అన్నమాట నిజం చేసిన ఎన్టీఆర్ RAW టీమ్!
ఇక జూలై 18న ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం అంటూ వచ్చిన వార్తలను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖండించగా.. అందుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ కార్యాలయం పేరుతో ఒక లెటర్ రిలీజ్ చేశారు.
RAW NTR పేరుతో ఒక సంస్థ గత కొన్ని రోజులుగా విస్తృత ప్రచారం చేస్తూ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక జూలై 18న ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం అంటూ వచ్చిన వార్తలను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖండించగా.. అందుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ కార్యాలయం పేరుతో ఒక లెటర్ రిలీజ్ చేశారు. అందులో ఇలాంటి వార్తలను నమ్మవద్దని, RAW NTR సంస్థకు , ఎన్టీఆర్ కి ఎటువంటి సంబంధం లేదని అధికారికంగా స్పష్టం చేశారు.
అయితే దీనిపై స్పందించిన అన్నయ్య RAW NTR సంస్థ ఫౌండర్ సాయి రూప్ స్పందిస్తూ.."RAW NTR సంస్థ గత ఆరు సంవత్సరాలుగా పనిచేస్తోంది. అధికారిక సంస్థ మాది.. వెబ్సైట్ ఉంది.. 40వేల మంది వాలంటీర్స్ ఇందులో పనిచేస్తున్నారు. అసలు ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి అంటూ వచ్చిన లేఖ కే ఎలాంటి గుర్తింపు లేదు . అసలు ఆ లెటర్ గురించి ఎన్టీఆర్ కి తెలిసి ఉండదు. ఒకవేళ ఎన్టీఆర్ నేరుగా ఇవన్నీ వద్దు ఆపేయమంటే ఆపేస్తాము" అంటూ ఆయన తెలిపారు.
ఇకపోతే జూన్ 18వ తేదీన తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించి "ఊరు -వాడ సేవా కార్యక్రమం" మొదలు పెడతామని RAW NTR సంస్థ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అన్న మాట ప్రకారం తిరుపతిలో తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ సంస్థ వ్యవస్థాపకుడు సాయి రూప్ తమ సంస్థ చేపట్టనున్న ఊరు వాడా సేవా కార్యక్రమం పై పూర్తి వివరణ ఇచ్చారు. ఎన్టీఆర్ పేరును దుర్వినియోగం చేసే ఉద్దేశం మాకు లేదు. గత వారం రోజులుగా మా సంస్థ పై వస్తున్న ఆరోపణలు, నిందల నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న గందరగోళాన్ని క్లియర్ చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాము. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మా ప్రధాన లక్ష్యం.
ఒక సినిమా ఆడియో ఫంక్షన్ వేదికగా నందమూరి తారక రామారావు గారు "ఒకప్పుడు అభిమానాన్ని వృధా చేయకండి.. నలుగురికి ఉపయోగపడేలా చూడండి" అని చెప్పారు. ఆయనకు తెలియకుండా ఆయన నాటిన ఒక విత్తనం ఇవాళ పెరిగి పెరిగి ఒక వటవృక్షం అయింది. కానీ కొందరు ఆయన నాటిన విత్తనాన్నే, ఆయన మాటలు వింటూ పెరుగుతున్న ఒక వృక్షాన్ని అవమానించే పరిస్థితికి వచ్చేసారు. సేవ అంటే ఇంతలోనే చేయాలి.. అన్నదానమే చేయాలి.. రక్తదానమే చేయాలి అనే పరిమితులు ఉండవు. సేవ అంటే ఆకాశమే హద్దు అని మేము నమ్ముతాము. అతిశయోక్తి అనుకోకుంటే చెబుతాను నందమూరి తారక రామారావు గారి అభిమానులు చేసినన్ని సేవా కార్యక్రమాలు.. ఈ రాష్ట్రంలో ఇంకెవరూ చేయలేదు.
ఇది కేవలం మా సంస్థ అని మాత్రమే కాదు.. అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఎన్నో సంస్థలు ఉన్నాయి. ఒక్కొక్క అభిమానికి ఎన్జీవోలు, ఫ్యాన్స్ అసోసియేషన్ గ్రూపులలో ఎలా రిజిస్టర్ చేసుకోవాలో కూడా తెలియదు. అభిమానుల ఆవేదనను చూసాము. జాగోరే పేరిట మేము ఊరు వాడా తిరిగినప్పుడు ఇవన్నీ మాకు తెలిసాయి. అలాంటి అభిమానుల కోసం ఫైట్ చేయడానికి RAW NTR సంస్థ ఉంది. కాబట్టి మా నందమూరి తారక రామారావు గారు తలదించుకునే పని గానీ, ఆయన పేరును చెడగొట్టే పని కానీ మేము ఎప్పుడూ చేయము. అంటూ సాయి రూప్ తెలిపారు.
ఇక అలాగే ఇదే వేదికపై సాయిరూప్ మాట్లాడుతూ..
"నా వయసును దృష్టిలో పెట్టుకొని నన్ను క్షమించండి
నేను చిన్నవాడిని.. ఎప్పుడైనా ఎక్కడైనా మీ గురించి తప్పుగా మాట్లాడి ఉంటే.. నా కలలో కూడా అలాంటివి నేను చేయను" అంటూ క్లారిటీ ఇచ్చారు.