'రాకా' షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న 'రాకా' పై పాన్ ఇండియాలో ఎలాంటి అంచ‌నాలున్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు.

Update: 2026-08-15 17:04 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న 'రాకా' పై పాన్ ఇండియాలో ఎలాంటి అంచ‌నాలున్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికే షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. అయితే ఇదే సినిమా షూటింగ్ లో సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తోన్న‌ నేషనల్ క్రష్ రష్మిక మందన్న గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. దీంతో అప్ప‌టి నుంచి షూట్ అప్ డేట్ ఏదీ బ‌య‌ట‌కు రాలేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా ర‌ష్మిక గాయం కార‌ణంగా వైద్యులు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. నటీనటుల ఆరోగ్యం, శారీరక క్షేమమే అన్నింటికంటే ముఖ్యం అని భావించిన అట్లీ , చిత్ర నిర్మాణ సంస్థ ఎలాంటి రిస్క్ తీసుకోకుండా షూటింగ్‌కు కొద్దిరోజుల పాటు బ్రేక్ ఇవ్వాలని తాజాగా నిర్ణయించారు.

రష్మిక పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆమెపై వచ్చే కీలక సన్నివేశాల షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ అనూహ్య పరిణామం కారణంగా రాకా షూటింగ్ షెడ్యూల్ దాదాపు 45 రోజుల పాటు ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెల వరకు రెగ్యులర్ షూటింగ్ వాయిదా పడే అవకాశం ఉంది. అత్యంత భారీ సెట్లు, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో రూపొందుతున్న చిత్రానికి ఇలాంటి చిన్న విరామాలు రావడం సహజమే అయినా? షూటింగ్ ఆలస్యం కావడం అభిమానులను నిరాశపరుస్తోంది.

అయినా దర్శకుడు అట్లీ ఈ గ్యాప్‌ను ఇతర ప్రీ-ప్రొడక్షన్ , వీఎఫ్ఎక్స్ పనులకు ఉపయోగించుకుంటున్నట్లు సమాచారం. సినిమాలో రష్మిక మందన్న పాత్ర అత్యంత కీలకం కావడంతో ఆమె లేకుండా మిగిలిన చిన్నపాటి సన్నివేశాలను ... . అర్టిస్టులపై పనులను బ్యాలెన్స్ చేసే దిశగా మేకర్స్ అడుగులు వేస్తున్నారు. ఏది ఏమైనా? నటీనటుల ఆరోగ్యం పట్ల చిత్ర యూనిట్ చూపుతున్న శ్రద్ధ ప్రశంసనీయం.

రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆమె నటించే ప్రతి చిత్రంలోనూ తన పాత్రకు వంద శాతం న్యాయం చేయడానికి ఆమె పడుతున్న కష్టం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే జరిగిన చిన్న ప్రమాదం నుంచి ఆమె త్వరగా కోలుకోవాలని.. మళ్లీ పూర్తి ఆరోగ్యంతో సెట్స్‌లోకి తిరిగి రావాలని అల్లు అర్జున్ అభిమానులు, ఇటు రష్మిక ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.

అలాగే ర‌ష్మిక పూర్తి చేయాల్పిన ఇత‌ర ప్రాజెక్ట్ లు కూడా తాత్కాలికంగా బ్రేక్ ప‌డుతుంది. మేక‌ర్స్ అంతా ర‌ష్మిక‌ లేని స‌న్నివేశాలు ఈ గ్యాప్ లో పూర్తి చేస్తారు. తిరిగి ర‌ష్మిక కోలుకున్న త‌ర్వాత ఆమెపై షూట్ నిర్వ‌హించ‌నున్నారు. ఇదే స‌మ‌యంలో ర‌ష్మిక గ్యాప్ లేకుండా ప‌ని చేయాల్సి ఉంటుంది. `రాకా`తో పాటు ఇత‌ర ద‌ర్శ‌కుల‌కు కూడా ఏక కాలంలో డేట్లు ఇవ్వాల్సి ఉంటుంది.

Tags:    

Similar News