ఉల్లిపొర లాంటి చీరలో గ్లామర్ విందు వడ్డిస్తున్న ప్రభాస్ బ్యూటీ!
2022లో రాధే శ్యామ్ సినిమాలో నటించి ప్రభాస్ కి కాస్త దగ్గరైన ఈమె.. 2026లో ఏకంగా ది రాజా సాబ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరిగా నటించి, మరింత ఆకట్టుకుంది.
అందం, అభినయంతో అమాయకత్వంతో అందరి దృష్టిని ఆకట్టుకొని ప్రభాస్ బ్యూటీగా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది రిద్ధీ కుమార్. సెలెక్టెడ్ గా పాత్రలు ఎంచుకుంటూ ఆ పాత్రలలో పరకాయ ప్రవేశం చేసి, తన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. మహారాష్ట్ర కోపర్గావ్ షిరిడీ ప్రాంతానికి చెందిన రిద్ధీ.. 2018లో తొలిసారి అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన తెలుగు యాక్షన్ రొమాంటిక్ కామెడీ చిత్రం లవర్ ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ద్వారా రిద్ధీ హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే పరవాలేదనిపించుకున్న ఈమె.. ఆ తర్వాత 2021 లో క్యాండీ, 2022లో క్రాష్ కోర్స్ , హ్యూమన్, హ్యాక్ క్రైమ్ ఆన్లైన్ వంటి వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను మెప్పించింది.
2022లో రాధే శ్యామ్ సినిమాలో నటించి ప్రభాస్ కి కాస్త దగ్గరైన ఈమె.. 2026లో ఏకంగా ది రాజా సాబ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరిగా నటించి, మరింత ఆకట్టుకుంది. ముఖ్యంగా రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ పక్కన ఎక్కువ స్పేస్ లభించిన హీరోయిన్ గా పేరు దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి భారీ అంచనాల మధ్య వచ్చింది. కానీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే రిద్ధీ కుమార్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం మరికొన్ని సినిమాలలో బిజీగా ఉన్న ఈమె.. ఇంకొక వైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
ఉల్లిపొర లాంటి చీర ధరించి..తన అందాలతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా సున్నితమైన క్యూలు ఫ్యాబ్రిక్ పై అత్యంత క్లిష్టమైన క్రిస్టల్ ఎంబ్రాయిడరీతో రూపొందించిన చీరను ధరించింది. ఇక దీనిని హర్షిత రావు ఫ్రీ స్టిచ్డ్ చేశారు. ఇక అలాగే ఈ దుస్తులకు కాంబినేషన్లో హెవీ ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేసిన స్లీవ్ లెస్ అన్ కట్ బ్లౌజు ధరించి తన మేకోవర్ ను ఫుల్ ఫిల్ చేసుకుంది. అలాగే సిల్వర్ జువెలరీలో భాగంగా చెవి దిద్దులు, బ్యాంగిల్స్ ని ధరించింది నెక్కును బోసిగా ఉంచి.. సాంప్రదాయ శైలికి ఆధునిక సౌలభ్యం తో మేళవించి.. లేత గోధుమ రంగులో ఉన్న చీరను కట్టుకొని మెస్మరైజ్ చేసింది. ఇక చీర కట్టులో సింపుల్ లుక్ లో కనిపించి హొయలు పోయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం రిద్ధీ కుమార్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
రిద్ధీ కుమార్ ఫ్యామిలీ విషయానికొస్తే.. ఈమె ఒక సైనిక కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి ఇండియన్ ఆర్మీలో అధికారి. పూణేలోని ఫర్గూసన్ కాలేజ్ నుండి తత్వశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పట్టా అందుకున్న ఈమె.. సినిమాలోకి రాకముందు ప్రాంతీయ అందాల పోటీలలో , ఫ్యాషన్ షోలలో పాల్గొంటూ మోడలింగ్ చేసింది. ఇక చివరికి నటన వైపు అడుగులు వేసింది.