాయి ఆసక్తిని తీసుకొచ్చినా, చివరికి థియేటర్లలో నిలబెట్టేది మాత్రం కంటెంటే. గ్లింప్స్, సాంగ్స్, ప్రమోషనల్ మెటీరియల్ ద్వారా ఒక యువతరం ప్రేమకథతో పాటు వినోదం, భావోద్వేగాలు కలిసిన సినిమా అనే భావన కనిపిస్తోంది. ముఖ్యంగా యువ‌ నటులతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వగలిగితే, ఈ వారం బాక్సాఫీస్ వద్ద రోమాంచకం సైలెంట్ సర్ప్రైజ్‌గా మారే అవకాశం ఉంది.

చిన్న సినిమాల విషయంలో ఫ‌స్ట్ డే ఓపెనింగ్స్ కంటే ఆడియ‌న్స్ రెస్పాన్స్ చాలా కీలకం. ఫ‌స్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వస్తే సోషల్ మీడియా, మౌత్ టాక్ ద్వారా సినిమా వేగంగా ఆడియ‌న్స్ కు చేరుకునే అవకాశం ఉంటుంది. అదే రోమాంచకంకు అసలైన బలం కావొచ్చు. ఒకవైపు ఎన్నాళ్లకో నెరవేరుతున్న డైరెక్ట‌ర్ డ్రీమ్.. మరోవైపు ఎలాంటి భారీ హడావుడి లేకుండా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని చూస్తున్న సినిమా. ఈ రెండు అంశాల మధ్య రోమాంచకం ప్రయాణం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టాలెంట్‌కు వయసు అడ్డంకి కాదని నిరూపించడంతో పాటు, మంచి కంటెంట్ ఉంటే చిన్న సినిమా కూడా పెద్ద సర్ప్రైజ్ ఇవ్వగలదని ఈ సినిమా నిరూపిస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News