ఇంట్లోనే లాక్ చేసేస్తా నంటూ భర్తకు భార్య వార్నింగ్!
భోజుపురీ నటుడు ... లోక్‌సభ సభ్యుడు రవి కిషన్ సోషల్ మీడియాలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.
భోజుపురీ నటుడు ... లోక్‌సభ సభ్యుడు రవి కిషన్ సోషల్ మీడియాలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇటీవల ఆయన పాల్గొన్న పాడ్‌కాస్ట్ క్లిప్‌లు, ముఖ్యంగా `జల్దీ ది లేట్` ,`మనీ ఫాలోస్ మై బ్రదర్స్` వంటి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ మీమ్స్‌గా మారాయి. ఈ క్రేజీ ట్రెండ్‌పై రవి కిషన్ స్పందిస్తూ భార్య ప్రీతి శుక్లా తనకు సరదాగా ఓ హెచ్చరిక జారీ చేసినట్లు వెల్లడించారు. మీమ్స్ సృష్టించే జనరేషన్-జీ సృజనాత్మకతను రవి కిషన్ ప్రశంసించారు. తన మాటలను మీమ్స్‌గా మార్చడం వారి ప్రేమకు సంకేతమని భావిస్తున్నారు.
అయితే ప్రతి చిన్న మాట కూడా మీమ్ మెటీరియల్‌గా మారుతుండటంతో కొంతకాలం మౌనంగా ఉండాలని రవికిషన్ నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న అపారమైన అటెన్షన్ ఆయన్ని ఇలా ఆలోచించేలా చేసింది. ఈ విషయంపై రవి కిషన్ భార్య ప్రీతి శుక్లా స్పందన చాలా ఫన్నీగా ఉంది. 'మీరు ఇంటి నుంచి బయటకు వెళ్తే చాలు ఏదో ఒకటి వైరల్ అవుతోంది. దయచేసి కొద్ది రోజులు కాస్త నిశ్శబ్దంగా ఉండండి. లేదంటే మిమ్మల్ని గదిలోనే లాక్ చేసేస్తాను' అని సరదాగా హెచ్చరించారు. భర్త వైరల్ కావడంపై భార్య తనదైన శైలిలో పిల్లలకు కూడా ఇదే విషయాన్ని చెప్పి నవ్వులు పూయించారు.
గత కొన్ని వారాలుగా రవి కిషన్ పాత .. కొత్త వీడియో క్లిప్‌లు, డ్యాన్స్ వీడియోలు , ఇంటర్వ్యూల నుంచి సేకరించిన ముక్కలు సోషల్ మీడియాలో భారీగా షేర్ అవుతున్నాయి. రవికిషన్ పలికిన కొన్ని డైలాగులు నెటిజన్ల ఫేవరెట్ మీమ్స్‌గా మారాయి. రవి కిషన్ కూడా వీటిని స్పోర్టివ్‌గా తీసుకుంటున్నారు. ఆయనా ఇంటర్నెట్ వినియోగ దారులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఒక వ్యక్తిని వైరల్ స్టార్‌గా మార్చడం సర్వసాధారణం అయిపోయింది. అయితే ఈ వైరల్ ట్రెండ్స్‌ను రవి కిషన్ వంటి రాజకీయ .. చలనచిత్ర ప్రముఖులు ఎంత స్పోర్టివ్‌గా తీసుకుంటున్నారో? చెప్పడానికి ఒక నిదర్శనం. మీమ్స్ ద్వారా అభిమానులతో కనెక్ట్ అవ్వడం ఇప్పుటి స్టార్స్‌కు కొత్త మార్గంగా మారింది.
మరోవైపు రవి కిషన్ తదుపరి చిత్రం `మీర్జాపూర్: ద మూవీ` కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమా పట్ల ప్రేక్షకులు భారీ అంచనాలతో ఉన్నారు. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు వంటి అగ్రనటులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.